new device
-
కొత్త డివైస్ : ఇది కట్టుకుంటే నొప్పులు మాయమట!
జిమ్‌లో వ్యాయామం చేసేవారికి, మైదానాల్లో ఆటలాడే వారికి ఒక్కోసారి కీళ్లు పట్టేసి నొప్పులు తలెత్తడం మామూలే! ఇళ్లల్లో రోజువారీ పనులు చేసుకునేటప్పుడు కూడా ఒక్కోసారి నొప్పులు తలెత్తుతుంటాయి. ఇలాంటి నొప్పులకు నొప్పినివారణ మాత్రలు వాడటం, పైపూతగా ఆయింట్మెంట్లు పూసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇకపై వాటితో పని లేకుండా, ఈ ఫొటోలో కనిపిస్తున్న పరికరాన్ని నొప్పి ఉన్నచోట పెట్టుకుని, దీనికి ఉన్న బెల్టుతో బిగించి కట్టుకుంటే చాలు, సత్వరమే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అమెరికన్ కంపెనీ ‘థెరాబాడీ’ ఇటీవల ‘రికవరీ థెర్మ్‌క్యూబ్’ పేరిట ఈ పరికరాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మనం కోరుకున్న విధంగా చల్లదనం లేదా వెచ్చదనాన్ని ఎంచుకోవడానికి స్విచ్‌లు ఉంటాయి. నొప్పి ఉన్న చోట ఈ క్యూబ్‌ను అదిమిపెట్టి బిగించి బెల్ట్ కట్టుకుంటే చాలు, రెండు గంటల్లోనే పూర్తిగా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇవీ చదవండి : చలి పులి వచ్చేస్తోంది నెమ్మదిగా...ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది! -
మార్కెట్లోకి కొత్తరకం ఫ్లోర్ క్లీనర్.. చార్జ్ పెడితే చాలు!
తడి, పొడి చెత్తను ఏక కాలంలో తొలగించి ఫ్లోర్‌ను పరిశుభ్రం చేసే ప్రత్యేకమైన కార్డ్-ఫ్రీ వెట్ ఫ్లోర్ క్లీనర్‌ను డైసన్ కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. దీని పేరు డైసన్ వాష్జీ1. పరిశుభ్రమైన శుభ్రత, నిర్వహణ కోసం దీన్ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త రకం ఫ్లోర్ క్లీనర్ ధర రూ. 64,900.వాష్జీ1 ఫ్లోర్ క్లీనర్ ఒక లీటర్ ట్యాంక్‌తో వస్తుంది. తడి, పొడి చెత్తను ఒకేసారి శుభ్రం చేయడానికి హైడ్రేషన్, శోషణ, ఎక్స్ట్రాక్షన్ పద్ధతుల కలయికను ఉపయోగిస్తుంది. ఇది ఒక ఛార్జ్‌లో 3100 చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కవర్ చేస్తుంది. ఈ క్లీనర్‌ను దేశం అంతటా డైసన్ వెబ్సైట్లో ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లో డైసన్ డెమో స్టోర్ల నుండి కొనుగోలు చేయవచ్చు. -
విల్లులా.. ఒంపులు తిరిగిన కనుబొమ్మలకై ఈ డివైస్..!
విల్లులా.. ఒంపులు తిరిగిన కనుబొమ్మలు, నిండైన కనురెప్పలే కళ్లకు అందం. కనురెప్పలు పెద్దగా అందంగా ఉంటే ముఖం కళగా కనిపిస్తుంది. అందుకే చాలామంది కనురెప్పలకు త్రీడీ ఐలాష్లను అతికించుకుంటారు. అయితే చిత్రంలోని ఈ ఎలక్ట్రిక్ డివైస్ ఇంట్లో ఉంటే, ప్రత్యేకంగా ఐలాష్‌లు కొని అతికించుకోవాల్సిన అవసరం లేదు. దీంతో సహజంగా ఉన్న కనురెప్పలనే మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.ఈ ఎలక్ట్రిక్ ఐలాష్ కర్లర్ మెషిన్ చార్జింగ్‌తో నడుస్తుంది. దీన్ని ముందే ఆన్ చేసి, హీట్ చేయాలి. అనంతరం కనురెప్పలకు అమర్చి ఉంచితే, అదే ఆ వెంట్రుకలను స్టైటెనింగ్ చేసి, కర్లింగ్ చేస్తుంది. దీంతో కనురెప్పలపై వెంట్రుకలు ఒంపులు తిరిగి పొడవుగా, అందంగా కనిపిస్తాయి. ఈ మెషిన్‌ను 10 సెకన్లలో ప్రీ హీట్ చేసుకోవచ్చు. దీనిలో రెండు రకాల మోడ్స్ ఉంటాయి. సెన్సింగ్ సిలికాన్ ప్యాడ్‌తో రూపొందిన ఈ డివైస్ చర్మానికి, కళ్లకు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. వేడి ఎక్కువ కావడం, చర్మం కాలడంలాంటి సమస్యలు ఉండవు.దీనిలోని ఒక మోడ్ 65 డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి 149 డిగ్రీల ఫారెన్ హీట్ వరకూ గ్రీన్ కలర్ లైట్‌ను చూపిస్తూ పని చేస్తుంది. అలాగే మరో మోడ్ 85 డిగ్రీల ఫారెన్ హీట్ నుంచి 185 డిగ్రీల ఫారెన్ హీట్‌తో బ్లూ కలర్ లైట్‌ను చూపిస్తూ పని చేస్తుంది. ఈ సెకండ్ మోడ్ ఆప్షన్ బిరుసైన వెంట్రుకలకు అనుకూలంగా ఉంటుంది. మోడ్‌లను మార్చడానికి డివైస్ పైభాగంలో సింగిల్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇనొవేటివ్ హీటింగ్ ఫంక్షన్ తో కూడిన ఈ ఎర్గోనామిక్ డిజైన్.. వినియోగానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే ఇది పోర్టబుల్, కాంపాక్ట్ కూడా. ఎక్కడికైనా సులభంగా తీసుకువెళ్లవచ్చు. ఇది మీ బ్యూటీ కిట్, కాస్మెటిక్ బాక్స్ లేదా ట్రావెల్ కేస్‌లో సులభంగా అమరిపోతుంది. ఈ డివైస్‌తో కనురెప్పలను కర్ల్ చేసుకుని, అనంతరం మస్కారా, ఐలైనర్ వంటివి వేసుకుంటే సరిపోతుంది.ఇవి చదవండి: Health: ఎటువంటి మందులు వాడకుండానే ఇలా జరిగింది.. అసలు కారణాలేంటి? -
Kissing Device: దూరంగా ఉన్నా కిస్ చేసుకోవచ్చు.. ఎలా అనుకుంటున్నారా?
లవర్స్ అంటేనే ఒకరినొకరు విడిచిపెట్టకుండా ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళ ప్రపంచంలో గడిపేస్తారు. దూరంగా వున్న లవర్స్ అయితే రోజూ ఫోన్లో మాట్లాడుకోవడంతో సరిపోతుంది. ఇప్పుడు అలాంటి లవర్స్ కోసం కిస్సింగ్ డివైజ్ అనే కొత్త పరికరం పుట్టుకొచ్చింది. చైనాకు చెందిన 'జియాంగ్ జోంగ్లీ' కిస్సింగ్ డివైజ్ కనుగొన్నాడు. వర్చువల్‌గా రొమాన్స్ చేసుకునేలా దీన్ని ప్రత్యేకంగా రూపొందించాడు. లాంగ్ డిస్టెన్స్ కపుల్స్ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ డివైజ్ ఒక యాప్ ద్వారా పనిచేస్తుంది. ఈ డివైజ్ సిలికాన్‌తో తయారు చేసిన పెదాలను కలిగి ఉండటం వల్ల రియల్ కిస్ ఫీలింగ్ అందిస్తాయని చైనాలోని గ్లోబల్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. దీని కోసం ప్రెజర్ సెన్సార్లు, యాక్యురేటర్లు ఇందులో అమర్చబడి ఉన్నాయి. ఈ డివైజ్ పనిచేయాలంటే తప్పకుండా యాప్ ఉండాలి. యాప్ డౌన్లోడ్ చేసుకుని మొబైల్ ఛార్జింగ్ పోర్టుకి ఈ డివైజ్ కనెక్ట్ చేయాలి. ఈ తరువాత వీడియో కాల్ చేసి పార్ట్నర్ డివైజ్‌కు కిస్లను పంపవచ్చు. ఇది నిజ అనుభూతిని అందిస్తుందని చైనాలోని కొంతమంది చెబుతున్నారు. మరి కొంతమంది ఇలాంటి డివైజెస్ అసభ్యకరంగా ఉంటాయని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరికరాలు పిల్లల జీవితాలమీద ప్రభావం చూపుతాయని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Remote kissing device recently invented by a Chinese university student. The device is designed specifically for long-distance relationships and can mimic and transfer the kiss of a person to the "mouth on the other side" pic.twitter.com/G74PrjfHQA — Levandov (@blabla112345) February 23, 2023 -
వెక్కిళ్లు ఆగడం లేదా.. ఈ ‘స్ట్రా’తో చెక్ పెట్టేయొచ్చు!
వెక్కిళ్లు వస్తే ఏం చేస్తారు..? ఏముంది కాసేపు ఊపిరి బిగపట్టడం లేదా నీరు తాగుతాం అంతేకదా..! కొన్నిసార్లు ఎంతసేపు ఊపిరి బిగపట్టినా లేదా నీరు తాగినా కొందరికి వెక్కిళ్లు అస్సలు ఆగవు. చాలాసేపు వెక్కిళ్లు రావడం మంచిది కాదనే విషయం మనకు తెలిసిందే. అలాంటి వారికి వెంటనే వెక్కిళ్లు ఆగిపోవాలంటే ఏం చేయాలి? అలాంటి వారికోసమే ‘హిక్ అవే’అనే పరికరాన్ని తాజాగా యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ హెల్త్ సైన్స్ సెంటర్‌కు చెందిన డాక్టర్ అలీ సీఫీ అభివృద్ధి పరిచారు. ‘ఎల్’ఆకారంలో ఉండే ఈ స్ట్రా పరికరం దాదాపు 92 శాతం మందిలో సమర్థంగా పనిచేసిందని చెబుతున్నారు. గ్లాసులోని నీటిని ఈ స్ట్రా ద్వారా పీల్చుకుంటే చాలు క్షణాల్లో వెక్కిళ్లను తగ్గించేస్తుందని పేర్కొంటున్నారు. ఒకవైపు సన్నగా ఉండి నీటిని పీల్చుకోవడానికి వీలుగా ఉంటుంది. మరోవైపు అడ్జస్ట్ చేసుకునే వీలుండి, చిన్న రంధ్రం మాదిరిగా ప్రెషర్ వాల్వ్ ఉంటుంది. ఈ చిన్న వాల్వ్ ద్వారా నీటిని గట్టిగా పీల్చుకోవడం ద్వారా ఫ్రెనిక్ నాడీకణం క్రియాశీలమై మనకు వెక్కిళ్లు రావడానికి కారణమైన మన శరీరంలోని విభాజపటలం (డయాఫ్రమ్) ముడుచుకుపోతుంది. పీల్చుకున్న నీటిని మింగాలంటే వేగస్ నాడీ కణం క్రియాశీలం కావాలి. ఈ రెండు నాడీ కణాలే మనకు వెక్కిళ్లు రావడానికి కారణం. ‘హిక్ అవే స్ట్రా’ద్వారా నీటిని తాగితే ఈ రెండు నాడీ కణాలను నీటిని గట్టిగా పీల్చడం, నీటిని మింగడం వంటి వేరే పనుల్లో బిజీ చేయడం ద్వారా వెక్కిళ్లు రాకుండా చేయొచ్చని డాక్టర్ అలీ సీఫీ వివరించారు. -
క్రియేటివిటీ : తెరిస్తే టీవీ.. మడిస్తే లైట్
పై ఫోటోలో కనిపిస్తోన్న బుక్‌ఫైల్‌ను తెరిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇది ఒక టూ ఇన్ వన్ టీవీ. టూ ఇన్ వన్ అంటే.. టీవీ ఫ్లస్ బుక్ అనుకునేరు. కాదు టీవీ ఫ్లస్ టేబుల్ ల్యాంప్. కెనాడాకు చెందిన జీన్ మైకెల్ రిచాట్ రూపొందించిన ఈ టీవీ.. ఫొల్డబుల్ ఓఎల్ఈడీ 24 ఇన్చెస్ డిస్ప్లే, ఇన్‌బిల్ట్ బ్లూటూత్ స్పీకర్‌తో ఉంటుంది. దీని పైన బుక్‌ఫైల్‌ను తలపించేలా లైట్ బ్లూ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేశారు. మీకు ఎప్పుడైనా టీవీ చూడాలనిపిస్తే ఈ బుక్‌ఫైల్‌ను తెరిస్తే చాలు. అలాగే లైట్ అవసరమైతే.. అప్పుడు ఈ బుక్‌ఫైల్‌ను మూయండి. బాగుంది కదూ. అయితే..ఈ టీవీ ధరను ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించి మార్కెట్లో ప్రవేశ పెట్టనున్నారు. చదవండి : క్రియేటివిటీ : తెరిస్తే టీవీ.. మడిస్తే లైట్ -
గాలిలోనే కరోనాని ఖతం చేసే వోల్ఫ్ ఎయిర్ మాస్క్
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి రోజు రోజుకి పెరిగిపోతున్న తరుణంలో దానిని అరికట్టడానికి కేరళ రాష్ట్రానికి చెందిన ఆల్ ఎబౌట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ "వోల్ఫ్ ఎయిర్ మాస్క్" పేరుతో గల ఒక పరికరాన్ని తయారుచేసినట్లు పేర్కొన్నారు. ఈ వోల్ఫ్ ఎయిర్ మాస్క్ చూడడానికి గోడకు తగిలించే ఒక పెద్ద సీసీ కెమెరాలాగా ఉంటుంది. ఇది గాలిలో చక్కర్లు కొడుతున్న కరోనా మహమ్మరిని చంపుతుందని కంపెనీ వారు పేర్కొంటున్నారు. ఇందులో అయాన్ టెక్నాలజీ ఉపయోగించినట్లు, అలాగే ఈ టెక్నాలజీ ఉపయోగించడం మన దేశంలోనే ఇదే మొదటిసారి అని వారు పేర్కొంటున్నారు. ఈ పరికరాన్ని తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ వారు టెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) మద్దతుతో నిర్వహించిన పరీక్ష ప్రకారం ఇది 99 శాతం కరోనా మహమ్మారిని కేవలం 15 నిమిషాల్లో చంపేయగలదు. ఇది దానంతట అదే స్టెరిలైజ్ చేసుకుంటుంది. ఈ పరికరం కంటిన్యూగా 60 వేల గంటలపాటు పని చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇక ఈ పరికరాన్ని ఆస్పత్రిలో, ల్యాబ్‌లో, ఆఫీసులో థియేటర్లలో సెట్ చేసుకోవచ్చని అని కంపెనీ వారు పేర్కొంటున్నారు. వోల్ఫ్ ఎయిర్ కేవలం కరోనాని మాత్రమే కాకుండా ఇతర రోగాలకు కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా చంపేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇలాంటి పరికరం సినిమా హాల్లో ఉంటే ఇక రోజంతా నాలుగు షోలు కూడా వేసుకోవచ్చని తెలిపారు. ఇక ఈ వస్తువు ధర విషయానికి వస్తే ఇండియామార్ట్ లో రూ.29,500గా నిర్ణయించారు. చదవండి: ఈ నెల 20 వరకు రాత్రి కర్ఫ్యూ.. 9 గంటలకే బంద్! -
‘కోవిడ్ బీప్’ ఆవిష్కరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఈఎస్ఐసీ వైద్య కళాశాల ఈసీఐఎల్ సహకారంతో కరో నా రోగుల కోసం స్వదేశీ పరిజ్ఞానంతో, తక్కువ ఖ ర్చులో, వైర్లెస్ ఫిజి యోలాజికల్ పారామితి పర్యవేక్షణ వ్యవస్థను రూపొందించింది. గాడ్జెట్‌కు కోవిడ్ బీప్ (నిరంతర ఆక్సిజనేషన్–వైటల్ ఇన్ఫర్మేషన్ డివైస్ బ యోమెడ్ ఈఎస్ఐసీ ఈసీఐఎల్) అని పేరు పె ట్టారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజా స మస్యలు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం దీన్ని ఆవిష్కరించారు. ఇందులో కిషన్‌రెడ్డి మాట్లాడు తూ ‘వోకల్ ఫర్ లోకల్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్థానిక పారిశ్రామికవేత్తలకు ఎగుమతి చేయడానికి, ప్రపంచ మార్కెట్ల అవసరాలను తీర్చడానికి అద్భుతమైన అవకాశాలు రానున్నాయి. ఈ అద్భుత ఆవిష్కరణను ప్రారంభించటం చాలా ఆనందంగా ఉంది. ఈ డివైజ్ ద్వారా కరోనా బాధితుల లొకేషన్‌తో పాటు వారి శరీర ఉష్ణోగ్రత, హృ దయ స్పందన, ఊపిరి వేగం, బ్లడ్ ఆక్సిజన్ సం తృప్తత, రక్తపోటు, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ)లను తెలుసుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా ఏ ప్రదేశం నుంచైనా వైద్యులు మొబైల్, కంప్యూటర్లో రోగుల పర్యవేక్షణను సులభతరం చేసి, సమయానుసారంగా చికిత్స చేయడానికి సహాయపడుతుంది. ’అని పేర్కొన్నారు. -
ఇక రూ. 10కే సీబీసీ పరీక్ష
కోల్‌కతా: కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్షను కేవలం రూ.10లోనే, 95% కచ్చితత్వంతో చేయగలిగే కొత్త పరికరాన్ని ఐఐటీ–ఖరగ్‌పూర్‌కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ మేరకు మోటార్ ద్వారా నడిచే డిస్క్ ఆధారిత పోర్టబుల్ పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు ఐఐటీ–ఖరగ్‌పూర్ తెలిపింది. ఈ పరికరం బయో–డీగ్రేడబుల్ అని, కొన్ని పరీక్షల అనంతరం దీన్ని డిస్పోజ్ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ గ్రామీణ ప్రజలకు సేవలను అందించడంలో ఓ కొత్త మార్పు తీసుకువస్తుందని, త్వరలో రానున్న ఐఐటీ–ఖరగ్‌పూర్‌కు చెందిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇలాంటి మరెన్నో పరికరాలను వాడుతూ సమాజంలోని ప్రతీ ఒక్కరికి టెలీ మెడిసిన్, మొబైల్ హెల్త్‌కేర్ అందేలా దోహదపడుతుందని ఐఐటీ–ఖరగ్‌పూర్ డైరెక్టర్ వీకే తివారీ తెలిపారు. -
సోలార్ ‘పవర్’ పెరిగింది
నెడ్‌క్యాప్ ద్వారా నెట్ మీటరింగ్ నెట్ మీటరింగ్తోనే ఇళ్లకు కరెంటు అందుబాటులోకి కొత్త డివైజ్ నెట్ మీటరింగ్‌కు 50 శాతం ప్రభుత్వ సబ్సిడీ పలమనేరు: ప్రస్తుతం విద్యుత్ కోతలు రాజ్యమేలుతున్నాయి. భవిష్యత్తులో నీరు, బొగ్గు తదితర సహజ వనరుల కొరత ఏర్పడితే ఈ కష్టాలు మరింత పెరగడం ఖాయం. భవిష్యత్తులో విద్యుత్ సంక్షోభాలు రావొచ్చు. వీటికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం కనిపిస్తున్న ఒకేఒక మార్గం సోలార్ విద్యుత్. సోలార్ విద్యుత్‌ను బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్-నాన్ కన్వర్షనల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్), భారతప్రభుత్వ సహకారంతో నెట్‌మీటరింగ్‌ను ఈ మధ్యనే ప్రవేశపెట్టింది. ఇళ్లు, వ్యాపార సముదాయా లు తదితరాల్లో చిన్న సోలార్ యూనిట్ల ద్వా రా తయారైన విద్యుత్‌ను తమ అవసరాలకు వాడుకుంటూ మిగిలిన విద్యుత్‌ను ప్రభుత్వ గ్రిడ్‌కు మళ్లించి అందుకు తగ్గ నగదును విని యోగదారులు పొందవచ్చు. నెట్ మీటరింగ్ ఎలా పనిచేస్తుందంటే.. గృహాలు తదితరాలకు ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెల్స్ ద్వారా ప్రభుత్వ విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. అక్కడి నుంచి తిరిగి వినియోగదారులకు కరెంటు సరఫరా అవుతుంది. ఈ రకంగా సోలా ర్ ప్యానెల్ నుంచి ఎంత విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపారు, ఎంత వాడుకున్నారు తదితర వివరాలను నెట్ మీటరింగ్ లెక్క కడుతుంది. దీన్ని ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఓ కేవి కెపాసిటీ గల సిస్టమ్‌ను ఏర్పా టు చేయాలంటే వంద చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖాళీ స్థలముంటే సరిపోతుంది. భవనాల పైకప్పులు లేదా మేడలపై కూడా వీటిని అమర్చుకోవచ్చు. ఆరు నెలలకోసారి మిగులు విద్యుత్‌కు విద్యుత్ సంస్థలు నిర్ధారించిన రూ.2.70 యూనిట్‌కు వినియోగదారునికి చెల్లిస్తారు. ఈ మీటర్ ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ఏడేళ్ల వరకు ఈ చెల్లింపులు జరుగుతాయి. నెడ్‌క్యాప్ 50 శాతం సబ్సిడీతో ఈ పరికరాలను అందజేస్తోంది. ప్రత్యామ్నాయంగా మరో పరికరం నెట్‌మీటరింగ్ పట్టణవాసులకు ఉపయోగకరమే గానీ పల్లెలకు అంతగా ఉపయోగం ఉండదు. కరెంటు లేనప్పుడు ఈ పరికరం వృధానే. దీంతో పలమనేరుకు చెందిన గ్రామీ ణ యువశాస్త్రవేత్త పవన్ తన పవన్ ఎంపవర్మెంట్ సొల్యూషన్స్ ద్వారా ఓ కొత్త పరికరాన్ని కనుగొన్నాడు. దీని పేరే హైబ్రీడ్ నెట్‌మీటరింగ్ చేంజర్ దీని ద్వారా కరెంటు లేనప్పుడు సైతం బ్యాటరీల్లో కరెంటును నిల్వ చేసుకొని సొంత అవసరాల కోసం వాడుకోవచ్చు. ఆపై మిగులు విద్యుత్‌ను కరెంటు ఉన్నప్పుడు గ్రిడ్‌కు సరఫరా చేయొచ్చు. ఇదెంతో ఉపయోగకారిణిగా ఉంది. ఇదో మంచి పథకం సోలార్ రూట్ టాప్ ప్యానెల్స్ ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక కిలోవాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి రూ. 60వేలు ఖర్చవుతుంది. కేంద్ర నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వ శా ఖ (ఎంఎన్ఆర్ఈ) సహకారంతో నెడ్‌క్యాప్ 50 శాతం సబ్సిడీ ద్వారా దీన్ని అమలు చేస్తోంది. కరెంటు ఆదాతో పాటు డబ్బులొచ్చే మార్గమిది. - రాజశేఖర్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఏడీ, పలమనేరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం ప్రస్తుతం నెట్‌మీటరింగ్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ఇప్పటికే చిత్తూరు, తిరుపతి నగరాల్లో దీన్ని ప్రవేశపెట్టాం. సోలార్ విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపినట్లయితే వారికి నిర్ధేశించిన పుల్ప్రైస్ను ఎస్పిడిసిఎల్ అందజేస్తుంది. ఆసక్తి గల వారు తమను సంప్రదిస్తే 50 శాతం సబ్సిడీతో పరికరాలను అందజేస్తాం. - జగదీశ్వర రెడ్డి, నెడ్‌క్యాప్, డీఎం, చిత్తూరు ప్రత్యామ్నాయంగా మరో పరికరం నెడ్‌క్యాప్ అందిస్తోన్న నెట్‌మీటరింగ్ కరెంటు ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఇది గ్రామీణులకు అంతగా ఉపయోగపడదు. అందుకే బహుళ ఉపయోగకారిణిగాఉండేందుకు బ్యాటరీల్లో సౌర విద్యుత్‌ను నిల్వ చేసి వినియోగదారులు వాడుకోవడంతో పాటు మిగు లు విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపేలా ఓ హైబ్రీడ్ నెట్‌మీటరింగ్ చేంజర్‌ను మేము రూపొందించాం. - పవన్, పవన్ ఎంపవర్మెంట్ సొల్యూషన్స్, మొరం