సాక్షి, న్యూఢిల్లీ :లాక్‌డౌన్ పొడగింపు అంశాన్ని పరిశిలిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కరోనా కేసులు ఐదువేలు దాటడంతో ప్రధాని మోదీ మేధావులతో మాట్లాడుతున్నారన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడూతూ.. లాక్‌డౌన్ పొడగించాలని రాష్ట్రాలు, నిపుణులను నుంచి సూచనలు వస్తున్నాయని, దీనిపై ప్రధాని మోదీ మేధావులతో మాట్లాడుతున్నారని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారని చెప్పారు.
(చదవండి : కరోనాతో 14 నెలల చిన్నారి మృతి)
లాక్‌డౌన్ ద్వారానే కరోనాను కట్టడి చేయగలమని, ప్రజలంతా దీనికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. అనవసరమైన కారణాలతో రోడ్డుపై తిరగొద్దని సూచించారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే కేంద్ర లాక్‌డౌన్‌ను అమలు చేస్తోందన్నారు. దేశ వ్యాప్తంగా ఆహార కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.
కాగా, ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్‌డౌన్ పొడిగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రాన్ని కోరాయి. పలు రంగాల నిపుణులు కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలని కేంద్రానికి సూచిస్తున్నారు. దీంతో లాక్‌డౌన్ పొడగింపుపై కేంద్రం అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. అయితే లాక్‌డౌన్ పొడిగింపు వైపే కేంద్రం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం నాటికి దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 5351 చేరింది.160 మంది మృత్యువాత పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment