సాక్షి, ఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. కోవిడ్ టెస్టులకు సిద్ధంగా ఉండాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
వివరాల ప్రకారం.. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్రాలు కోవిడ్ టెస్టులను సిద్ధంగా ఉండాలని సూచించింది. అలాగే, ఆర్టీపీసీఆర్ టెస్ట్ కిట్‌లను సిద్దంగా ఉంచాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. అలాగే, పాజిటివ్ శాంపిల్స్‌ను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని కోరింది. ఇక, జెన్-1 వేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అలర్ట్ జారీ చేసింది. అయితే, ఇప్పటికే కేరళలో కొత్త వేరియంట్ బయటపడింది. ఈ వేరియంట్ కారణంగా ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో నలుగురు కేరళవాసులే ఉన్నారు.
Centre issues advisory to States in view of a recent upsurge in COVID-19 cases and detection of first case of JN.1 variant in India. States urged to maintain a state of constant vigil over the COVID situation. States to report & monitor district-wise SARI and ILI cases on a… pic.twitter.com/NpS1wAQLM8
— ANI (@ANI) December 18, 2023
Comments
Please login to add a commentAdd a comment