Video: Owner Family Surprises Maid With Cake On Her Birthday, See Her Reaction - Sakshi
Sakshi News home page

వీడియో: పని మనిషి పుట్టినరోజు.. ఓనరమ్మ చిరు సర్‌ప్రైజ్‌తో కంటతడి

Published Mon, Oct 31 2022 6:26 PM

Viral Video: Maid Surprised With Owner Cake Cut Surprise - Sakshi

ప్రతీ వ్యక్తి జీవితంలో కొన్ని మధుర క్షణాలు పదిలంగా ఉండిపోతాయి. వాటి వెనుక చిన్న చిన్న చర్యలు కూడా ఉండొచ్చు!. తమ ఇంటి బండి నడిచేందుకు.. నాలుగు ఇళ్లలో పని చేసుకునే వాళ్లు ఎందరో. అలాంటి వాళ్లను గౌరవంగా చూసే ఓనర్లు ఎందరుంటారు?.. అయితే ఇక్కడ తమకు సాయంగా ఇంటి పనులు చేసే ఆమెను.. ఇంట్లో మనిషిగానే భావించింది ఆ ఓనరమ్మ. అందుకే.. ఆమె జీవితంలో ఏ పుట్టినరోజుకు అందుకోని సర్‌ప్రైజ్‌ ఇచ్చింది.  

వీళ్లకు విలువైన కానుకలు అక్కర్లేదు. ఇలాంటి ప్రత్యేక క్షణాల్లో ప్రేమ, ఆనందం పంచితే సరిపోతుంది. ఈ నగరంలో ఆమె భర్తతో ఒంటరిగా ఉంటోంది. అందుకే ఆమె పుట్టినరోజును ముఖంలో చిరునవ్వులు పూయించాలనుకున్నాం. మా మామగారు ఆమె కోసం కేక్‌ తెచ్చారు. అంతా కలిసి ఆమెను సర్‌ప్రైజ్‌ చేశాం. కొన్నిసార్లు ఎదుటివాళ్లను నవ్వించేందుకు.. మీరు చిన్న చిన్న పనులు మీతో ఎప్పటికీ నిలిచిపోతాయి అంటూ క్యాప్షన్‌ ఉంచింది సదరు ఓనరామె. 

అంతే మీ వల్లే మా ఇల్లు శుభ్రంగా, సొగసుగా ఉంటోందని.. హ్యపీయెస్ట్‌ బర్త్‌డే మౌషీ అంటూ క్యాష్షన్‌ ఉంచారామె. అంతేకాదు.. ఎప్పుడూ తన కోసం టీ పెట్టే ఆమె కోసం.. ఈసారి ఆ ఓనర్‌ ప్రత్యేకంగా టీ చేసి ఇచ్చింది. తన జీవితంలో ఇప్పటిదాకా పుట్టినరోజు జరుపుకోలేదని.. ఈ క్షణాలు తనకు ఎంతో భావోద్వేగాన్ని పంచాయంటూ కంటతడి పెట్టుకుందామె.  ప్రస్తుతం ఆ వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

Advertisement
 
Advertisement
 
Advertisement