దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కరోనా ఉధృతి రోజు రోజుకి పెరిగిపోతున్న తరుణంలో దానిని అరికట్టడానికి కేరళ రాష్ట్రానికి చెందిన ఆల్ ఎబౌట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ "వోల్ఫ్ ఎయిర్ మాస్క్" పేరుతో గల ఒక పరికరాన్ని తయారుచేసినట్లు పేర్కొన్నారు. ఈ వోల్ఫ్ ఎయిర్ మాస్క్ చూడడానికి గోడకు తగిలించే ఒక పెద్ద సీసీ కెమెరాలాగా ఉంటుంది. ఇది గాలిలో చక్కర్లు కొడుతున్న కరోనా మహమ్మరిని చంపుతుందని కంపెనీ వారు పేర్కొంటున్నారు. ఇందులో అయాన్ టెక్నాలజీ ఉపయోగించినట్లు, అలాగే ఈ టెక్నాలజీ ఉపయోగించడం మన దేశంలోనే ఇదే మొదటిసారి అని వారు పేర్కొంటున్నారు.
ఈ పరికరాన్ని తిరువనంతపురంలోని రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ వారు టెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) మద్దతుతో నిర్వహించిన పరీక్ష ప్రకారం ఇది 99 శాతం కరోనా మహమ్మారిని కేవలం 15 నిమిషాల్లో చంపేయగలదు. ఇది దానంతట అదే స్టెరిలైజ్ చేసుకుంటుంది. ఈ పరికరం కంటిన్యూగా 60 వేల గంటలపాటు పని చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. ఇక ఈ పరికరాన్ని ఆస్పత్రిలో, ల్యాబ్లో, ఆఫీసులో థియేటర్లలో సెట్ చేసుకోవచ్చని అని కంపెనీ వారు పేర్కొంటున్నారు. వోల్ఫ్ ఎయిర్ కేవలం కరోనాని మాత్రమే కాకుండా ఇతర రోగాలకు కారణమయ్యే బ్యాక్టీరియాను కూడా చంపేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇలాంటి పరికరం సినిమా హాల్లో ఉంటే ఇక రోజంతా నాలుగు షోలు కూడా వేసుకోవచ్చని తెలిపారు. ఇక ఈ వస్తువు ధర విషయానికి వస్తే ఇండియామార్ట్ లో రూ.29,500గా నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment