Twins
-
వేగాన్ వర్సెస్ నాన్‌వెజ్ డైట్: ఈ ట్విన్స్ ప్రయోగంలో ఏ డైట్ మంచిదంటే..?
ఇటీవల కాలంలో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది. సోషల్‌మీడియా పుణ్యామా..? అని రకరకాల డైట్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఏది మంచిది అని డిసైడ్ చేసుకోలేని కన్ఫూజన్లో పడేసేలా ఊదరగొడుతున్నాయి. అయితే ఆ సమస్యకు చెక్‌పెట్టేలా ఈ ఇద్దరు కవలలు ఓ ప్రయోగానికి పూనుకున్నారు. అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండే ఈ కవల సోదరులు వేగాన్ వర్సెస్ నాన్‌వెజ్ డైట్లో ఏది బెటర్ అనే దాని గురించి తమ శరీరాలపై తామే ప్రయోగాలు చేసుకున్నారు. అంతేగాదు ఇద్దరూ ఏ డైట్ ఆరోగ్యకరమైనదో వైద్యపరంగా నిర్థారించి మరీ చెప్పారు.యూకేలోని డెవాన్లోని ఓ గ్రామానికి చెందిన రాస్, హ్యూగో టర్నోర్ అనే కవలలు ఇద్దరూ చూడటానికి ఒకేలా ఉంటారు. ఈ ఇద్దరు ఆహారం, ఫిట్నెస్కి సంబంధించి పలు ప్రయోగాలు చేస్తుంటారు. ఆ క్రమంలోనే ఈసారి మొక్కల ఆధారిత వర్సెస్ జంతువుల ఆధారిత డైట్లలో ఏది ఆరోగ్యానికి మంచి ఫలితాలనిస్తుంది దాని గురించి తమపైనే ప్రయోగాలు చేసుకుని మరీ నిర్థారించి చెప్పారు. అందుకోసం ఆరు నెలలపాటు ఈ 36 ఏళ్ల కవలలు దాదాపు ఒకేలాంటి జీవనశైలిని అనుసరించారు. అయితే తీసుకునే ఆహారంలోనే వ్యత్యాసం ఉంటుంది. హ్యూగో సముద్రపు ఆల్గే , మొక్కల ఆధారిత ఒమేగా 3 నూనెలు, మొక్కల ఆధారిత సప్లిమెంట్లు తదితరాలు తీసుకున్నాడు. రాస్ సాంప్రదాయ జంతు ఆధారిత విటమిన్లు తీసుకున్నాడు. అయితే ఆరు నెలల తదనంతరం ఇరువురిలో అద్భుతమైన మార్పులు, ఫలితాలు కనిపించాయి. ఇక్కడ హ్యూగో రక్తం పోషకాలతో కనిపించింది. కీలకమైన విటమిన్లు డీ3, కొవ్వు ఆమ్లాలు సమస్థాయిలో ఉన్నాయి. ఇక రాస్ తీసుకున్న నాన్ వెజ్ ప్రోటీన్లకు మించి హ్యగో శరీరంలో మెరుగైన స్థాయిలో విటమిన్లు ఉన్నాయి. వారిద్దరూ కూడా ఈ డైట్లలో ఇంత తేడా ఉంటుందని అనుకోలేదట. రక్తపరీక్షల్లో హ్యూగో ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఒమేగా-3, విటమిన్ D3 పుష్కలంగా ఉన్నాయి హ్యూగో బాడీలో. కేవలం రక్తపరీక్షలే గాక, కొవ్వులు, ఆమ్లలాల స్థాయిలతో సహా ప్రతీది ట్రాక్ చేశారు. అయితే ఈ డైట్లలో మొక్కల ఆధారిత వెర్షన్ మెరుగైన ఫలితాలనిచ్చింది. రాస్ తిన్న సాల్మన్ చేపల కంటే సముద్రపు పాచి సప్లిమెంట్లోనే విటమిన్ డీస్థాయిలు, మంచిరోగ నిరోధక శక్తిని హ్యూగోకి అందించాయి. అంతేగాదు శాకాహారం శరీరంలో కొవ్వుని తగ్గించి మెరుగైన శక్తి స్థాయిలను ప్రోత్సహించదని తేలింది. ఇలాంటి ప్రయోగాలు ఆ కవలలకు తొలిసారి కాదు. గతంలో అధిక కార్బ్ వర్సెస్ అధిక కొవ్వు ఆహారాలలో ఏది మంచిదో తెలుసుకోవాలని ప్రయోగాలు చేశారు కూడా. దానిలో రాస్ పాస్తా, బియ్యం వంటి కార్బొహైడ్రేట్లు తీసుకోగా, హ్యూగో గుడ్లు, వెన్న వంటి వాటిని తీసుకున్నారు. అయితే రాస్ కొలస్ట్రాల్‌ని కోల్పోగా, హ్యూగో మిశ్రమ ఫలితాలు అందుకున్నారు. పైగా అందులో ప్రమాదకరమైన చెడెకొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఉన్నాయి. చివరగా ఈ కవల ఫిట్నెస్ ప్రయోగాల వల్ల మొక్కల ఆధారిత సప్లిమెంట్స్ ప్రయోజనాలు హైలెట్ చేయడమే గాక సాంప్రదాయ పోషకాహారం గురించి చాలకాలం నుంచి ఉన్న అపోహలు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. అంతేగాదు మన ఆరోగ్యంలో ఆహారం ఎంత కీలకపాత్ర పోషిస్తుందని అనేది తేటతెల్లమైంది కూడా. View this post on Instagram A post shared by 𝗧𝗛𝗘 𝗧𝗨𝗥𝗡𝗘𝗥 𝗧𝗪𝗜𝗡𝗦 (@theturnertwiins) (చదవండి: పీరియడ్స్ వచ్చి వెయ్యి రోజులు.. అయినా తగ్గలేదు.. వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!) -
పోస్ట్‌పార్టం సమస్యలతో శ్రద్ధా ఆర్య, ట్విన్స్ జిబ్లీ ఫోటోలు సూపర్ క్యూట్
నటి శ్రద్ధా ఆర్య ఇటీవల పండంటి కవలల పిల్లలకు జన్మనిచ్చింది. ముద్దుల మూటగట్టే తన కవలల సంరక్షణలో బిజీగా ఉంది. ఇటీవల, శ్రద్ధా తన పిల్లల పేర్లను గిబ్లి-శైలి చిత్రంతో ప్రకటించింది. మరోవైపు తొలి సారిగా ప్రతి స్త్రీ ఎదుర్కొనే ప్రసవానంతర సమస్యల గురించి (Postpartum Problem) మాట్లాడింది.వివాహం పిల్లలతో ప్రస్తుతం నటనకు దూరంగా ఉన్న శ్రద్ధా ఆర్య (Shraddha Arya) మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. అయితే ప్రసవానంతర సమస్యలు గురించి మాట్లాడింది. సాధారణంగా మాతృత్వం అనేది మహిళలకు వరం మాత్రమే కాదు.. అనేక సమస్యలకు మూలం కూడా. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ప్రసవానంతర సమస్యలతో మహిళలు చాలా ఇబ్బంది పడతారు. శారీరక సమస్యలతోపాటు,మానసిక ఒత్తిడితో మరికొన్ని ఇబ్బందు లొస్తాయి. దీనినే పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ (పీపీడీ)అని వ్యవహరిస్తారు. ఈ ఒత్తిడి కారణంగా, ఆత్మన్యూనతా భావంతో కుంగిపోవడం, తానే హాని చేసుకోవడం, శిశువును కూడా గాయ పరచడం వంటి స్థితికి వెళతారు. శరీరంలో మార్పులు, అధిక బరువు , మానసిక స్థితిలో మార్పులు, నిరాశ, తదితర ప్రసవానంతరం వచ్చే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రసవ సమయంలో బిడ్డను ఈ లోకంమీదికి తెచ్చేందుకు తల్లి పడే బాధ,ఆ వేదన వర్ణనాతీతం. వీటి గురించే ఆమె ఇన్‌స్టాలో ప్రస్తావించింది. ముఖ్యంగా జుట్టు రాలడం గురించి తన అభిప్రాయాలను షేర్ చేసింది. విపరీతంగా జుట్టురాలడంపై ఆవేదన వ్యక్తం చేసింది. కుచ్చులుగా రాలిపోతున్న వెంట్రుకల ఫోటోను పంచుకుంది. View this post on Instagram A post shared by Shraddha Arya (@sarya12)శ్రద్ధా ఆర్య, రాహుల్ నాగల్, జిబ్లి ఆర్ట్ ట్రెండ్టీవీ నటిగా అద్భుతమైన నటనతో పాపులర్ అయింది శ్రద్ధా ఆర్యా. 2004లో టీవీ రియాలిటీ షోలో పాల్గొన్న ఈమె.. 2006లో 'కలవనిన్ కదలై' అనే తమిళ సినిమాద్వారా హీరోయిన్గా బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత తెలుగులో గొడవ, రోమియో, కోతిమూక తదితర సినిమాల్లో నటించింది. పాటు పలు సీరియల్స్‌లోనూ యాక్ట్ చేసిన శ్రద్ధా కుండలి భాగ్య సీరియల్‌తో మరింత పాపులర్ అయింది.ఏడాది పాటు డేటింగ్ చేసిన నేవీ ఆఫీసర్ రాహుల్ నగల్ని ,శ్రద్ధా ఆర్యా 2021, నవంబరులో పెళ్లాడింది. ఈ జంటకు 2024 నవంబరు 29న ట్విన్స్( పాప, బాబు) పుట్టారు. కుమారుడికి ‘శౌర్య' అని కుమార్తెకు 'సియా' అంటూ పూర్లు కూడా పెట్టేశారు. తాజాగా జిబ్లి తరహా క్యూట్ ఫోటోలను షేర్ చేయడంతో ఇవి సోషల్ మీడియా ప్రపంచాన్ని విపరీతంగా ఆకర్షించాయి. -
అరుదైన కేసు: ఆ తల్లి కవలలకు జన్మనిచ్చింది..అయితే డీఎన్ఏ టెస్ట్‌లో..!
ఒక మహిళకు కవల పిల్లలు జన్మించారు. ఇద్దరూ మగపిల్లలే. అయితే ఎందువల్లో ఇద్దరు డీఎన్ఏలు వేర్వురుగా ఉన్నాయి. ఒక బిడ్డ డీఎన్ఏ ఆమె భర్తతో మ్యాచ్ అవ్వగా, మరో బిడ్డ డీఎన్ఏ మాత్రం అస్సలు మ్యాచ్ కాలేదు. ఇదేంటి ఇద్దరు కవలలు ఒకేలా ఉన్నారు. ఇదెలా సాధ్యం ఒకరిది మాత్రమే తండ్రితో మ్యాచ్ అయ్యి, మరొకరిది కాకపోవడంతో వైద్యులు సైతం కంగుతిన్నారు. అసలేం జరిగిందంటే. ఈ విచిత్రమైన ఘటన పోర్చుగల్‌లోని గోయాస్ రాష్ట్రంలోని మినెరోస్ నగరంలో చోటు చేసుకుంది. 19 ఏళ్ల మహిళ కవల ప్లిలలకు జన్మనిచ్చింది. ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చిన ఆనందాన్ని తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఖుషీగా ఉంది. అయితే ప్రస్తతం వారికి ఎనిమిది నెలల వయసు. వారి బర్త్ సర్టిఫికేట్ల విషయమై డీఎన్ఏ టెస్ట్‌లు చేయగా అవాక్కయ్యే విషయం వెలుగులోకి చ్చింది. ఒక బిడ్డ డీఎన్ఏ మాత్రం ఆ మహిళ భర్తతో సరిపోయింది. మరో బిడ్డది అస్సలు మ్యాచ్ కాలేదు. దీంతో వైద్యులు సైతం ఇదేంటని తలలు పట్టుకున్నారు. అయితే ఆ మహిళలను వైద్యులు క్షణ్ణంగా ఆరా తీయగా తాను మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్న విషయం బయటపెట్టింది. వెంటనే ఆ వ్యక్తిని