
ఇటీవల కాలంలో ఆరోగ్య స్పృహ ఎక్కువైంది. సోషల్‌మీడియా పుణ్యామా..? అని రకరకాల డైట్‌లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. ఏది మంచిది అని డిసైడ్ చేసుకోలేని కన్ఫూజన్‌లో పడేసేలా ఊదరగొడుతున్నాయి. అయితే ఆ సమస్యకు చెక్‌పెట్టేలా ఈ ఇద్దరు కవలలు ఓ ప్రయోగానికి పూనుకున్నారు. అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉండే ఈ కవల సోదరులు వేగాన్ వర్సెస్ నాన్‌వెజ్ డైట్‌లో ఏది బెటర్ అనే దాని గురించి తమ శరీరాలపై తామే ప్రయోగాలు చేసుకున్నారు. అంతేగాదు ఇద్దరూ ఏ డైట్ ఆరోగ్యకరమైనదో వైద్యపరంగా నిర్థారించి మరీ చెప్పారు.
యూకేలోని డెవాన్‌లోని ఓ గ్రామానికి చెందిన రాస్, హ్యూగో టర్నోర్ అనే కవలలు ఇద్దరూ చూడటానికి ఒకేలా ఉంటారు. ఈ ఇద్దరు ఆహారం, ఫిట్‌నెస్‌కి సంబంధించి పలు ప్రయోగాలు చేస్తుంటారు. ఆ క్రమంలోనే ఈసారి మొక్కల ఆధారిత వర్సెస్ జంతువుల ఆధారిత డైట్‌లలో ఏది ఆరోగ్యానికి మంచి ఫలితాలనిస్తుంది దాని గురించి తమపైనే ప్రయోగాలు చేసుకుని మరీ నిర్థారించి చెప్పారు.
అందుకోసం ఆరు నెలలపాటు ఈ 36 ఏళ్ల కవలలు దాదాపు ఒకేలాంటి జీవనశైలిని అనుసరించారు. అయితే తీసుకునే ఆహారంలోనే వ్యత్యాసం ఉంటుంది. హ్యూగో సముద్రపు ఆల్గే , మొక్కల ఆధారిత ఒమేగా 3 నూనెలు, మొక్కల ఆధారిత సప్లిమెంట్లు తదితరాలు తీసుకున్నాడు. రాస్ సాంప్రదాయ జంతు ఆధారిత విటమిన్లు తీసుకున్నాడు. అయితే ఆరు నెలల తదనంతరం ఇరువురిలో అద్భుతమైన మార్పులు, ఫలితాలు కనిపించాయి.
ఇక్కడ హ్యూగో రక్తం పోషకాలతో కనిపించింది. కీలకమైన విటమిన్లు డీ3, కొవ్వు ఆమ్లాలు సమస్థాయిలో ఉన్నాయి. ఇక రాస్ తీసుకున్న నాన్ వెజ్ ప్రోటీన్‌లకు మించి హ్యగో శరీరంలో మెరుగైన స్థాయిలో విటమిన్లు ఉన్నాయి. వారిద్దరూ కూడా ఈ డైట్‌లలో ఇంత తేడా ఉంటుందని అనుకోలేదట. రక్తపరీక్షల్లో హ్యూగో ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా ఒమేగా-3, విటమిన్ D3 పుష్కలంగా ఉన్నాయి హ్యూగో బాడీలో.
కేవలం రక్తపరీక్షలే గాక, కొవ్వులు, ఆమ్లలాల స్థాయిలతో సహా ప్రతీది ట్రాక్ చేశారు. అయితే ఈ డైట్‌లలో మొక్కల ఆధారిత వెర్షన్ మెరుగైన ఫలితాలనిచ్చింది. రాస్ తిన్న సాల్మన్ చేపల కంటే సముద్రపు పాచి సప్లిమెంట్‌లోనే విటమిన్ డీస్థాయిలు, మంచిరోగ నిరోధక శక్తిని హ్యూగోకి అందించాయి. అంతేగాదు శాకాహారం శరీరంలో కొవ్వుని తగ్గించి మెరుగైన శక్తి స్థాయిలను ప్రోత్సహించదని తేలింది.
ఇలాంటి ప్రయోగాలు ఆ కవలలకు తొలిసారి కాదు. గతంలో అధిక కార్బ్ వర్సెస్ అధిక కొవ్వు ఆహారాలలో ఏది మంచిదో తెలుసుకోవాలని ప్రయోగాలు చేశారు కూడా. దానిలో రాస్ పాస్తా, బియ్యం వంటి కార్బొహైడ్రేట్లు తీసుకోగా, హ్యూగో గుడ్లు, వెన్న వంటి వాటిని తీసుకున్నారు. అయితే రాస్ కొలస్ట్రాల్‌ని కోల్పోగా, హ్యూగో మిశ్రమ ఫలితాలు అందుకున్నారు. పైగా అందులో ప్రమాదకరమైన చెడెకొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఉన్నాయి.
చివరగా ఈ కవల ఫిట్‌నెస్ ప్రయోగాల వల్ల మొక్కల ఆధారిత సప్లిమెంట్స్ ప్రయోజనాలు హైలెట్ చేయడమే గాక సాంప్రదాయ పోషకాహారం గురించి చాలకాలం నుంచి ఉన్న అపోహలు కూడా తుడిచిపెట్టుకుపోయాయి. అంతేగాదు మన ఆరోగ్యంలో ఆహారం ఎంత కీలకపాత్ర పోషిస్తుందని అనేది తేటతెల్లమైంది కూడా.
(చదవండి: పీరియడ్స్ వచ్చి వెయ్యి రోజులు.. అయినా తగ్గలేదు.. వైద్యులకే అంతుచిక్కని మిస్టరీ..!)