
యువ మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వ్యాపార రంగంలో రాణిస్తూనే, ఫ్యాషన్ ఐకానిక్‌లా కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తుంది. తాజాగా ఒక ఫ్యాషన్ ఈవెంట్‌లో ఇషా స్పెషల్‌లుక్‌లో ఆకట్టుకుంది. ఈ విషయంలో తల్లి నీతా అంబానీకి తగ్గ తనయ అనిపించుకుంటోంది.
సోమవారం జరిగిన లగ్జరీ స్కిన్‌కేర్ అండ్ హెయిర్‌కేర్ బ్రాండ్ అగస్టినస్ బాడర్ నిర్వహించిన స్టార్-స్టడెడ్ లాంచింగ్ కార్యక్రమంలో ఇషా అంబానీ బ్లాక్ డ్రెస్‌లో తళుక్కున మెరిసారు. అనైతా ష్రాఫ్ అడ్జానియా డిజైన్ చేసిన స్ట్రాప్‌లెస్ బ్లౌజ్, నెక్‌లైన్ కార్సెట్ టాప్ ,మ్యాచింగ్ స్కర్ట్ ధరించింది. అంతేకాదు లగ్జరీ చిట్టి బ్యాగ్ హీర్మేస్ కెల్లీ బ్యాగ్ ఆకర్షణగా నిలిచింది. తన కవల పిల్లలు ఆదియా,కృష్ణ పేర్లతో ప్రత్యేకంగా తీర్చిదిద్దడం హైలైట్. గ్లామరస్ అవతార్‌లో శిరస్సునుంచి పాదం వరకు ఆసాంతంగా పర్ఫెక్ట్‌గా కనిపించింది.
కాగా ఇషా అంబానీ 2018లోవ్యాపారవేత్త ఆనంద్ పిరమల్‌ను పెళ్లి చేసుకున్నారు. 2022, నవంబరులో వీరికి కవల పిల్లలు పుట్టారు.

Comments
Please login to add a commentAdd a comment