పిలిపించి డీఎన్ఏ టెస్ట్ చేయగా ఆ వ్యక్తితో ఆ బిడ్డ డీఎన్ఏ సరిగ్గా మ్యాచ్ అయ్యింది. అయితే ఇదెలా సాధ్యం అనే ప్రశ్న వైద్యలును కూడా ఆశ్చర్యాన్ని గురిచేసింది. అయితే పిల్లల తండ్రులు వేర్వేరు అయినా.. జనన ధృవీకరణ పత్రంలో ఒకటే రాయాల్సి ఉంది. దీంతో ఆ మహిళ భర్తనే ఆ ఇద్దరు పిల్లలకు తండిగ్రా పేరు నమోదు చేయించుకుని ఆ బిడ్డ బాధ్యత తనే చూసుకుంటానని అనడం విశేషం.ఇది అత్యంత అరుదైన కేసు..ఈ మేరకు డాక్టర్ టులియో జార్జ్ ఫ్రాంకో మాట్లాడుతూ..ఇప్పటివరకు మొత్తం ప్రపంచంలో ఇలాంటి కేసులు 20 మాత్రమే ఉన్నాయని చెప్పారు. వాటిలో కవలల తండ్రులు వేర్వేరుగా ఉన్నట్లు తెలిపారు. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తల భాషలో హెటెరోపెరెంటల్ సూపర్‌ఫెకండేషన్ అంటారని అన్నారు. ఒకే తల్లి రెండు అండాలు వేర్వేరు పురుషుల ద్వారా ఫలదీకరణం చెందినప్పుడు ఇది జరుగుతుందని వెల్లడించారు. అయితే ఇక్కడ ఆ స్త్రీ గర్భం సాధారణంగానే ఉందని అన్నారు. ఇప్పటి వరకు ఆ శిశువులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవని చెప్పారు. నిజంగా ఇది అత్యత విచిత్రమైన కేసు.(చదవండి: సందీప్ కిషన్: అలాంటి డైట్ ఫాలో అవుతాడా..! అందుకే..) -
Hanamkonda: నిద్రలోనే కన్నుమూసిన కవలలు
గణపురం : ముక్కు పచ్చలారని ఇద్దరు కవలలు నిద్రలోనే కన్నుమూశారు.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లిలో శని వారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. గణపురం మండలం గొల్లపల్లిలకి చెందిన మర్రి లాస్యశ్రీ, అశోక్ దంపతులకు రెండో సంతానంగా ఒక బాబు, ఒక పాప కవల పిల్లలు జన్మించారు. లాస్య నగరంపల్లిలోని తల్లిగారింటి వద్ద నా లుగు నెలలుగా ఉంటోంది. శనివారం మధ్యాహ్నం లాస్య పిల్లలకు డబ్బా పాలు తాగించి పడుకోబెట్టింది. కొద్ది సేపటి తర్వాత వారిని చూడగా ముక్కులనుంచి నురగ రావడాన్ని గమనించి భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆస్పత్రికి తరలిçంచగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.న్యూట్రీసియా కంపెనీకి చెందిన ‘డిక్సోలాక్ ’డబ్బా పాల వల్లే త మ పిల్లలు మృతి చెందినట్లు లాస్య ఆరోపిస్తోంది. పాల డబ్బా కు ఎక్స్పైరీ డేట్ ఈ ఏ డాది డిసెంబర్ వరకు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు గణ పురం ఎస్సై రేఖ అశోక్ తెలిపారు. పిల్లల మృతదేహాలకు వైద్యపరీక్షలు నిర్వహించిన తరువాతే మృతికి కారణాలు తెలుస్తాయని ఆయన వివరించారు. -
Ma Illu ట్విన్స్ విజేత, శ్వేత అనాథలు కాదు అంగరంగ వైభవంగా పెళ్లి!
బంజారాహిల్స్: వాళ్లిద్దరూ కవలలు.. పదేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులను, ఆ కొద్ది రోజులకే తోబుట్టువు, సోదరుడిని కోల్పోయి అనాథలయ్యారు. దీంతో నా అనేవారు ఎవరూ లేకుండా పోయారు.. వీరిని ‘మా ఇల్లు’ ఆశ్రమం చేరదీసింది. మా ఇల్లు ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి, గాదె పుష్పరాణి ఈ కవల సోదరీమణులను చేరదీయడమే కాకుండా విద్యాబుద్ధులను నేర్పించారు. అనాథలైన విజేత, శ్వేత ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న ‘మా ఇల్లు’ ఆశ్రమంలో నిర్వాహకుల నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా పెద్ద చదువుల్లో విశేషంగా రాణించారు. విజేత ఎమ్మెస్సీ సైకాలజీ చేసి బీఈడీ చేస్తూనే ఉద్యోగం పొందింది. చెల్లెలు శ్వేత ఎల్ఎల్బీ పూర్తిచేసి ప్రస్తుతం హైకోర్టులో లా ప్రాక్టీస్ చేస్తోంది. చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకుగా రాణించిన వీరిద్దరికీ ఆశ్రమ నిర్వాహకులు గాదె ఇన్నారెడ్డి, గాదె పుష్పరాణి దంపతులు తామే తల్లిదండ్రులై సొంత కూతుళ్ల కంటే ఎక్కువగా ప్రేమించారు. అయితే వీరికి వివాహం ఒక సమస్యగా మారింది. అనాథలైన ఈ కవలలను చేసుకోడానికి ఎవరు ముందుకొస్తారా అని ఇన్నారెడ్డి దంపదతులు ఎదురుచూస్తున్న సమయంలోనే వారికి అండగా మేముంటామంటూ ఇద్దరు ముందుకొచ్చారు. వారిద్దరి గుణగణాలను పరిశీలించిన ఇన్నారెడ్డి దంపతులు విజేత, శ్వేతలకు సరిజోడీ అని నిర్ణయించుకున్నారు. వరంగల్ జిల్లా ఈసుకొండ మండలం ఎల్కుర్తి హవేలీ గ్రామానికి చెందిన అల్లూరి రంజిత్‌రెడ్డి ఎంబీఏ పూర్తి చేసి ల్యాండ్ సర్వేయర్‌గా పనిచేస్తున్నాడు. విజేతను పెళ్లి చేసుకోడానికి ముందుకొచ్చాడు. ఇక అడ్వకేట్‌గా హైకోర్టులో పనిచేస్తున్న సురేష్ రెడ్డి అక్కడే పనిచేస్తున్న శ్వేతను పెళ్లి చేసుకోడానికి ముందుకొచ్చాడు. View this post on Instagram A post shared by Maa Illu Home🏡 (@maaillu) రంజిత్‌రెడ్డి–విజేత, సురేష్‌రెడ్డి–శ్వేతల వివాహం ఫిబ్రవరి 7న అంగరంగ వైభవంగా అనాథల మధ్యనే నిర్వహించనున్నారు. జనగామ జిల్లా జాఫర్ఘడ్ మండలం రేగడి తండాలోని ‘మా ఇల్లు’ ప్రాంగణంలోనే తాము వీరి పెళ్లి ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి రంజిత్, సురేష్ అంగీకరించారు. విజేత, శ్వేత వివాహం సందర్భంగా ‘మా ఇల్లు’ ఆశ్రమంలో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. -
కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్
అప్పట్లో తెలుగు సినిమాల్లో హీరోయిన్గా చేసిన శ్రద్ధా ఆర్య కవలలకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్ స్టాలో వీడియో పోస్ట్ చేసి మరీ ప్రకటించింది. నవంబర్ 29న తనకు ప్రసవం జరిగిన విషయాన్ని బయటపెట్టింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, పంజాబీ చిత్రాల్లో నటించి ఈమె గుర్తింపు తెచ్చుకుంది.(ఇదీ చదవండి: శోభిత ధూళిపాళ పెళ్లి దుస్తుల డిజైనర్ ఎవరో తెలుసా..?)2004లో టీవీ రియాలిటీ షోలో పాల్గొన్న ఈమె.. 2006లో 'కలవనిన్ కదలై' అనే తమిళ సినిమాతో హీరోయిన్ అయింది. ఆ తర్వాత తెలుగులో గొడవ, రోమియో, కోతిమూక తదితర సినిమాల్లో నటించింది. గతేడాది రిలీజైన హిందీ మూవీ 'రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది. వీటితో పాటు పలు సీరియల్స్‌లోనూ యాక్ట్ చేసింది.వైవాహిక జీవితం విషయానికొస్తే.. 2021లో నేవీ ఆఫీసర్ రాహుల్ నగల్ని పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది అక్టోబరులో ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. ఇప్పుడు తనకు ఓ అబ్బాయి,అమ్మాయి పుట్టిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' హౌస్‌లో ఉండలేను.. శోభా శెట్టి కన్నీళ్లు) View this post on Instagram A post shared by Shraddha Arya (@sarya12) -
అంబానీ ఇంట్లో పుట్టినరోజు వేడుకలు (ఫొటోలు)
-
దినేశ్ కార్తిక్- దీపికా ట్విన్స్ మూడో బర్త్‌డే.. కనిపించని డీకే (ఫొటోలు)
-
ఎలిగెంట్లుక్, స్టైలిష్ బ్యాగ్ : ఇషా అంబానీ లెవలే వేరు!
యువ మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వ్యాపార రంగంలో రాణిస్తూనే, ఫ్యాషన్ ఐకానిక్‌లా కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తుంది. తాజాగా ఒక ఫ్యాషన్ ఈవెంట్లో ఇషా స్పెషల్లుక్లో ఆకట్టుకుంది. ఈ విషయంలో తల్లి నీతా అంబానీకి తగ్గ తనయ అనిపించుకుంటోంది. సోమవారం జరిగిన లగ్జరీ స్కిన్‌కేర్ అండ్ హెయిర్‌కేర్ బ్రాండ్ అగస్టినస్ బాడర్ నిర్వహించిన స్టార్-స్టడెడ్ లాంచింగ్ కార్యక్రమంలో ఇషా అంబానీ బ్లాక్ డ్రెస్‌లో తళుక్కున మెరిసారు. అనైతా ష్రాఫ్ అడ్జానియా డిజైన్ చేసిన స్ట్రాప్‌లెస్ బ్లౌజ్, నెక్లైన్ కార్సెట్ టాప్ ,మ్యాచింగ్ స్కర్ట్ ధరించింది. అంతేకాదు లగ్జరీ చిట్టి బ్యాగ్ హీర్మేస్ కెల్లీ బ్యాగ్ ఆకర్షణగా నిలిచింది. తన కవల పిల్లలు ఆదియా,కృష్ణ పేర్లతో ప్రత్యేకంగా తీర్చిదిద్దడం హైలైట్. గ్లామరస్ అవతార్‌లో శిరస్సునుంచి పాదం వరకు ఆసాంతంగా పర్ఫెక్ట్గా కనిపించింది.కాగా ఇషా అంబానీ 2018లోవ్యాపారవేత్త ఆనంద్ పిరమల్‌ను పెళ్లి చేసుకున్నారు. 2022, నవంబరులో వీరికి కవల పిల్లలు పుట్టారు. -
కవలలే గానీ... గర్భాశయాలు వేరు
వారు కవలలే. ఒక తల్లి పిల్లలే. కాకపోతే చెరో గర్భాశయం నుంచి పుట్టుకొచ్చారు. అదెలా సాధ్యమంటారా? వాళ్లమ్మకు రెండు గర్భాశయాలున్నాయి! ఎంచక్కా ఒక్కోదాంట్లో ఒక్కొక్కరు పురుడు పోసుకున్నారన్నమాట. వైద్యపరంగా అత్యంత ఈ అరుదైన ఘటన చైనాలో జరిగింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోకెక్కింది. పది లక్షల జననాల్లో ఒక్కసారి మాత్రమే ఇలా జరిగేందుకు అవకాశం ఉంటుందట. చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో లీ అనే మహిళ సెపె్టంబర్ తొలి వారంలో పండంటి కవలలకు జన్మనిచి్చంది. పిల్లాడు 3.3 కిలోలు, పాప 2.4 కిలోల బరువుతో పుట్టారు. అయితే వారిద్దరూ చెరో గర్భాశయంలో పెరిగారు! లీకి రెండు గర్భాశయాలుండటమే ఇందుకు కారణం. లీకి గర్భాశయాలు రెండూ సంపూర్ణంగా ఎదగడమే గాక పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని ఆమెకు పురుడు పోసిన సీనియర్ డాక్టర్ కై యింగ్ చెప్పుకొచ్చారు. పైగా ఆ రెండింట్లోనూ సహజ పద్ధతిలో గర్భధారణ జరగడం మరీ అరుదని వివరించారు. తమకు తెలిసి గతంలో కేవలం రెండు కేసుల్లో మాత్రమే ఇలా జరిగిందని చెప్పారు. ఇలా జంట గర్భాశయాలుండటాన్ని వైద్య పరిభాషలో యుటెరస్ డైడెలి్ఫస్‌గా పిలుస్తారు. కేవలం 0.3 శాతం మంది మహిళల్లో మాత్రమే ఇందుకు అవకాశముంటుంది. కారణమేమిటో తెలియకపోయినా, లీకి ఇంతకు ముందు వచి్చన గర్భం నిలవలేదు. 27 వారాల తర్వాత అబార్షన్ అయింది. దాంతో గత జనవరిలో మళ్లీ గర్భం దాల్చాక వైద్యులు పక్కాగా ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. అన్నీ సజావుగా జరిగి కాన్పు తేదీ సమీపించాక రిస్కు తీసుకోకుండా సిజేరియన్ చేశారు. గతేడాది అమెరికాలోని అలబామాలో కూడా ఇలాంటి ఉదంతం జరిగినట్టు తెలుస్తోంది. రెండు గర్భాశయాలున్న మహిళ డిసెంబర్లో ఇలాగే ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచి్చంది. గత కాన్పులో ఆమెకు ముగ్గురు పిల్లలు పుట్టారు. కానీ వారంతా ఒకే గర్భాశయంలో పురుడు పోసుకోవడం విశేషం! ఎందుకిలా...? → గర్భావస్థలో పిండం ఎదిగే క్రమంలో గర్భాశయానికి సంబంధించిన రెండు కీలకమైన ట్యూబులు సకాలంలో కలిసిపోని పక్షంలో అవి రెండు గర్భాశయాలుగా ఏర్పడతాయి. → కొన్ని కేసుల్లో ఒక్కో గర్భాశయానికి విడిగా ఒక్కో ముఖద్వారం ఉంటుంది. యోని గుండా ఏర్పడే సన్నని కణజాల ద్వారం వాటిని విడదీస్తుంది. → ముందస్తు పరీక్షలు చేయించుకుంటే తప్ప గర్భధారణ జరిగేదాకా జంట గర్భాశయాలు ఉనికి ఇతరత్రా బయటపడే అవకాశం చాలా తక్కువ. → ఇలాంటి మహిళలకు గర్భస్రావం జరిగే ముప్పు ఎక్కువగా ఉంటుంది. అంతేగాక పిండం సరిగా ఎదగకపోవడం, ముందస్తు కాన్పు, కాన్పు సందర్భంగా విపరీతమైన రక్తస్రావం వంటి సమస్యలు తలెత్తవచ్చు. – బీజింగ్ -
హ్యాపీ బర్త్‌డే : మా ‘ప్రాణం, ప్రపంచం’ మీరే - స్టార్ దంపతులు (ఫొటోలు)