
ఒక మహిళకు కవల పిల్లలు జన్మించారు. ఇద్దరూ మగపిల్లలే. అయితే ఎందువల్లో ఇద్దరు డీఎన్‌ఏలు వేర్వురుగా ఉన్నాయి. ఒక బిడ్డ డీఎన్‌ఏ ఆమె భర్తతో మ్యాచ్ అవ్వగా, మరో బిడ్డ డీఎన్‌ఏ మాత్రం అస్సలు మ్యాచ్ కాలేదు. ఇదేంటి ఇద్దరు కవలలు ఒకేలా ఉన్నారు. ఇదెలా సాధ్యం ఒకరిది మాత్రమే తండ్రితో మ్యాచ్ అయ్యి, మరొకరిది కాకపోవడంతో వైద్యులు సైతం కంగుతిన్నారు.
అసలేం జరిగిందంటే. ఈ విచిత్రమైన ఘటన పోర్చుగల్‌లోని గోయాస్ రాష్ట్రంలోని మినెరోస్ నగరంలో చోటు చేసుకుంది. 19 ఏళ్ల మహిళ కవల ప్లిలలకు జన్మనిచ్చింది. ఇద్దరు మగబిడ్డలకు జన్మనిచ్చిన ఆనందాన్ని తన భర్తతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఖుషీగా ఉంది. అయితే ప్రస్తతం వారికి ఎనిమిది నెలల వయసు. వారి బర్త్ సర్టిఫికేట్ల విషయమై డీఎన్‌ఏ టెస్ట్‌లు చేయగా అవాక్కయ్యే విషయం వెలుగులోకి చ్చింది.
ఒక బిడ్డ డీఎన్‌ఏ మాత్రం ఆ మహిళ భర్తతో సరిపోయింది. మరో బిడ్డది అస్సలు మ్యాచ్ కాలేదు. దీంతో వైద్యులు సైతం ఇదేంటని తలలు పట్టుకున్నారు. అయితే ఆ మహిళలను వైద్యులు క్షణ్ణంగా ఆరా తీయగా తాను మరో వ్యక్తితో సంబంధం పెట్టుకున్న విషయం బయటపెట్టింది. వెంటనే ఆ వ్యక్తిని పిలిపించి డీఎన్‌ఏ టెస్ట్ చేయగా ఆ వ్యక్తితో ఆ బిడ్డ డీఎన్‌ఏ సరిగ్గా మ్యాచ్ అయ్యింది.
అయితే ఇదెలా సాధ్యం అనే ప్రశ్న వైద్యలును కూడా ఆశ్చర్యాన్ని గురిచేసింది. అయితే పిల్లల తండ్రులు వేర్వేరు అయినా.. జనన ధృవీకరణ పత్రంలో ఒకటే రాయాల్సి ఉంది. దీంతో ఆ మహిళ భర్తనే ఆ ఇద్దరు పిల్లలకు తండిగ్రా పేరు నమోదు చేయించుకుని ఆ బిడ్డ బాధ్యత తనే చూసుకుంటానని అనడం విశేషం.
ఇది అత్యంత అరుదైన కేసు..
ఈ మేరకు డాక్టర్ టులియో జార్జ్ ఫ్రాంకో మాట్లాడుతూ..ఇప్పటివరకు మొత్తం ప్రపంచంలో ఇలాంటి కేసులు 20 మాత్రమే ఉన్నాయని చెప్పారు. వాటిలో కవలల తండ్రులు వేర్వేరుగా ఉన్నట్లు తెలిపారు. ఈ పరిస్థితిని శాస్త్రవేత్తల భాషలో హెటెరోపెరెంటల్ సూపర్‌ఫెకండేషన్ అంటారని అన్నారు.
ఒకే తల్లి రెండు అండాలు వేర్వేరు పురుషుల ద్వారా ఫలదీకరణం చెందినప్పుడు ఇది జరుగుతుందని వెల్లడించారు. అయితే ఇక్కడ ఆ స్త్రీ గర్భం సాధారణంగానే ఉందని అన్నారు. ఇప్పటి వరకు ఆ శిశువులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవని చెప్పారు. నిజంగా ఇది అత్యత విచిత్రమైన కేసు.
(చదవండి: సందీప్ కిషన్: అలాంటి డైట్ ఫాలో అవుతాడా..! అందుకే..)
Comments
Please login to add a commentAdd a comment