రెండువేల ఏళ్ల క్రితమే ఇంత అద్భుత ఆభరణమా! | Carvilios Ring Mosaic Floor Unique 1st Century AD Artifact From Roman | Sakshi
Sakshi News home page

రెండువేల ఏళ్ల క్రితమే ఇంత అద్భుత ఆభరణమా!

Published Fri, Jul 7 2023 4:50 PM | Last Updated on Fri, Jul 14 2023 3:10 PM

Carvilios Ring Mosaic Floor Unique 1st Century AD Artifact From Roman - Sakshi

రోమన్‌ సామ్రాజ్యం గురించి కథలు కథలుగా విన్నాం. అలాగే ఓ సామెత కూడా చెబుతుంటారు రోమ్‌ నగరం ఒక్కరోజులో నిర్మించలేదని అంటుంటారు. ఒకప్పుడూ రోమ్‌ నగరం చాలా బావుండేదని, అప్పట్లోనే ఎన్న కళాఖండాలకు, నైపుణ్యాలకు పెట్టింది పేరుగా ఉండేది. ఆ కాలం నాటి ఓ అద్భుతమైన ఆభరణం వెలుగులోకి వచ్చింది. అది ఓ రోమన్‌ సమాధి నుంచి బయటపడింది. ఆ ఆభరణం క్రీస్తూ శకం ఒకటో శతాబ్దపు కాలాంలోనిదిగా నిపుణులు అంచనా వేశారు.

ఆ ఆభరణాన్ని కార్విలయోస్‌ రింగ్‌ అని అంటారని చెబుతున్నారు. మాట్రాన్ ఎబుటియా క్వార్టా అనే రోమన్‌ మహిళ తన కొడుకు కార్విలయస్‌ జ్ఞాపకార్థం అతడి ముఖ చిత్రం కనిపించేలా తయారు చేయించుకుందని నిపుణులు చెబుతున్నారు. ఆ ఉంగరాన్ని నిశితంగా పరిశీలిస్తే.. రాక్‌ క్రిస్టల్స్‌ కింద చనిపోయిన ఆమె కొడుకు ముఖ చిత్రం ఉంది. దీన్ని చూస్తే అప్పట్లోనే ఎంత గొప్ప నైపుణ్యం ఉందని ఆశ్చర్యపోక మానరు.

ఈ ఉంగరం హోలోగ్రాఫిక్‌ ప్రభావాన్నిచూపిస్తోంది. అలాగే నాటి కాలంలోని ఓ గొప్ప మొజాయిక్‌ ఫ్లోర్‌ ఇటలీలో బయటపడింది. ఆ కళఖండాన్ని నాటి కళాకారులు  ఎంత అద్భుతం తీర్చిదిద్దారో దాన్ని చూస్తేనే అవగతమవుతుంది. ఇది నాటి రోమన్‌ సామ్రాజ్యంలోనిదేనని, కీస్తూ శకం 4వ లేదా 5వ శతాబ్దం నాటిదని చెబుతున్నారు. రోమన్‌ సామ్రాజ్యం ఓ వెలుగు వెలుగుతున్నప్పుడూ ఈ అసాధారణ కళాత్మక నైపుణ్యాలు కోకొల్లలుగా ఉండేవని చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement