పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని వేడుక. అందుకే తమ పెళ్లి రోజును మరపురాని జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని వధూవరులిద్దరూ ఎంతగానో కోరుకుంటారు. ఇటీవల పెళ్లిలో ఓ వధువు డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌తో షాకిచ్చింది. పూలతో అయితే రొటీన్‌గా ఉంటుందని చాక్లెట్లతో జడ అల్లేసుకుంది. దీనికి సంబంధించిన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
తమ పెళ్లిలో మరింత అందంగా కనిపించాలని ముచ్చటపడిపోతుంటారు. అందుకే బట్టల దగ్గర్నుంచి హెయిర్ స్టైల్ వరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఏం చేసినా కాసింత కళాపోషణ ఉండాలి అన్నట్లు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే వినూత్నంగా కనిపించాలని భావిస్తుంటారు. సాధారణంగా పెళ్లిలో వధువుకి పూలజడ ప్రత్యేకం.
ఈమధ్య అలా రకరకాల పూలజడలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఓ వధువు మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచించి చాక్లెట్స్‌తో జడను అలంకరించుకుంది. ఇయర్ రింగ్స్,నెక్లెస్ వంటి ఆభరణాలు కూడా చాక్లెట్స్‌తో చేసినవే.
జడకు కిట్‌క్యాట్, ఫైవ్‌స్టార్, ఫెరెరో, రోచర్, మిల్కీబార్ వంటి చాక్లెట్లతో అందంగా ముస్తాబైంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. పెళ్లికూతురి క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment