10వ తరగతి గ్రామీణ విద్యార్థులకు సోలార్ ల్యాంపులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే సుమారు 1.50 లక్షల మంది గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సోలార్ ల్యాంపులు ఇవ్వాలని విద్యాశాఖ బుధవారం నిర్ణయించింది. గ్రామాల్లో విద్యుత్ కోతల నేపథ్యంలో ఒక్కోటీ రూ.500 విలువైన ల్యాంపులను ఈ నెలాఖరులో విద్యార్థులకు అందించనుంది. వీటికి మొత్తంగా రూ. 7.5 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. కేంద్రం ఇచ్చే క్లీన్ ఎనర్జీ ఫండ్, నేషనల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ సంయుక్తాధ్వర్యంలో వీటిని అందించేందుకు ముందుకొచ్చాయని పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు, పక్కాగా బోధన చేపట్టేందుకు ఈనెల 19న ప్రధానోపాధ్యాయులతో పాఠశాల విద్యాశాఖ సమీక్ష నిర్వహించనుంది.