న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్‌తో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు వణికిపోతున్న విషయం తెలిసిందే. చైనాలో ప్రారంభమయిన కరోనా వైరస్ క్రమక్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. కరోనా వైరస్‌ను అరికట్టాలనే సంకల్పంతో శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. భారతీయ సంతతి శాస్త్రవేత్త ఎస్ఎస్ వాసన్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా బృందం వైరస్‌ను నిరోధించే వ్యాక్సిన్ కనిపెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఆస్ట్రేలియాలోని కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (సిఎస్ఐఆర్ఓ) హై సెక్యూరిటీ ల్యాబ్ పరిశోధనల్లో కరోనాకు విరుగుడు కనిపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు చైనా వ్యప్తంగా 31,000 కరోనా కేసులు నమోదయ్యాయి.
సీఎస్ఐఆర్ఓ పరిశోధకుల ప్రాథమిక అధ్యయనంలో వైరస్ పెరుగుదలను గుర్తించారు. ఈ వ్యాక్సిన్‌పై వాసన్ మాట్లాడుతూ.. రక్త నమూనాల నుంచి వైరస్‌ను డోహెర్టీ ఇన్‌స్టిట్యూట్ ఉద్యోగులు వేరు చేశారని అన్నారు. ఈ సమాచారాన్ని తమకు అందజేసిన డోహెర్టీ ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సిన్.. వైరస్ సోకినవారిపై ప్రయోగించి, వ్యాక్సిన్ సమర్ధతను పరీక్షిస్తామని, వేగంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తున్నామని వాసన్ తెలిపారు.
కరోనాకు వ్యాక్సిన్‌ను కనుగొనడంలో ఆస్ట్రేలియన్ ఎనిమల్ హస్బెండరీ లేబొరేటరీ(ఏఏహెచ్‌ఎల్) అత్యాధునిక సదుపాయాలు అందించినట్లు సీఎస్ఐఆర్ఓ తెలిపింది. శ్వాసకోశ వ్యవస్థలో ఈ వైరస్ ఏ విధంగా వ్యప్తి చెందుతుందో గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపారు. కరోనాకు వ్యాక్సిన్ విషయంలో పూర్తిస్థాయిలో చికిత్సకు అవసరమైన పరిశోధనలు వేగవంతం చేసినట్టు వాసన్ పేర్కొన్నారు
వాసన్ బిట్స్ పిలానీ, ఐఐఎస్‌సీ-బెంగళూరులో తన చదువును పూర్తి చేయగా, రోడ్స్ స్కాలర్‌షిప్ సహకారంతో ఆక్స్‌ఫర్డ్‌లోని ట్రినిటీ కాలేజీలో పరిశోధనలు చేశారు. డెంగ్యూ, చికెన్‌గున్యా, జికా లాంటి వైరస్‌ల అధ్యయనంలో వాసన్ కీలక పరిశోధనలు చేసిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment