జీవితంలో ప్రతి ఒక్కరికి తమ బర్త్‌డేను స్పెషల్‌గా జరుపుకోవాలని కోరిక ఉంటుంది. పుట్టినరోజు వస్తుందంటే చాలు వారం రోజుల ముందు నుంచే హడావిడి ఉంటుంది. కానీ ఆ పిల్లాడి లైఫ్‌లో మాత్రం ఇప్పటివరకు ఎప్పుడూ పుట్టినరోజుని జరుపుకునే అదృష్టం రాలేదు. విషయం తెలిసి, క్లాస్ టీచర్ అందించిన సర్‌ప్రైజ్‌కి ఆ బాలుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంతకీ ఆ క్లాస్ టీచర్ ఏం చేసిందంటే..
కొలంబియాకు చెందిన ఏంజెల్ డేవిడ్ అనే ఎనిమిదేళ్ల బాలుడు జీవితంలో ఇప్పటివరకు పుట్టినరోజును జరుపుకోలేదు. అతని కుటుంబం ఆర్థిక పరిస్థితుల రీత్యా అతని తల్లి డేవిడ్ బర్త్‌డే వేడుకలను ఇంత వరకు సెలబ్రేట్ చేయలేకపోయింది. తండ్రి లేకపోవడం, ఏంజెల్ డేవిడ్ సహా నలుగురు పిల్లల బాధ్యత ఆమె ఒంటరిగా చూసుకునేది. దీంతో పేదరికం కారణంగా డేవిడ్‌కు ఎనిమిదేళ్లు వచ్చినా ఇంతవరకు పుట్టినరోజును నిర్వహించలేకపోయింది.
విషయం తెలిసిన డేవిడ్ క్లాస్ టీచర్ అతని బర్త్‌డేను పెద్ద వేడుకలా చేయాలని నిర్ణయించుకుంది. దీంతో కేక్, డెకరేషన్‌తో క్లాస్ రూమ్‌లోనే డేవిడ్‌కు తెలియకుండా సర్‌ప్రైజ్‌గా బర్త్‌డే వేడుకలను ఏర్పాటు చేసింది. క్లాస్‌లోకి డేవిడ్ అడుగుపెట్టగానే క్లాస్ టీచర్ సహా అతని క్లాస్‌మేట్స్ అందరూ హ్యాపీ బర్త్‌డే అంటూ సాంగ్స్ పాడుతూ అతన్ని క్లాస్‌రూంలోకి వెల్‌కమ్ చెప్పారు.
ఊహించిన ఈ సర్‌ప్రైజ్‌తో డేవిడ్ ఆనందంతో ఏడ్చేశాడు. దీంతో పిల్లలంతా ఒక్కచోట చేరి డేవిడ్‌ను కౌగిలించుకొని బర్త్‌డే విషెస్ తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment