ఆసిన్ ప్రపంచ పర్యటన, పారిస్ లో జన్మదిన వేడుకలు!
చెన్నై: ప్రపంచ పర్యటన చేస్తున్న బాలీవుడ్ నటి ఆసిన్ పారిస్ నగరంలో జన్మదిన వేడుకల్ని జరుపుకున్నారు. ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న ఆసిన్ జన్మదిన వేడుకల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు పాలుపంచుకుంటారని ఆమె సన్నిహితులు మీడియాకు వెల్లడించారు. ఆదివారం అక్టోబర్ 26 తేదిన ఆసిన్ 29 ఏట అడుగుపెడుతున్నారు.
దక్షిణాదిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఆసిన్ 2008లో గజిని చిత్రంతో బాలీవుడ్ స్టార్ గా మారారు. ఆతర్వాత లండన్ డ్రీమ్స్, రెఢీ, బోల్ బచ్చన్ చిత్రాల్లో నటించింది. ఉమేశ్ శుక్లా నిర్మిస్తున్న 'ఆల్ ఈజ్ వెల్' చిత్రంలో అభిషేక్ బచ్చన్ సరసన నటిస్తోంది.