
కోల్‌కతా: కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్షను కేవలం రూ.10లోనే, 95% కచ్చితత్వంతో చేయగలిగే కొత్త పరికరాన్ని ఐఐటీ–ఖరగ్‌పూర్‌కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ మేరకు మోటార్ ద్వారా నడిచే డిస్క్ ఆధారిత పోర్టబుల్ పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు ఐఐటీ–ఖరగ్‌పూర్ తెలిపింది. ఈ పరికరం బయో–డీగ్రేడబుల్ అని, కొన్ని పరీక్షల అనంతరం దీన్ని డిస్పోజ్ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ గ్రామీణ ప్రజలకు సేవలను అందించడంలో ఓ కొత్త మార్పు తీసుకువస్తుందని, త్వరలో రానున్న ఐఐటీ–ఖరగ్‌పూర్‌కు చెందిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇలాంటి మరెన్నో పరికరాలను వాడుతూ సమాజంలోని ప్రతీ ఒక్కరికి టెలీ మెడిసిన్, మొబైల్ హెల్త్‌కేర్ అందేలా దోహదపడుతుందని ఐఐటీ–ఖరగ్‌పూర్ డైరెక్టర్ వీకే తివారీ తెలిపారు.