సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని ప్రభుత్వానికి అంటగట్టనిదే ఈనాడు రామోజీరావుకు నిద్రపట్టడం లేదు. శ్రీకాకుళం జిల్లాలో కొందరు వ్యక్తుల మధ్య ఆవేశకావేశాలతో జరిగిన ఘర్షణకు గంజాయే కారణమని, అది సర్కారు నిర్వాకమని వక్రీకరించింది. గంజాయి మత్తులో రాష్ట్రంలో నేరాలు పెరుగుతున్నట్టు అవాస్తవాలతో ప్రభుత్వంపై బురద జల్లేందుకు యత్నంచింది. ‘గంజాయి రాజ్యంలో ముఠాల అరాచకం’ శీర్షికన గురువారం దుష్ప్రచారానికి పూనుకుంది.
వాస్తవాల్లోకి వెళితే.. శ్రీకాకుళంలోని దమ్మాలవీధికి చెందిన టీడీపీ మాజీ కౌన్సిలర్ కేశవ రాంబాబు ఈ నెల 23న రాత్రి 8.30 గంటలకు తన బైక్‌పై వెళుతూ మార్గం మధ్యలో కొందరు యువకులతో ఘర్షణ పడ్డారు. దిల్లేశ్వరరావు అనే వ్యక్తి పుట్టిన రోజు వేడుకల సందర్భంగా ట్రాఫి క్‌కు అంతరాయం కలిగింది. దీనిపై తన బైక్‌కు దారి ఇవ్వమని రాంబాబు ఆ వేడుకల్లో ఉన్న యువకులను అడిగారు. దాంతో మాధవ్, దేవా, కార్తిక్ అనే యువకులతో రాంబాబుకు వా గ్వాదం మొదలై ఘర్షణకు దారితీసింది. దాంతో ఒకరిని ఒకరు నెట్టుకున్నారు. రాంబాబు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా ఇరువర్గాల వారు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దాంతో ఆ సామాజికవర్గ పెద్దలు వారి మధ్య రాజీ కుదిర్చారు. ఆ మేరకు రాంబాబు రాజీ లేఖను పోలీసులకు సమర్పంచారు. ఆ లేఖను న్యా యస్థానానికి నివేదించి అనంతరం న్యాయస్థానం ఆదేశాలతో తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనను ఈనాడు వక్రీకరించి గంజాయి మత్తు లో ఘర్షణ జరిగిందంటూ దుష్ప్రచారం చేసి, చంద్రబాబుకు అనుకూల వాతావరణం సృష్టించా లని పచ్చపాతాన్ని ప్రదర్శించడం దారుణం.
Comments
Please login to add a commentAdd a comment