
టీమిండియా క్రికెటర్ దినేశ్ కార్తిక్- స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పళ్లికల్ కవల పిల్లల పుట్టినరోజు వేడుక

ఇందుకు సంబంధించిన ఫొటోలను దీపికా తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది.

‘‘నా జీవితంలోని అత్యంత అందమైన, అద్భుతమైన విషయం.. మీ ఎదుగుదలను చూడటమే. మీ ఇద్దరూ కలిసి మా మనసులను సంతోషంతో నింపేస్తున్నారు.

ఈ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది’’ అంటూ కుమారులపై దీపిక ప్రేమను కురిపించింది.

అయితే, ఈ ఫొటోల్లో డీకే మాత్రం కనిపించలేదు.

కాగా 2015లో డీకే దీపికాల వివాహం జరిగింది

ఈ జంటకు 2021, అక్టోబరు 18న కవలలు జన్మించారు

వీరి కుమారుల పేర్లు కబీర్, జియాన్

ఇటీవల మూడో పుట్టినరోజు జరుపుకొన్న తమ ట్విన్స్‌కు సంబంధించిన ఫొటోలను దీపిక తాజాగా షేర్ చేసింది

అయితే, ఇంత వరకు వారి ముఖాలను మాత్రం రివీల్ చేయలేదు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన డీకే ప్రస్తుతం ఫ్రాంఛైజీ క్రికెట్ ఆడుతున్నాడు