చిరు బర్త్‌డే: ఫ్యాన్స్‌కు మెగా డాటర్‌ స్పెషల్‌ గిఫ్ట్‌ | Shoot At Out Alair First Look Motion Poster Released | Sakshi
Sakshi News home page

‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల

Published Sat, Aug 22 2020 12:30 PM | Last Updated on Sat, Aug 22 2020 3:31 PM

Shoot At Out Alair First Look Motion Poster Released - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డేను అభిమానులు పండుగలా సెలబ్రేట్‌ చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో బహిరంగ వేడుకలు జరిపే అవకాశంలో లేకపోవడంతో తమ అభిమాన హీరోకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వీరిలో మెగా హీరోలు కూడా ఉన్నారు. ఇక చిరు బర్త్‌డే సందర్భంగా ఆయన పెద్ద కుమార్తె సుష్మితా కొణిదెల మెగా ఫ్యాన్స్‌కు ఓ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. ‘జీ 5’ ఓటీటీ కోసం భర్త విష్ణుప్రసాద్‌తో కలిసి నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.  
(చదవండి : చిరు బర్త్‌డే : ప్రముఖుల శుభాకాంక్షలు

చిరంజీవి తనయ సుష్మిత కొణిదెల నిర్మాణ సంస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి ‘గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ నిర్మాణ సంస్థను ఆమె నెలకొల్పారు.  ‘జీ 5’ అసోసియేష‌న్‌తో ఒక వెబ్ సిరీస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ టైటిల్ ఖరారు చేశారు.

మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. రెగ్యులర్ మోషన్ పోస్టర్స్ టైపులో కాకుండా స్టోరీ టెల్లింగ్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం విశేషం. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ప్రధాన కీలక పాత్రలు వహిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌కి ఆనంద్‌ రంగా దర్శకుడిగా వ్యవహరించనున్నారు. హైదరాబాద్‌లోని ఓ పోలీస్‌, కొంత మంది కరుడు గట్టిన నేరస్థుల కథల ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement