బీజింగ్: కరోనా మహమ్మారి జిత్తులు ఒక్కటొక్కటిగా ప్రపంచానికి తెలుస్తున్నాయి. వ్యాధి బారిన పడి ఓ మోస్తరు లక్షణాలు మాత్రమే కనపరిచిన వారికి చికిత్స చేశాక.. ఆ లక్షణాలు కనిపించక పోయినా, ఎనిమిది రోజుల పాటు వైరస్ వారి శరీరంలోనే ఉన్నట్లు గుర్తించామని భారతీయ సంతతి శాస్త్రవేత్త లోకేశ్ శర్మ చైనాలో నిర్వహించిన ఒక పరిశోధన చెబుతోంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ రెస్పిరేటరీ అండ్ క్రిటికల్ కేర్ మెడిసిన్ తాజా సంచికలో పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. బీజింగ్‌లోని పీఎల్‌ఏ జనరల్ ఆసుపత్రిలో జనవరి 28 నుంచి ఫిబ్రవరి 9 మధ్యకాలంలో కరోనా చికిత్స పొందిన 16 మందిపై తాము పరిశోధనలు చేశామని లోకేశ్ శర్మ తెలిపారు. పదహారు మంది రోగుల నుంచి తాము రోజు విడిచి రోజు నమూనాలు సేకరించామని, చికిత్స తరువాత వైరస్ లేనట్లు పరీక్షలు నిర్ధారించినప్పటికీ సగం మందిలో మరో ఎనిమిది రోజులపాటు వైరస్ వారి శరీరంలో ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలిందని చెప్పారు. (కరోనా ఎఫెక్ట్: ‘ఆమె మాట’కే ఇప్పుడు క్రేజ్)
Comments
Please login to add a commentAdd a comment