![Actor Kaikala Satyanarayana Last Wish Not Fulfilled - Sakshi](/styles/webp/s3/article_images/2022/12/23/Kaikala-Satyanarayana_1.jpg.webp?itok=JUZphPqJ)
యముండ.. అంటూ గర్జించిన కైకాల సత్యనారాయణ గొంతు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. హీరోగా, విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. ఇలా అన్నిరకాల పాత్రలు పోషించి నవరసాలను పండించిన ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. యముడు, ఘటోత్కచుడు, కృష్ణుడు, దుర్యోధనుడు, రావణాసురుడు.. వంటి పౌరాణిక పాత్రల్లో జీవించేసిన కైకాల సత్యనారాయణ ఇక సెలవంటూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఏడు వందలకు పైగా సినిమాల్లో నటించిన ఆయనకు ఓ బలమైన కోరిక ఉండేదట. మల్టీస్టారర్ సినిమాల్లో నటించాలని తపించారట.
గతంలో నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు కలిసి నటించిన దేవుడు చేసిన మనుషులు చిత్రంలో కైకాల ముఖ్య పాత్ర పోషించారు. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాతి జనరేషన్ అయిన చిరంజీవి, బాలకృష్ణ మల్టీస్టారర్ మూవీ చేస్తే అందులో నటించాలని తెగ ఆరాటపడ్డారట. కానీ ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారాయన. ఇక ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ జంటగా నటించిన ఆర్‌ఆర్‌ఆర్ మూవీ చూసి చాలా సంతోషించారట కైకాల. ఇలా చిరు, బాలయ్య కాంబినేషన్‌లో కలిసి నటిస్తే బాగుండనుకున్నారట.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: కైకాల సత్యనారాయణ చివరి వీడియో ఇదే!
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment