
రోడ్ల మీద రయ్‌రయ్ అంటూ కుర్రాళ్లు చేసే స్టంట్స్ గురించి తెలిసిందే. ఇందులో పెద్ద విశేషం ఏముంది? కానీ కొంతమంది వయసుతో సంబంధం లేని పనులు చేస్తుంటారు. అలా కొన్నిసార్లు వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు అలాంటి వీడియోనే ఒకటి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఓ వృద్దుడు యువకుడిలా మారి బైక్‌పై విన్యాసాలతో ఆశ్చర్యపోయేలా చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలో జరుగుతున్న వింతలు, విశేషాలు క్షణాల్లో మన కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. సరికొత్త విషయాలు, గమ్మత్తైన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంది. బైక్‌పై ఓ వృద్ధుడు విన్యాసాలు చేశాడు. బైక్‌ను నడుపుతూ ఒక్కసారిగా హ్యాండిల్‌ని విడిచిపెట్టేశాడు. బైక్‌పై జంప్స్ చేస్తే హుశారుగా స్టంట్స్ చేశాడు.
దీనికి సంబంధించిన వీడియోను ఓ యూజర్ సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతుంది. చాలామంది నెటిజన్లు వృద్ధుడి విన్యాసాలకు షాక్ అవుతుంటే, మరికొందరు మాత్రం.. తాతగారికి ఈ వయసులో అవసరమా? పొరపాటున కిందపడితే ఎంత ప్రమాదం? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
इन्हीं हरकतों की वजह से सरकार ने पुरानी पेंशन योजना बंद की है। 😅 pic.twitter.com/9On89AL5SJ
— Ankit Yadav Bojha (@Ankitydv92) August 13, 2023
Comments
Please login to add a commentAdd a comment