వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 45వ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు, కమిటీ సభ్యులు రక్తదానం చేశారని వైఎస్సార్‌సీపీ గల్ఫ్ కువైట్ కన్వీనర్ ఇలియాస్, బి.హెచ్.ఎం.బాలిరెడ్డి సంయుక్తంగా ఒక ప్రకటనలో తెలిపారు. కువైట్ జాబ్రియా ప్రాంతంలో ఉన్న బ్లడ్ బ్యాంక్‌లో కమిటీ సభ్యులు మర్రి కళ్యాణ్, పి.రఫీక్‌ఖాన్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించిందని చెప్పారు. తమ అభిమాన నాయకుడి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు.