సాక్షి, న్యూఢిల్లీ: ఈఎస్‌ఐసీ వైద్య కళాశాల ఈసీఐఎల్ సహకారంతో కరో నా రోగుల కోసం స్వదేశీ పరిజ్ఞానంతో, తక్కువ ఖ ర్చులో, వైర్‌లెస్ ఫిజి యోలాజికల్ పారామితి పర్యవేక్షణ వ్యవస్థను రూపొందించింది. గాడ్జెట్‌కు కోవిడ్ బీప్ (నిరంతర ఆక్సిజనేషన్–వైటల్ ఇన్ఫర్మేషన్ డివైస్ బ యోమెడ్ ఈఎస్‌ఐసీ ఈసీఐఎల్) అని పేరు పె ట్టారు. కేంద్ర సిబ్బంది వ్యవహారాలు, ప్రజా స మస్యలు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్, హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం దీన్ని ఆవిష్కరించారు.
ఇందులో కిషన్‌రెడ్డి మాట్లాడు తూ ‘వోకల్ ఫర్ లోకల్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్థానిక పారిశ్రామికవేత్తలకు ఎగుమతి చేయడానికి, ప్రపంచ మార్కెట్ల అవసరాలను తీర్చడానికి అద్భుతమైన అవకాశాలు రానున్నాయి. ఈ అద్భుత ఆవిష్కరణను ప్రారంభించటం చాలా ఆనందంగా ఉంది. ఈ డివైజ్ ద్వారా కరోనా బాధితుల లొకేషన్‌తో పాటు వారి శరీర ఉష్ణోగ్రత, హృ దయ స్పందన, ఊపిరి వేగం, బ్లడ్ ఆక్సిజన్ సం తృప్తత, రక్తపోటు, ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ఈసీజీ)లను తెలుసుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా ఏ ప్రదేశం నుంచైనా వైద్యులు మొబైల్, కంప్యూటర్‌లో రోగుల పర్యవేక్షణను సులభతరం చేసి, సమయానుసారంగా చికిత్స చేయడానికి సహాయపడుతుంది. ’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment