floor
-
మార్కెట్లోకి కొత్తరకం ఫ్లోర్ క్లీనర్.. చార్జ్ పెడితే చాలు!
తడి, పొడి చెత్తను ఏక కాలంలో తొలగించి ఫ్లోర్‌ను పరిశుభ్రం చేసే ప్రత్యేకమైన కార్డ్-ఫ్రీ వెట్ ఫ్లోర్ క్లీనర్‌ను డైసన్ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని పేరు డైసన్ వాష్జీ1. పరిశుభ్రమైన శుభ్రత, నిర్వహణ కోసం దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త రకం ఫ్లోర్ క్లీనర్ ధర రూ. 64,900.వాష్జీ1 ఫ్లోర్ క్లీనర్ ఒక లీటర్ ట్యాంక్‌తో వస్తుంది. తడి, పొడి చెత్తను ఒకేసారి శుభ్రం చేయడానికి హైడ్రేషన్, శోషణ, ఎక్స్ట్రాక్షన్ పద్ధతుల కలయికను ఉపయోగిస్తుంది. ఇది ఒక ఛార్జ్‌లో 3100 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది. ఈ క్లీనర్‌ను దేశం అంతటా డైసన్ వెబ్సైట్లో ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో డైసన్ డెమో స్టోర్ల నుండి కొనుగోలు చేయవచ్చు. -
అతిథుల డ్యాన్స్.. కూలిపోయిన రిసెప్షన్ వేదిక
వధువరులు, బంధువులు ఆనందంతో ఎంజాయ్ చేసే వివాహ రిసెప్షన్లో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. వేడుకలో భాగంగా డ్యాన్స్ చేసే క్రమంలో అకస్మాత్తుగా వెడ్డింగ్ హాల్ ఫ్లోర్ కూలిపోయింది. ఈ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. వధువరులతో పాటు సుమారు 30 మంది అతిథులు 25 అడుగుల ఎత్తులో ఉన్న ఫ్లోర్‌ను నుంచి కిందకు పడిపోయారు. దీంతో గాయపడిన వారిని స్థానిక అస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే... వరుడు పాలో ముగ్నైనీ, వధువు వలేరియా యబరా తమ వివాహాన్ని ఇటలీలోని పిస్టోయాలో ఉన్న ఓ వెడ్డింగ్ హాల్లో ఏర్పాటు చేశారు. హాల్లోని వేదికపై నూతన వధూవరులతో పాటు సుమారు 30 మంది అతిథులు ఉన్నారు. ఆనందంతో వారంతా డ్యాన్స్ చేయటం మొదలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. అందరూ వేదిక చెక్కల మధ్య ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి, గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. గాయపడ్డవారంతా పిస్టోయాలోని శాన్ జకోపో ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై పెళ్లి కొడుకు ముగ్నైని మాట్లాడుతూ.. ‘రిసెప్షన్ వేదిక కుప్పకూలే ముందు అంతా సంతోషంగా ఉన్నాం. అతిథులు డాన్స్ చేసేసరికి ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. నేను కూడా వాళ్లతోపాటు పడిపోయాను. నాపై చాలా మంది పడ్డారు. వెంటనే నా భార్య వలేరియా ఎక్కడ ఉందో వెతికాను. ఆమె కనిపించకపోయే సరికి తీవ్ర ఆందోళనకు గురయ్యాను. చివరకు ఇద్దరం కలిసి ఆస్పత్రిలో చేరాం.. పక్కపక్క బెడ్లో ఉండి చికిత్స పొందుతున్నాం’ అని ముగ్నైని తెలిపారు. చదవండి: Pakistan: పార్టీ జెండాపై గొడవ.. కన్న కొడుకును హతమార్చిన తండ్రి -
రెండువేల ఏళ్ల క్రితమే ఇంత అద్భుత ఆభరణమా!
రోమన్ సామ్రాజ్యం గురించి కథలు కథలుగా విన్నాం. అలాగే ఓ సామెత కూడా చెబుతుంటారు రోమ్ నగరం ఒక్కరోజులో నిర్మించలేదని అంటుంటారు. ఒకప్పుడూ రోమ్ నగరం చాలా బావుండేదని, అప్పట్లోనే ఎన్న కళాఖండాలకు, నైపుణ్యాలకు పెట్టింది పేరుగా ఉండేది. ఆ కాలం నాటి ఓ అద్భుతమైన ఆభరణం వెలుగులోకి వచ్చింది. అది ఓ రోమన్ సమాధి నుంచి బయటపడింది. ఆ ఆభరణం క్రీస్తూ శకం ఒకటో శతాబ్దపు కాలాంలోనిదిగా నిపుణులు అంచనా వేశారు. ఆ ఆభరణాన్ని కార్విలయోస్ రింగ్ అని అంటారని చెబుతున్నారు. మాట్రాన్ ఎబుటియా క్వార్టా అనే రోమన్ మహిళ తన కొడుకు కార్విలయస్ జ్ఞాపకార్థం అతడి ముఖ చిత్రం కనిపించేలా తయారు చేయించుకుందని నిపుణులు చెబుతున్నారు. ఆ ఉంగరాన్ని నిశితంగా పరిశీలిస్తే.. రాక్ క్రిస్టల్స్ కింద చనిపోయిన ఆమె కొడుకు ముఖ చిత్రం ఉంది. దీన్ని చూస్తే అప్పట్లోనే ఎంత గొప్ప నైపుణ్యం ఉందని ఆశ్చర్యపోక మానరు. ఈ ఉంగరం హోలోగ్రాఫిక్ ప్రభావాన్నిచూపిస్తోంది. అలాగే నాటి కాలంలోని ఓ గొప్ప మొజాయిక్ ఫ్లోర్ ఇటలీలో బయటపడింది. ఆ కళఖండాన్ని నాటి కళాకారులు ఎంత అద్భుతం తీర్చిదిద్దారో దాన్ని చూస్తేనే అవగతమవుతుంది. ఇది నాటి రోమన్ సామ్రాజ్యంలోనిదేనని, కీస్తూ శకం 4వ లేదా 5వ శతాబ్దం నాటిదని చెబుతున్నారు. రోమన్ సామ్రాజ్యం ఓ వెలుగు వెలుగుతున్నప్పుడూ ఈ అసాధారణ కళాత్మక నైపుణ్యాలు కోకొల్లలుగా ఉండేవని చెబుతున్నారు. Carvilio's Ring is a unique 1st-century AD artifact recovered from Roman tomb. Commissioned by a matron Aebutia Quarta in memory of her son Carvilius the ring features a gold likeness of the deceased beneath a rock crystal lens creating a holographic effect. pic.twitter.com/ZyKjghpHw1 — ThePhotino (@the_photino) June 9, 2023 The Roman mosaic floor located in Montorio, Verona, Italy, is a remarkable archaeological discovery that dates back to the 4th and 5th centuries AD. This intricate mosaic artwork showcases the extraordinary craftsmanship and artistic excellence of the Roman Empire during its… pic.twitter.com/t6ljf1hRny — Historic Vids (@historyinmemes) July 5, 2023 -
ఓసినీ వేషాలో..! ఉడుత చేష్టలకు నెటిజన్స్ ఫిదా.. వీడియో వైరల్
సాధారణంగా జంతువులు యజమాని దృష్టిని ఆకర్షించడానికి రకరకాల తిక్క పనులు చేస్తుంటాయి. ఇటు.. అటు.. దూకుతుంటాయి. పక్క జంతువులతో ఊరికే గొడవ పడుతుంటాయి. కొన్ని సార్లు దెబ్బతగిలినట్లు యాక్టింగ్ కూడా చేస్తుంటాయి. ఇలాంటి చేష్టలను మన పెంపుడు కుక్కల్లో చూస్తుంటాం. కానీ ఉడుతలు కూడా ఈ కొవలోకి వచ్చేశాయా? అని అనిపిస్తుంది మీరు ఈ వీడియో చూస్తే..! ఇంతకూ ఓ నల్లని ఉడత ఏ చేసిందో తెలుసా..? ఉడుతలు కూడా యాక్టింగ్ చేస్తాయా? అంటే అవుననే అనాలి. దానికి ఏం అనిపించిందో తెలియదు కానీ ఇంట్లో చీపురుతో కాసేపు ఆటలాడింది. అనంతరం ఆ చీపురును మీద వేసుకుని గది ఫ్లోర్‌పై బోర్లా పడుకుంది. చీపురు దాని పొట్టపై పడి ఉండడంతో.. ఉడుతపై చీపురు పడి గాయపడినట్లుందే అని అనిపించాల్సిందే సదరు వీక్షకునికి. దాని నటనకు ఆస్కార్ ఇవ్వొచ్చనుకోండి..! ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. ఉడుత కొంటె చేష్టలకు వ్యూవర్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నట్లు కామెంట్ పెట్టారు. (ఫ్లైయింగ్ ఉండుత.. లైయింగ్ ఉడుత) 'ఎగిరే ఉడుత.. అబద్దాల ఉడుత' అని మరొకరు కామెంట్ చేశారు. Squirrel fakes an injury pic.twitter.com/5xXeTFUv7U — Crazy Clips (@crazyclipsonly) June 3, 2023 ఉడుతలు చాలా చురుకుగా ఉంటాయని ఓ జంతు నిపుణుడు తెలిపారు. నిత్యం ఎగురుతూ, దూకుతూ ఆటలాడుతుంటాయని చెప్పారు. పట్టణాల్లోని గదులు వాటికి చాలా చిన్న ప్రదేశం కావున ఆడుకోవడానికి కావాల్సిన ప్రదేశం ఉండదని అన్నారు. నల్లని ఉడుతలను పెంచడానికి అనుమతి లేదని చెప్పారు. వాటికి ప్రత్యేకమైన కేర్ అవసరమని పేర్కొన్నారు. వెటర్నరీ సెంటర్లలో లభించవని తెలిపారు. సాధారణంగా ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల్లో ఉంటాయని చెప్పారు. ఇదీ చదవండి: వార్నీ..! కుక్కకు ఇంత పెద్ద నాలుకా..! గిన్నీస్ రికార్డ్ -
తప్పతాగి బెడ్ మీద నగ్నంగా.. పోలీసులు షాక్
ఆయనో ప్రముఖ కంపెనీకి టాప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. తాగుడు అలవాటుకు బానిసయ్యాడు. ఆ మత్తులో తప్పతాగి పరాయి వాళ్ల ఇంట్లో నిద్రపోయాడు. అదీ నగ్నంగా!. ఆ ఇంటి ఓనర్ తిరిగి వచ్చేంత వరకు కూడా ఆ వ్యక్తి అక్కడే పడుకుని ఉన్నాడు. తీరా ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుని ఒక్కసారిగా షాక్ అయ్యారు పోలీసులు. అమెరికాలోని ఫాయెట్విల్లే పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...‘‘ఆదివారం తెల్లవారుజామున ఒక మహిళ నుంచి ఒక అపరిచిత వ్యక్తి మా ఇంట్లో నిద్రపోతున్నాడంటూ కాల్ వచ్చింది. దీంతో మేము హుటాహుటినా ఆమె ఇంటికి వెళ్లాం. ఆ వ్యక్తి ఆ మహిళ బెడ్ మీద నిద్రిస్తూ కనిపించాడు. అతని బట్టలన్నీ నేలపై పడి ఉన్నాయి. మేము బలవంతంగా పైకి లేపి కూర్చొబెట్టినప్పటికీ నిద్రపోవడానికే ప్రయత్నిస్తున్నాడు. మేము ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నా అతను మాట్లాడే స్థితిలో లేడు’’ అని పోలీసులు తెలిపారు. విచారణలో ఆ వ్యక్తి ఎవరో తెలిసి పోలీసులు షాక్ తిన్నారు. అమెరికాలోని ప్రముఖ మాంసం ప్రాసెసింగ్ చేసే టైసన్ ఫుడ్స్ కంపెనీ వ్యవస్థాపకుడి మనవడు జాన్ ఆర్ టైసన్‌గా గుర్తించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారాయన. ఈ వ్యవహారంతో జాన్‌ను.. అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. తాత పేరుప్రఖ్యాతలు, పరువు పొగొట్టిన మనవడిగా ఇప్పుడతనిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఐతే ఈ విషయమే కంపెనీ వ్యాఖ్యానించడానికి నిరాకరించింది. ఇది ఆయన వ్యక్తిగత విషయం అని చెప్పింది. ఐతే సదరు ఆఫీసర్ మాత్రం తాను చేసిన పనికి సిగ్గుపడుతున్నానని, కంపెనీ విలువలను, తన వ్యక్తిగత విలువలను దిగజార్చాను అంటూ క్షమాపణలు చెప్పాడు జాన్ టైసన్. ప్రసుతం తాను డ్రింకింగ్ అడిక్షన్ నుంచి బయటపడటానికి కౌన్సిలింగ్ తీసుకుంటున్నానని చెప్పారు. (చదవండి: కాంట్రవర్సీ: తాగుబోతు స్టాంప్ కోసం పురుషులకు 20 ఏళ్లు.. స్త్రీలకు రెండేళ్లే చాలట!) -
సముద్రలోతుల అంతు చూస్తాం...!
ప్రస్తుతం అత్యాధునిక శాస్త్ర,సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుకు రోజుకు నూతన ఆవిష్కరణలు వెలుగుచూస్తున్నాయి. అయినప్పటికీ ఈ సువిశాల విశ్వంలో ఇంకా ఎన్నో రహస్యాలు తెరమరుగునే ఉండిపోతున్నాయి. చందమామ ఉపరితలం ఎలా ఉంటుంది? కుజ గ్రహంపై ఏముంటుంది ? అన్న విషయాల గురించి తెలుసు కాని సముద్రగర్భంలో ఏమేమి నిక్షిప్తమై ఉన్నాయి ? వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనాలపై ఇంకా పూర్తిస్థాయి అవగాహన సాధించలేకపోయాము. ప్రపంచవ్యాప్తంగా కొన్ని సముద్రాల అడుగున ఏముందన్నది ఇంకా మిస్టరీగానే మిగిలిపోయింది. 21వ శతాబ్దంలోనూ ఇలాంటి పరిస్థితి ఎదురుకావడమేంటీ అన్న ప్రశ్నల నుంచే ‘ద సీ బెడ్ 2030 ప్రాజెక్టు’ రూపుదిద్దుకుంది. వివిధ ఖండాల మీదుగా ఉన్న సముద్రగర్భాన్నంతా 2030 కల్లా ‘మ్యాపింగ్’ చేయాలనేది ఈ ప్రాజెక్టు లక్ష్యం. సముద్రం ద్వారా 2030 కల్లా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నేరుగా 3 ట్రిలియన్ డాలర్ల ఆదాయం (2010లో 1.5 ట్రిలియన్ డాలర్లు) చేకూరుతుందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అంచనా. 2021–30 సంవత్సరాల మధ్యనున్న కాలాన్ని ‘ఓషియన్ సైన్స్ ఫర్ సస్టెయినబుల్ డెవలప్మెంట్’గా ఐరాస తీర్మానించిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. దీని వెనక ఎవరు ? జపాన్‌కు చెందిన దాతృత్వసంస్థ ‘నిపాన్ ఫౌండేషన్, ఐరాస సాంస్కృతిక సంస్థ యునెస్కో, ఇంటర్నేషనల్ హైడ్రోగ్రాఫిక్ ఆర్గనైజేషన్ల కింద పనిచేసే జిబ్కో (లాభాపేక్ష లేని నిపుణుల సంఘం–సముద్రం అడుగున ఏముందని అన్వేషణలు సాగిస్తున్న సంస్థ) సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు ఏర్పడింది. భారత సంతతికి చెందిన కెనడా పౌరుడు సతీంతర్ బింద్రా డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏం చేస్తారు ? ప్రపంచవ్యాప్తంగా నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. వాటిలోని నిపుణులు, పరిశోధకులు ఇప్పటికే విభిన్నరూపాల్లో అందుబాటులో ఉన్న వివరాలు, సమాచారాన్ని సేకరిస్తారు. ఆ తర్వాత ఆ సమాచారాన్నంతటిని బ్రిటన్‌లోని నేషనల్ ఓషియనోగ్రఫీ సెంటర్లో ఆయా అంశాలను క్షుణ్ణంగా పరీక్షించి ఒకచోట చేరుస్తారు. వాణిజ్యనౌకలు, చేపలు పట్టే మర పడవలు, అండర్‌వాటర్ డ్రోన్ల ద్వారా ఇప్పటికే సేకరించిన వివరాలు, సమాచారంతో పాటు సముద్ర పరిశోధకులు నిగ్గుతేల్చిన అంశాలను ఒకచోట చేరుస్తారు వివిధ రూపాల్లో ఇప్పటికే వెల్లడైన విషయాలతో పాటు, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మునిగిపోయిన నౌకలపై సముద్ర అన్వేషకులు జరిపిన పరిశోధనాంశాలు, వాణిజ్య,వ్యాపార కంపెనీల వద్ద ఉన్న సమాచారాన్ని కూడా తీసుకుంటారు 2014లో మలేషియా ఎయిర్‌లైన్స్ ఎమ్మెచ్ 370 విమాన ప్రమాదం నేపథ్యంలో డచ్ దేశానికి చెందిన ఫుగ్రో సంస్థ 65 వేల కి,మీ మేర సముద్ర అడుగుభాగాన్ని జల్లెడ పట్టింది. ఈ సందర్భంగా జరిపిన పరిశోధన వివరాలు కూడా ఇందులో జతచేస్తారు మలేషియా విమానం ఆచూకీ కనుక్కునేందుకు పనిచేస్తున్న ఓషియన్ ఇనిఫినిటీ సంస్థ కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామి అయ్యింది. ఎందుకోసం ? సునామీ సంభవించినపుడు అలల ఉధృతి, పయనించే గమనం ఎలా ఉండబోతుందో అంచనా వేయడం మత్స్యసంపద కదలికలు ఎటునుంచి ఎటు ఉంటాయో కనిపెడతారు కాలుష్యం ఏ మేరకు వ్యాపించింది, దానిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సముద్రగర్భంలో నిగూఢంగా ఉండిపోయిన ఖనిజ నిక్షోపాల గుట్టు తేలుస్తారు నౌకలు, ఓడల గమనం, రవాణా దారులు కనుక్కుంటారు ఎంత ఖర్చవుతుంది ? ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 300 కోట్ల డాలర్లు ఖర్చవుతుందని అంచనా. -సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
నేల‘రాత’లకు స్వస్తి
పకడ్బందీగా ‘పది’ పరీక్షలు అన్ని కేంద్రాల్లోనూ ఫర్నీచరు ఏర్పాటు అక్రమాలకు పాల్పడితే జైలుకే 25 యాక్ట్ పక్కాగా అమలు జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ ‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించనున్నాం.. ఇకపై నేల ‘రాత’లకు స్వస్తి పలకనున్నాం. ఈ ఏడాది విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించనున్నాం. ఫర్నీచరు సదుపాయంపై ప్రత్యేక ప్రాధాన్యత తీసుకున్నాం.. ఇప్పటికే విద్యాశాఖ కమిషనరు, జిల్లా కలెక్టర్, ఆర్జేడీ తదితర అధికారులు పలుమార్లు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని జిల్లా విద్యాశాఖాధికారి పగడాల లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏ ఒక్క పరీక్ష కేంద్రంలోనూ విద్యార్థులు కింద కూర్చొని పరీక్ష రాయకూడదన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేసినట్లు ఆయన ‘సాక్షి’ కి మంగళవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 193 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 49,555 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. సాక్షి : చాలా కేంద్రాల్లో ఫర్నీచర్ సమస్య ఉంది. ఈ సమస్యను ఎలా అధిగమిస్తారు? డీఈఓ : ఫర్నీచరు కొరత వాస్తవమే కొన్ని కేంద్రాల్లో ఫర్నీచర్ అసలే లేదు. అలాంటి కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల నుంచి సర్దుబాటు చేస్తున్నాం. పరీక్ష ప్రారంభమయ్యే నాటికి ఏ ఒక్క కేంద్రంలోనూ సమస్య ఉత్పన్నం కాదు. సాక్షి : దూర ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలకు చేరుకోవాలంటే రవాణా సౌకర్యం సరిగా లేదు. విద్యార్థుల సమస్యలపై మీరేమంటారు? డీఈఓ : ఈ విషయంలో ఆర్టీసీ అధికారులకు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏ కేంద్రానికి ఏఏ గ్రామాల నుంచి విద్యార్థులు వస్తారనే వివరాలు ఆర్టీసీ అధికారులు తీసుకున్నారు. విద్యార్థులకు అనుకూలంగా ఆయా రూట్లలో బస్సులు నడుపుతారు. ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాక్షి : సీఓలు, డీఓలు, ఇన్విజిలేషన్ డ్యూటీలు పూర్తయ్యాయా? డీఈఓ : చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులను నియమించాం. అవసరం కంటే కూడా పది శాతం అదనంగా నియమించాం. వివరాలను హైదరాబాద్‌కు పంపాం. ఇన్విజిలేటర్ల నియామకాలు పూర్తయ్యాయి. సెంటర్ కాపీలు, వ్యక్తిగత కాపీలు ఆయా ఎంఈఓలకు అందజేశాం. పరీక్ష ముందురోజు వారికి అందజేస్తారు. విధులకు నియమించిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా పని చేయాల్సిందే. నియామక ఉత్తర్వులను ఎట్టిపరిస్థితుల్లోనూ రద్దు చేయం. సాక్షి : మాస్ కాపీయింగ్, చూచిరాతను నియంత్రిస్తారా? డీఈఓ : ఈ విషయంలో ప్రభుత్వం ఈసారి చాలా సీరియస్‌గా ఉంది. పరీక్షల విధుల్లో ఉన్న ఏ స్థాయివారైనా ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే జైలుకు పంపడం ఖాయం. ఇంతకాలమూ పరీక్షల విధుల్లో అలసత్వం ప్రదర్శించే వారిని సస్పెండ్ చేయడం.. లేదంటే పరీక్షల విధుల నుంచి తప్పించడం.. మహా అయితే ఇంక్రిమెంట్లలో కోత విధించడం వంటి చర్యలు ఉండేవి. ఈసారి అలాకాదు..1997 నాటి యాక్ట్ 25 సెక్షన్ 10లోని నిబంధనలను అమలు చేయనున్నాం. బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదుతో పాటు ఆర్నెళ్ల నుంచి మూడేళ్ల వరకు జైలుశిక్ష, రూ.5 వేలు నుంచి రూ. లక్ష వరకు జరిమానా ఉంటుంది. సాక్షి : డీఈఓ స్థాయిలో తొలిసారి ‘పది’ పరీక్షలు నిర్వహిస్తున్నారు కదా? ఎలాంటి అనుభూతి ఉంది? డీఈఓ : డిప్యూటీ డీఈఓగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా అనేకమార్లు పదో తరగతి పరీక్షల నిర్వహణలో పాలుపంచుకున్నాను. ఆ అనుభవం చాలా ఉపయోగపడుతోంది. అందరి సహకారంతో ఎలాంటి ఇబ్బందీ లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూస్తాననే నమ్మకం ఉంది. సాక్షి : గతేడాది జిల్లాలో మంచి ఫలితాలొచ్చాయి. ఈసారి ఎలా ఎలాంటి ఫలితాలు వస్తాయి? డీఈఓ : గతేడాదికంటే ఈసారి మెరుగైనా ఫలితాలు వస్తాయనే నమ్మకం ఉంది. ఎందుకంటే తొలిసారి నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం అమలవుతోంది. దీనిపై విషయ నిపుణులు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు విస్త్రత అవగాహన కల్పించారు. అది చాలా ఉపయోగపడుతుందనే నమ్మకం ఉంది. -
బిహార్‌లో మరో హైటెక్ కాపీయింగ్
పాట్నాః జనతాదళ్ పాలిస్తున్న బిహార్ రాష్ట్రంలో విద్యారంగం అవినీతిలో కూరుకుపోయింది. అందుకు తాజాగా మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. స్థానిక రోటాస్ కళాశాల విద్యార్థులు గుంపులు గుంపులుగా నేలపై కూర్చొని, మొబైల్ లైట్లతో పరీక్షలు రాయడం మళ్ళీ కలకలం రేపింది. బిహార్ రోటాస్ కాలేజీ విద్యార్థులు పరీక్షలు రాసిన తీరు చూస్తే... యాజమాన్య అలసత్వం, విద్యారంగంలో డొల్లతనం మరోసారి బయటపడింది. స్నేహంలోనే కాదు పరీక్షలు రాయడంలోనూ విద్యార్థులు ఐకమత్యాన్ని ప్రదర్శించారు. ఇటీవల బిహార్ లో 12వ తరగతి విద్యార్థుల పరీక్షల టాపర్స్ స్కాం వెలుగులోకి వచ్చి, విచారణలో నిజాలు బహిర్గతమైనా అక్కడి పరిస్థితి మాత్రం మారలేదు. తాజాగా రోటాస్ కాలేజీ విద్యార్థులు నేలమీద గుంపుగా కూర్చుని, మొబైల్ లైట్ల వెలుగులో హాయిగా కలసి మెలసి పరీక్షలు రాస్తున్నట్లుగా బయటపడ్డ ఫొటోలు ఇప్పుడు అక్కడి విద్యారంగాన్నే ప్రశ్నిస్తున్నాయి. రోటాస్ కాలేజీలో కనీస సౌకర్యాలు కూడ లేవన్నదానికి ప్రస్తుతం బయటపడ్డ ఫొటోలు ప్రత్యక్ష సాక్ష్యాలుగా కూడ మారాయి.