
సీనియర్ నటుడు కైకాల బర్త్‌డే నేడు. సోమవారం(జూలై 25న) ఆయన 87వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన జన్మదిన వేడుకను నిర్వహించారు. ఇందుకోసం స్వయంగా కైకాల ఇంటికి వెళ్లి బెడ్‌పైనే ఆయనతో కేక్ కట్ చేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిరు షేర్ చేస్తూ కైకాలకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
చదవండి: ‘ఒక్క సినిమా కంటే ఎక్కువ చేస్తాననుకోలేదు.. మీ ప్రేమకు కృతజ్ఞురాలిని’
ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ‘పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది. ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను’ అంటూ రాసుకొచ్చారు. కాగా కైకాల ప్రస్తుతం వృద్యాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బెడ్‌పైనే చికిత్స పొందుతున్నారు. ఆయన కనీసం నిలబడి లేని, కదలలేని స్థితిలో ఉన్నారు. దీంతో ప్రస్తుతం ఆయన బెడ్‌పైనే చికిత్స పొందుతున్నారు.
పెద్దలు శ్రీ కైకాల సత్యనారాయణ గారి పుట్టినరోజున,వారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయటం ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చింది.
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 25, 2022
ఆ భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటుంటున్నాను 💐💐🙏🏻 pic.twitter.com/Dt2Yo2rp6i