1/11
ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్-నీతాఅంబానీల గారాలపట్టి ఇషా అంబానీ పిల్లల పుట్టినరోజు వేడుకలను తమ నివాసమైన యాంటిలియాలో ఘనంగా జరుపుకున్నారు.
2/11
ఈ సందర్భంగా యాంటిలియాలో ‘క్యాండీ హౌజ్’ను ఏర్పాటు చేశారు. తీరైన పువ్వులు, బెలూన్లతో తమ మాన్షన్‌ను అలంకరించారు.
3/11
2018లో వ్యాపారవేత్త ఆనంద్ పిరమాల్‌ను పెళ్లాడిన ఇషా.. 2022లో కృష్ణ, ఆదియా అనే ఇద్దరు కవల చిన్నారులకు జన్మనిచ్చారు.
4/11
ఐవీఎఫ్ ద్వారా ఈ కవలలకు జన్మనిచ్చినట్లు ఆమె గతంలో వెల్లడించారు.
5/11
ఇషా తల్లి నీతా అంబానీ కూడా ముందుగా గర్భం దాల్చినప్పుడు ఈ ప్రక్రియనే ఎంచుకున్నట్లు పేర్కొన్నారు.
6/11
ఈ విషయాన్ని చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదన్నారు.
7/11
టెక్నాలజీ వేగంగా వృద్ధి చెందుతున్న తరుణంలో ఐవీఎఫ్ ఎందుకు ఎంచుకోకూడదని ఇషా అంబానీ గతంలో అన్నారు.
8/11
ఇషా అంబానీ ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, రిలయన్స్ ట్రెండ్స్, టిరా బ్యూటీ, అజార్ట్, హామ్‌లేస్, నెట్‌మెడ్స్.. వంటి కంపెనీలకు సారథ్యం వహిస్తున్నారు.
9/11
10/11
11/11