సోలార్ ‘పవర్’ పెరిగింది
- నెడ్‌క్యాప్ ద్వారా నెట్ మీటరింగ్
- నెట్ మీటరింగ్‌తోనే ఇళ్లకు కరెంటు
- అందుబాటులోకి కొత్త డివైజ్
- నెట్ మీటరింగ్‌కు 50 శాతం ప్రభుత్వ సబ్సిడీ
పలమనేరు: ప్రస్తుతం విద్యుత్ కోతలు రాజ్యమేలుతున్నాయి. భవిష్యత్తులో నీరు, బొగ్గు తదితర సహజ వనరుల కొరత ఏర్పడితే ఈ కష్టాలు మరింత పెరగడం ఖాయం. భవిష్యత్తులో విద్యుత్ సంక్షోభాలు రావొచ్చు. వీటికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం కనిపిస్తున్న ఒకేఒక మార్గం సోలార్ విద్యుత్. సోలార్ విద్యుత్‌ను బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ సంప్రదాయేతర ఇంధన వనరుల సంస్థ (నెడ్‌క్యాప్-నాన్ కన్వర్షనల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్), భారతప్రభుత్వ సహకారంతో నెట్‌మీటరింగ్‌ను ఈ మధ్యనే ప్రవేశపెట్టింది. ఇళ్లు, వ్యాపార సముదాయా లు తదితరాల్లో చిన్న సోలార్ యూనిట్ల ద్వా రా తయారైన విద్యుత్‌ను తమ అవసరాలకు వాడుకుంటూ మిగిలిన విద్యుత్‌ను ప్రభుత్వ గ్రిడ్‌కు మళ్లించి అందుకు తగ్గ నగదును విని యోగదారులు పొందవచ్చు.
నెట్ మీటరింగ్ ఎలా పనిచేస్తుందంటే..
గృహాలు తదితరాలకు ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెల్స్ ద్వారా ప్రభుత్వ విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం చేస్తారు. అక్కడి నుంచి తిరిగి వినియోగదారులకు కరెంటు సరఫరా అవుతుంది. ఈ రకంగా సోలా ర్ ప్యానెల్ నుంచి ఎంత విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపారు, ఎంత వాడుకున్నారు తదితర వివరాలను నెట్ మీటరింగ్ లెక్క కడుతుంది. దీన్ని ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఓ కేవి కెపాసిటీ గల సిస్టమ్‌ను ఏర్పా టు చేయాలంటే వంద చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖాళీ స్థలముంటే సరిపోతుంది. భవనాల పైకప్పులు లేదా మేడలపై కూడా వీటిని అమర్చుకోవచ్చు. ఆరు నెలలకోసారి మిగులు విద్యుత్‌కు విద్యుత్ సంస్థలు నిర్ధారించిన రూ.2.70 యూనిట్‌కు వినియోగదారునికి చెల్లిస్తారు. ఈ మీటర్ ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ఏడేళ్ల వరకు ఈ చెల్లింపులు జరుగుతాయి. నెడ్‌క్యాప్ 50 శాతం సబ్సిడీతో ఈ పరికరాలను అందజేస్తోంది.
ప్రత్యామ్నాయంగా మరో పరికరం
నెట్‌మీటరింగ్ పట్టణవాసులకు ఉపయోగకరమే గానీ పల్లెలకు అంతగా ఉపయోగం ఉండదు. కరెంటు లేనప్పుడు ఈ పరికరం వృధానే. దీంతో పలమనేరుకు చెందిన గ్రామీ ణ యువశాస్త్రవేత్త పవన్ తన పవన్ ఎంపవర్‌మెంట్ సొల్యూషన్స్ ద్వారా ఓ కొత్త పరికరాన్ని కనుగొన్నాడు. దీని పేరే హైబ్రీడ్ నెట్‌మీటరింగ్ చేంజర్ దీని ద్వారా కరెంటు లేనప్పుడు సైతం బ్యాటరీల్లో కరెంటును నిల్వ చేసుకొని సొంత అవసరాల కోసం వాడుకోవచ్చు. ఆపై మిగులు విద్యుత్‌ను కరెంటు ఉన్నప్పుడు గ్రిడ్‌కు సరఫరా చేయొచ్చు. ఇదెంతో ఉపయోగకారిణిగా ఉంది.
ఇదో మంచి పథకం
సోలార్ రూట్ టాప్ ప్యానెల్స్ ఎవరైనా ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక కిలోవాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి రూ. 60వేలు ఖర్చవుతుంది. కేంద్ర నూతన పునరుద్ధరణీయ ఇంధన వనరుల మంత్రిత్వ శా ఖ (ఎంఎన్‌ఆర్‌ఈ) సహకారంతో నెడ్‌క్యాప్ 50 శాతం సబ్సిడీ ద్వారా దీన్ని అమలు చేస్తోంది. కరెంటు ఆదాతో పాటు డబ్బులొచ్చే మార్గమిది.
- రాజశేఖర్‌రెడ్డి, ట్రాన్స్‌కో ఏడీ, పలమనేరు
విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం
ప్రస్తుతం నెట్‌మీటరింగ్ గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ఇప్పటికే చిత్తూరు, తిరుపతి నగరాల్లో దీన్ని ప్రవేశపెట్టాం. సోలార్ విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపినట్లయితే వారికి నిర్ధేశించిన పుల్‌ప్రైస్‌ను ఎస్‌పిడిసిఎల్ అందజేస్తుంది. ఆసక్తి గల వారు తమను సంప్రదిస్తే 50 శాతం సబ్సిడీతో పరికరాలను అందజేస్తాం.
- జగదీశ్వర రెడ్డి, నెడ్‌క్యాప్, డీఎం, చిత్తూరు
ప్రత్యామ్నాయంగా మరో పరికరం
నెడ్‌క్యాప్ అందిస్తోన్న నెట్‌మీటరింగ్ కరెంటు ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఇది గ్రామీణులకు అంతగా ఉపయోగపడదు. అందుకే బహుళ ఉపయోగకారిణిగాఉండేందుకు బ్యాటరీల్లో సౌర విద్యుత్‌ను నిల్వ చేసి వినియోగదారులు వాడుకోవడంతో పాటు మిగు లు విద్యుత్‌ను గ్రిడ్‌కు పంపేలా ఓ హైబ్రీడ్ నెట్‌మీటరింగ్ చేంజర్‌ను మేము రూపొందించాం.
- పవన్, పవన్ ఎంపవర్‌మెంట్ సొల్యూషన్స్, మొరం