మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘గాడ్‌ఫాదర్’. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ నుంచి మేకర్స్ తరచూ ఏదోక అప్‌డేట్ వదులుతూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇటీవల చిరు బర్త్‌డే సందర్భంగా విడుదలైన సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక ఇప్పటికే విడుదలై ఫస్ట్‌లుక్ పోస్టర్లకు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమాలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కీ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.
చదవండి: బాలీవుడ్ లవ్‌బర్డ్స్ పెళ్లి ఏర్పాట్లు షురూ? సౌత్ ముంబైలో రాయల్ వెడ్డింగ్!
తాజాగా ఈ సినిమాలోని నయన్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా నయన్ రోల్‌ను కూడా పరిచయం చేసింది మూవీ యూనిట్. ఇందులో ఆమె సత్యప్రియ జయదేవ్‌గా కనిపించనుంది. ఈ పోస్టర్‌లో నయన్ సీరియస్‌గా టైపింగ్ చేస్తూ కనిపిస్తున్న నయన్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపుతుంది. దీంతో గాడ్ ఫాదర్ ఆమె రోల్ కీలకంగా ఉండనుందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో నయనతార, చిరు చెల్లెలిగా నటిస్తుందనే విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment