అవి జిరాక్సు కాపీలు కాదు.. ఈ–స్టాంపులు
పలు రాష్ట్రాల్లో అమల్లో ఉంది
నేషనల్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ద్వారా అమలు
పాతికేళ్ల క్రితం...
» రైల్వే ప్రయాణంలో టీసీ టికెట్ చూపించమని అడిగితే... చిన్న అట్టముక్కలాంటి టికెట్ చూపించేవాళ్లం. ఇప్పుడు సెల్ ఫోన్లో టిజిటల్ కాపీ చూపిస్తున్నాం. టీసీల దగ్గర కూడా ఓ అట్ట దానికి తగిలించిన కాగితాలు ఉండేవి. దాన్లో ఉన్న పేర్లపై టిక్కులు పెట్టుకునేవారు. ఇప్పుడు వారి చేతుల్లోకి ట్యాబ్‌లు వచ్చాయి.
» బ్యాంకుల్లో విత్‌డ్రాయల్‌కు గాని, డిపాజిట్ చేయడానికి గాని వెళ్తే పని పూర్తవడానికి ఓ పూట పట్టేది. నేడు మన చేతుల్లోకి ఏటీఎం కార్డులు వచ్చాయి. క్షణాల్లో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. డిపాజిట్ చేసుకోవచ్చు. అసలు బ్యాంకులకే వెళ్లకుండా ఈ–బ్యాంకింగ్ ద్వారా ఇంటి వద్ద నుంచే లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. అసలు పాసు పుస్తకాలనే బ్యాంకులు ఇవ్వడం మానేసాయి. మన చేతిలో ఉన్న ఆ చిన్న కార్డులోనే మన వివరాలన్నీ పొందుపరిచి ఉంటాయి. ఆ కార్డు ద్వారానే మన లావాదేవీలన్నీ క్షణాల్లో తెలుసుకోవచ్చు.
» ఒకప్పుడు మన వాహన రిజిస్ట్రేషన్, లైసెన్సు, ఇన్సూరెన్సు పత్రాలు కాగిత రూపంలో ఉండేవి. వాటిని ఓ పర్సులాగా బైండ్ చేయించుకునే వాళ్లం. ఇప్పుడు ఓ బెత్తెడంత డిజిటల్ ప్లాస్టిక్ కార్డు చాలు. అందులోనే మన వాహనం పుట్టుపూర్వోత్తరాలు ఉంటాయి.
» వ్యవసాయ భూములు వివరాల కోసం ప్రాథమికంగా చూసేది అడంగల్–బి ఫారం. ఒకప్పుడు దీన్ని పొందాలంటే వారాలు, నెలలు పట్టేది. ఇప్పుడది మీ చేతుల్లో సెల్ ఫోన్ ఉంటే చాలు క్షణాల్లో తెలుసుకోవచ్చు. ఏ ఈ–సేవ కేంద్రానికి వెళ్లినా ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
గత పాతికేళ్లుగా ప్రపంచమంతా విస్తరించిన డిజిటల్ విప్లవం ద్వారా ఇవన్నీ సాధ్యమయ్యాయి. ప్రపంచగతినే మార్చేసిన ఈ సాంకేతికతను రిజిస్ట్రేషన్ల శాఖ కూడా అందిపుచ్చుకుంది. స్టాంపు పేపర్లపై జరిపే లావాదేవీలను డిజిటల్ రూపంలోకి మార్చి తన సర్వర్లో నిక్షిప్తం చేస్తుంది. దాన్నే మనకు అందిస్తుంది. అంతేగానీ అవి జిరాక్సు కాపీలు కాదు. ప్రతి డిజిటల్ కాపీపై క్యూఆర్ కోడ్ ముద్రించి ఉంటుంది. దాన్ని స్కాన్ చేస్తే చాలు.
మన ఆస్తి రిజిస్ట్రేషన్ వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి. ఈ నూతన సాంకేతిక విధానాన్నే ఈ–స్టాంపింగ్ అంటున్నాం. ఇంత గొప్ప సాంకేతిక వ్యవస్థను వ్యతిరేకిస్తున్నది ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, అతని తాబేదారు రామోజీరావు మాత్రమే. ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి చంద్రబాబు పిచ్చి కూతలు కూస్తే... దాన్ని వ్యాప్తి చేయడానికి రామోజీ పచ్చిరాతలు రాస్తున్నాడు.
సాంకేతికత అందిపుచ్చుకోవడం తప్పా గురివిందా
సాంకేతికత అభివృద్ధి చెందిన కొద్దీ ప్రభుత్వ వ్యవస్థల్లో జరిగే మార్పుల్ని కూడా రామోజీ పత్రిక తప్పుదోవ పట్టిస్తూ పచ్చ పైత్యం పరాకాష్టకు చేరిందని నిరూపించుకుంటోంది. అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న ఈ–స్టాంపింగ్ విధానంలో జారీ అయ్యే స్టాంపు పత్రాలను జిరాక్స్ కాపీలని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. నాన్–జ్యుడీíÙయల్ స్టాంప్ పేపర్ల వినియోగం చాలా రాష్ట్రాల్లో తగ్గిపోయింది.
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ వివిధ రాష్ట్రాల్లో ఈ–స్టాంపింగ్ విధానాన్ని అమలు చేస్తోంది. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి చెందిన దేశాల్లో మాదిరిగా డిజిటల్ స్టాంపుల వినియోగం తప్పనిసరి అనే ఉద్దేశంతో ఈ–స్టాంపింగ్ వ్యవస్థను చాలా ఏళ్ల క్రితమే కేంద్రం ప్రవేశ పెట్టింది. అదే సమయంలో నాన్–జ్యుడీíÙయల్ స్టాంప్ పేపర్లను పూర్తిగా రద్దు చేయలేదు. ప్రజల్లో అవగాహన కోసం స్టాంప్ పేపర్లు, ఈ–స్టాంపింగ్ వ్యవస్థ రెండింటినీ అందుబాటులో ఉంచింది.
మన రాష్ట్రంలోనూ ఏడాదిన్నరగా నేషనల్ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ అనుమతించిన కామన్ సర్విస్ సెంటర్ల ద్వారా ఈ–స్టాంపులను జారీ చేస్తోంది. ఇవి జిరాక్స్ కాపీలని చెప్పడం అంటే కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పు పట్టడమే. ఆస్తి కొనుగోళ్ల వ్యవస్థను గతం కంటే పారదర్శకంగా చేయడాన్ని వ్యతిరేకించడమేకాకుండా సాంకేతికాభివృద్ధిని కూడా తప్పుదోవ పట్టించే స్థాయికి రామోజీ దిగజారిపోయారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లపై తప్పుడు ప్రచారం
అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్డ్ ప్రైమ్ రిజిస్ట్రేషన్ల విధానంపైనా ఈనాడు తన పైత్యపు రాతలు రాసింది. ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్లు చేసుకునే క్రమంలో కార్డ్ ప్రైమ్ సాఫ్ట్‌వేర్‌ను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అభివృద్ధి చేసింది. దీని ద్వారా వినియోగదారులు డాక్యుమెంట్ రైటర్లపై ఆధారపడకుండానే రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లోనే మోడల్ డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించింది.
రిజిష్టర్ చేసుకునే ఆస్తి, వివరాలను ఎవరికివారే పూర్తి చేసుకునే డేటా ఎంట్రీ విధానం ఇందులో భాగమే. అంటే గతంలో మాదిరిగా తమ ఆస్తి డాక్యుమెంట్‌ను డాక్యుమెంట్ రైటర్లు కాకుండా తామే తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న డాక్యుమెంట్‌ను సబ్ రిజి్రస్టార్ కార్యాలయంలో రిజిష్టర్ చేసి ప్రింట్ ఇస్తారు. దీనిపైనా ఎల్లో మీడియా విష ప్రచారం చేసి రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక డాక్యుమెంట్లు ఇవ్వకుండా జిరాక్స్ పత్రాలు ఇస్తారనే దు్రష్పచారం చేస్తోంది.
జిరాక్స్ పత్రాలనే ప్రచారం ప్రజల్లో భయాందోళనలు సృష్టించడానికి ఎల్లో మీడియా, కొందరు డాక్యుమెంట్ రైటర్లు చేసేదే తప్ప నిజానికి అది స్టాంప్ పేపర్ల కంటే అత్యంత భద్రమైన ఆన్‌లైన్ విధానం. ఇటీవల కార్డ్ ప్రైమ్ అమలుకు సంబంధించి జారీ అయిన మెమోను ల్యాండ్ టైట్లింగ్ చట్టం అమలు కోసం జారీ చేసిందిగా పేర్కొంటూ దు్రష్పచారానికి తెరదీశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అధికారులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment