మార్కెట్‌లోకి కొత్తరకం ఫ్లోర్ క్లీనర్.. చార్జ్‌ పెడితే చాలు! | Dyson launches WashG1 its first dedicated wet floor cleaner in India | Sakshi
Sakshi News home page

మార్కెట్‌లోకి కొత్తరకం ఫ్లోర్ క్లీనర్.. చార్జ్‌ పెడితే చాలు!

Published Fri, Oct 11 2024 9:07 PM | Last Updated on Sat, Oct 12 2024 9:27 AM

Dyson launches WashG1 its first dedicated wet floor cleaner in India

తడి, పొడి చెత్తను ఏక కాలంలో తొలగించి ఫ్లోర్‌ను పరిశుభ్రం చేసే ప్రత్యేకమైన కార్డ్-ఫ్రీ వెట్ ఫ్లోర్ క్లీనర్‌ను డైసన్ కంపెనీ మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని పేరు డైసన్ వాష్‌జీ1. పరిశుభ్రమైన శుభ్రత, నిర్వహణ కోసం దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త రకం ఫ్లోర్‌ క్లీనర్ ధర రూ. 64,900.

వాష్‌జీ1 ఫ్లోర్‌ క్లీనర్‌ ఒక లీటర్ ట్యాంక్‌తో వస్తుంది. తడి, పొడి చెత్తను ఒకేసారి శుభ్రం చేయడానికి హైడ్రేషన్‌, శోషణ, ఎక్స్‌ట్రాక్షన్‌ పద్ధతుల కలయికను ఉపయోగిస్తుంది. ఇది ఒక ఛార్జ్‌లో 3100 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది. ఈ క్లీనర్‌ను దేశం అంతటా డైసన్‌ వెబ​్‌సైట్‌లో ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో డైసన్‌ డెమో స్టోర్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement