
పై ఫోటోలో కనిపిస్తోన్న బుక్‌ఫైల్‌ను తెరిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇది ఒక టూ ఇన్ వన్ టీవీ. టూ ఇన్ వన్ అంటే.. టీవీ ఫ్లస్ బుక్ అనుకునేరు. కాదు టీవీ ఫ్లస్ టేబుల్ ల్యాంప్. కెనాడాకు చెందిన జీన్ మైకెల్ రిచాట్ రూపొందించిన ఈ టీవీ.. ఫొల్డబుల్ ఓఎల్‌ఈడీ 24 ఇన్‌చెస్ డిస్‌ప్లే, ఇన్‌బిల్ట్ బ్లూటూత్ స్పీకర్‌తో ఉంటుంది. దీని పైన బుక్‌ఫైల్‌ను తలపించేలా లైట్ బ్లూ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేశారు. మీకు ఎప్పుడైనా టీవీ చూడాలనిపిస్తే ఈ బుక్‌ఫైల్‌ను తెరిస్తే చాలు. అలాగే లైట్ అవసరమైతే.. అప్పుడు ఈ బుక్‌ఫైల్‌ను మూయండి. బాగుంది కదూ. అయితే..ఈ టీవీ ధరను ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే ప్రకటించి మార్కెట్‌లో ప్రవేశ పెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment