ప్రపంచంలోనే తొలి ఏఐ అందాల పోటీలు! | Worlds First AI Beauty Pageant Called The World AI Creator Awards, How Will The Winner Be Decided? - Sakshi
Sakshi News home page

World First Ai Pageant: ప్రపంచంలోనే తొలి ఏఐ అందాల పోటీలు! విజేతను ఎలా నిర్ణయిస్తారంటే..

Published Tue, Apr 16 2024 1:41 PM | Last Updated on Tue, Apr 16 2024 7:10 PM

Worlds first AI Beauty Pageant Called The World AI Creator Awards - Sakshi

ఎన్నో రకాల అందాల పోటీలను చూసి ఉంటారు. కానీ ఇలాంటి సాంకేతికతో కూడిన అందాల పోటీలను చూసి ఉండరు. ప్రపచంలోనే తొలిసారిగా ఏఐ అందాల పోటీలు వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్(WAICA) పిలుపునిచ్చింది. ఈ పోటీలో కృత్రిమ మేధస్సుతో రూపొందించిన మోడల్స్‌ పాల్గొంటారు. కోటి రూపాయల విలువ చేసే ప్రైజ్‌మనీలతో భారీ ఎత్తున ఈ ఏఐ అందాల పోటీలను నిర్వహిస్తోంది WAICA. ఈ ఐఏ మోడల్స్‌ని ప్రేక్షకుల్లో వాటికున్న ఆదరణ, ఫ్లాట్‌ఫామ్‌లో ఎక్కువగా వినియోగించగలిగేది, సోషల్‌ మీడియా క్రేజ్‌ వంటి వాటిని ఆధారంగా చేసుకుని న్యాయనిర్ణేతలు విజేతను ప్రకటిస్తారు.

తొలిసారిగా కంప్యూటర్‌ సాంకేతికత సృష్టించిన మనుషుల అందాల పోటీ అనేది ఫ్యాషన్‌ వైవిధ్యానికి ఓ నిదర్శనం. వరల్డ్ AI క్రియేటర్ అవార్డ్స్ వర్చువల్‌ మోడల్స్‌ని సబ్‌స్క్రిప్షన్-ఆధారిత ప్లాట్‌ఫారమ్ అయిన ఫ్యాన్‌వ్యూని(Fanvue) కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ సదరు వర్చువల్‌ మోడల్‌ ఫ్యాన్‌ వ్యూ, పీఆర్‌ మద్దతులను కూడా బేస్‌ చేసుకుని విజేతను ప్రకటించడం జరుగుతుంది. అలాగే రన్నరప్‌, మూడో స్థానంలో ఉన్న విజేతలకు కూడా నగదు బహుమతులు అందచేయడం జరుగుతుందని వరల్డ్ ఏఐ క్రియేటర్ అవార్డ్స్ పేర్కొంది.

ఈ పోటీలకు ఎంట్రీలు గత ఆదివారం(ఏప్రిల్‌ 14) నుంచే ప్రారంభమయ్యాయి. మే 10న విజేతలను ప్రకటిస్తారు. ఇక ఈ అందాల పోటీ ఈ నెలఖారులోపు జరగనుంది. ఇక ఈ పోటీలు నలుగురు సభ్యుల ఫ్యానెల్‌ సమక్లంలో జరుగుతుంది. ఆ ఫ్యానెల్‌లో ఇద్దరు ఏఐ ఇన్‌ఫ్లయోన్సర్‌ జడ్డిలు..ఒకరేమో మూడు లక్షల ఫ్యాన్‌ఫాలోయింగ్‌ కలిగిన స్పెయిన్‌కు చెందిన ఐతానా లోపెజ్, మరోకరు రెండు లక్షలకు పైగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఎమిలీ పెల్లెగ్రిని జడ్జిలుగా వ్యవహరిస్తారు. ఇక వారిలో మిగిలిన ఇద్దరు వ్యక్తులు..పీఆర్‌ సలహదారు, వ్యవస్థాపకుడు ఆండ్రూ బ్లాచ్, మరొకరు అందాల పోటీ చరిత్రకారుడు, బ్యూటీ క్వీన్ స్కాండల్స్ పుస్తక రచయిత అయిన సాలీ-ఆన్ ఫాసెట్ విజేతలను ప్రకటిస్తారు.

ఇది ఏఐ సృష్టికర్తలలో దాగున్న ప్రతిభ సామర్థ్యాన్ని వెలికి తీసేందుకు జరుగుతున్న అందాల పోటీ అని ఫ్యానల్‌ వ్యక్తులు చెబుతున్నారు. ఈ పోటీల్లో పాల్గొనేవారు తప్పనిసరిగా 100 శాతం ఏఐ జనరేటేడ్‌  మోడల్స్‌నే క్రియేట్‌ చేయాలి. అందుకోసం ఎలాంటి టూల్స్‌ ఉపయోగిస్తారనేందుకు ఎలాంటి పరిమితులు లేవు. ఓన్లీ ఏఐ జెనరేటర్‌ క్రియేషన్స్‌ని స్వాగతిస్తుంది. అది డీప్‌ ఏఐ, లేదా వ్యకగత టూల్స్‌ వంటివి ఏదైనా కావొచ్చు. ఈ పోటీల్లో ఫస్ట్‌ ప్రైజ్‌ గెలుచుకున్నవారు దాదాపు రూ. 4 లక్షలపైనే నగదు బహుమతి అందజేస్తారు నిర్వాహకులు.

( చదవండి: సింఘారా పిండి గురించి విన్నారా..? బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement