IIT Kharagpur
-
అప్పుడు పరీక్షలో ఫెయిల్.. ఇప్పుడు గూగుల్‌లో జాబ్: జీతం తెలిస్తే..
జీవితంలో అనుకున్నది సాధించాలంటే.. అసాధారణమైన సంకల్పం, పట్టుదల అవసరం. అప్పుడే సక్సెస్ సాధించవచ్చు. దీనికి బీహార్‌కు చెందిన 'పుష్పేంద్ర కుమార్' ప్రయాణమే నిదర్శనం. ఇంతకీ ఇతనెవరు? ఏం సాధించారు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.బీహార్‌లోని జాముయి జిల్లా ఝఝా బ్లాక్‌లోని బుధిఖండ్ గ్రామానికి చెందిన హరిఓమ్ శరణ్ పెద్ద కుమారుడు పుష్పేంద్ర కుమార్.. ప్రపంచంలోని ప్రముఖ టెక్ కంపెనీలలో ఒకటైన గూగుల్‌లో అధిక వేతనంతో కూడిన ఉద్యోగం సంపాదించాడు.ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన పుష్పేంద్ర.. గూగుల్ కంపెనీలో చేయాలని కల కన్నాడు. ప్రస్తుతం ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుతున్న ఇతడు తన కోర్సు పూర్తి చేయడానికి ముందే గూగుల్‌లో డేటా సైంటిస్ట్‌గా ఎంపికయ్యాడు. కొడుకు కల నెరవేరినందుకు అతని కుటుంబ సభ్యులందరూ ఆనందంలో మునిగిపోయారు.స్నేహితుల స్ఫూర్తితో..పుష్పేంద్ర తన ప్రాథమిక విద్యను జార్ఖండ్‌లోని జసిదిహ్లో పూర్తి చేశాడు. 2018లో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తరువాత స్నేహితుల ప్రేరణతోనే ఐఐటీ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (IIT-JEE)కి హాజరయ్యాడు. మొదటి ప్రయత్నంలో ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. అయినా.. పట్టు వదలకుండా మళ్ళీ సన్నద్దమయ్యాడు. దీంతో రెండో ప్రయత్నంలో విజయం సాధించాడు.రూ.39 లక్షల ప్యాకేజీగూగుల్లో డేటా సైంటిస్ట్‌గా ఎంపికైన పుష్పేంద్ర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఉద్యోగానికి ఎంపికైన రోజు నా జీవితంలోనే అత్యంత సంతోషకరమైన రోజు అని పేర్కొన్నాడు. మొదట భారతదేశంలోని గూగుల్‌లో పని చేస్తానని, అక్కడ అతనికి రూ.39 లక్షల ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు పేర్కొన్నాడు. భవిష్యత్తులో కంపెనీ తనను విదేశాలకు పంపితే, తన ప్యాకేజీ భారత్‌లో పొందే దానికంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నాడు. -
అట్టడుగు నుంచి ఐఐటీ... దాతలు కరుణిస్తే మేటి
ఆత్మకూర్ (ఎస్): తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూసిన ఓ విద్యార్థి.. వారిని కష్టాల నుంచి గట్టెక్కించాలనుకున్నాడు. అందుకు ఉత్తమ మార్గం చదువుకోవడమే అని భావించి ఉన్నతంగా చదివాడు. ఫలితంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు సాధించాడు. అయితే చదువుకోవడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని తుమ్మలపెన్‌పహాడ్ గ్రామానికి చెందిన పిడమర్తి ప్రసాద్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయన కుమారుడు అనిల్‌కుమార్‌కు ఖరగ్‌పూర్ ఐఐటీ కాలేజీలో ఉచిత సీటు లభించింది. అయితే, అందులో చదువుకోడానికి ప్రతి సెమిస్టర్‌కు రూ.35 వేల చొప్పున ఏడాదికి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుంది. మొత్తం నాలుగేళ్ల కోర్సులో అంతమొత్తం ఖర్చులు భరించలేమని కాలేజీలో జాయిన్ కావడానికి ఇబ్బంది పడుతున్నాడు. కోవిడ్ కారణంగా ప్రస్తుతం ఆన్లైన్ క్లాస్‌లు జరుగుతున్నందున.. కనీసం ల్యాప్‌టాప్ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాడు. తండ్రి పారిశుద్ధ్య కార్మికుడిగా చాలీచాలని జీతంతో పనిచేస్తుండడంతో చదువు కొనసాగడానికి అనిల్ దాతల సహాయాన్ని కోరుతున్నాడు. దాతలు సహకరిస్తే తన కుమారుడిని ఉన్నత చదువులు చదివిస్తానని ప్రసాద్ అంటున్నాడు. 9014154250 నంబర్‌కు గూగుల్‌పే ద్వారా గానీ, 40537593456 అకౌంట్‌కు (ఎస్బీఐఎన్ 0008810) గానీ ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. -
పగిలిన డిస్ప్లే ఫోన్లకు ఐఐటీ పరిశోధకుల అద్భుత ఆవిష్కరణ
స్మార్ట్‌ఫోన్ మన నిత్యజీవితంలో ఒక భాగమైంది. వేలకువేలు డబ్బులు పోసి మీరు స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే, ఒక్కసారిగా మీ ఫోన్ అనుకోకుండా కింద పడి డిస్ప్లే పగిలిపోతే అంతే సంగతులు...! గుండె బద్దలైపోతుంది. ఎంతోకొంత డబ్బును వెచ్చించి తిరిగి ఫోన్‌కు కొత్త డిస్ప్లే వేయిస్తాం..! మనలో చాలా మంది ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొన్న వారిమే. ఫోన్ పొరపాటున ఎక్కడ కింద పడిపోతదేమో అనే భయంతో మన ఫోన్లను జాగ్రత్తగా చూసుకుంటాం. ఇకపై ఫోన్ కింద పడితే డిస్ప్లే పగిలిపోతుందన్న భయం వీడండి. ఎందుకంటే భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే పగిలితే స్క్రీన్ తనంతటతాను స్క్రీన్ మంచిగా కానుంది. ఈ అద్భుతమైన ఆవిష్కరణకు ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐఎస్ఈఆర్ కోల్కత్తా పరిశోధకులు పురుడుపోశారు. పగిలిన ఫోన్ల డిస్ప్లే దానంతటా అదే హీల్ అయ్యే టెక్నాలజీను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణకు సంబంధించిన విషయాలను ‘ సేల్ఫ్ హీలింగ్ క్రిస్టలిన్ మెటిరియల్’ జర్నల్ పేపర్లో పబ్లిష్ చేశారు. ఈ బృందం స్పటికకార స్థితిలో ప్రత్యేక సాలిడ్ మెటిరియల్‌ను తయారుచేశారు. ఈ పదార్థం ఫీజోఎలక్ట్రిక్ ధర్మాన్ని కలిగి ఉంది. మెకానికల్ ఎనర్జీను ఎలక్ట్రిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేయనుంది. ఈ పదార్థంలో ఏర్పడిన పగుళ్లలో ఉపరితలాల వద్ద వ్యతిరేక విద్యుత్ శక్తిని ప్రేరేపిస్తుంది. దీంతో ఈ పదార్థం తిరిగి సెల్ఫ్ హీల్ అవ్వడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఆవిష్కరణతో డిస్ప్లే క్రాక్‌లకు చెక్ పెట్టవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు. -
మీ సెల్ ఫోన్ పగిలినా దానంతట అదే అతుక్కుంటే?
కోల్‌కతా: మీ సెల్ ఫోన్ నేలపై పడి పగిలినా దానంతటదే తిరిగి అతుక్కుంటే? వినేందుకు జానపద సినిమాల్లో ఘటనలాగా అనిపిస్తోంది కదా! కానీ ఈ అద్భుతాన్ని నిజం చేసే దిశగా దేశీయ సైంటిస్టులు కీలకమైన ముందడుగు వేశారు. కనురెప్పపాటులో తనంతట తాను రిపేరు చేసుకునే మెటీరియల్‌ను ఐఐఎస్ఈఆర్ కోల్‌కతా, ఐఐటీ ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనితో స్వీయరిపేర్లు చేసుకునే ఎల్రక్టానిక్ గాడ్జెట్లు మనిషి చేతికి వస్తాయి. ఈ ప్రయోగ వివరాలను తాజాగా యూఎస్‌కు చెందిన సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. ఇప్పటికే కొన్నిరకాల సెల్ఫ్ హీలింగ్ మెటీరియల్స్ ఏరోస్పేస్, ఆటోమేషన్ రంగంలో అందుబాటులో ఉన్నాయి. అయితే తాజాగా తాము రూపొందించిన ఉత్పత్తి గతంలో వాటి కన్నా పదిరెట్లు గట్టిగా ఉందని సైంటిస్టులు చెప్పారు. అందుబాటులో ఉన్న మెటీరియల్స్‌కు తమంత తాము రిపేరయ్యేందుకు వెలుతురో, వేడో కావాల్సివస్తుండేది. తాజా మెటీరియల్ సొంతగా ఉత్పన్నమయ్యే ఎలక్ట్రిక్ చార్జితో రిపేరు చేసుకుంటుందని ఐఐటీ ప్రొఫెసర్ భాను భూషణ్ కతువా చెప్పారు. పరిశోధనలో తెలుగువాడు నూతన సెల్ఫ్ రిపేర్ మెటీరియల్ రూపకల్పనలో ఐఐఎస్ఈఆర్ కోల్‌కతా ప్రొఫెసర్ సి. మల్లారెడ్డి కీలకపాత్ర పోషించారు. సరికొత్త తరగతికి చెందిన ఘనపదార్ధాల ఉత్పత్తికిగాను, మల్లారెడ్డి, ఆయన బృందానికి 2015లో ప్రతిష్ఠాత్మక స్వర్ణజయంతి ఫెలోషిప్‌ను పొందారు. ఈయనతో పాటు మరో సైంటిస్టు నిర్మాల్యఘోష్ సైతం ఇదే సంస్థలో పనిచేస్తున్నారు. ఒత్తిడి ఎదురైనప్పుడు ఎలక్ట్రిక్ చార్జిలను సృష్టించే పదార్ధాలే పీజో ఎలక్ట్రిక్ పదారాలు. ఈ చార్జిని ఉపయోగించుకొని స్పటికాలు తిరిగి యథాతధ రూపాన్ని పొందుతాయి. జీవ కణాల్లో రిపేరింగ్ మెకానిజం ఆధారంగా కొత్త పదార్ధం పనిచేస్తుంది. దీన్ని మెబైల్ స్క్రీన్ల నుంచి ఎల్ఈడీ స్క్రీన్ల వరకు అన్ని రకాల ఎల్రక్టానిక్ వస్తువులకు వాడవచ్చని సైంటిస్టులు చెప్పారు. -
ఇంటెల్‌లో జాబ్ వదిలి.. 20 ఆవులతో మొదలై.. రూ. 44 కోట్ల సంపాదన
బెంగళూరు: మన పెద్దలు ఓ మాట చెప్తుంటారు. బుర్ర చెప్పింది వింటే బాగుంటాం.. మనసు చెప్పింది వింటే సంతోషంగా, సంతృప్తిగా బతుకుతామని. ఈ మాటని నిజం చేసి చూపాడు ఓ వ్యక్తి. ఐఐటీలో చదివి.. ప్రతిష్టాత్మక ఇంటెల్ కంపెనీలో కొలువు చేస్తున్న ఓ ఇంజనీర్ దాన్ని వదిలేసుకుని.. తనకు ఎంతో ఇష్టమైన పని చేయడం మొదలు పెట్టాడు. ప్రస్తుతం అతడు సంతృప్తిగా బతకడమే కాక మరో 100 మందికి పైగా ఉపాధి చూపుతున్నాడు. ఇంతకు అతడు ఏం చేస్తున్నాడంటే.. ఉద్యోగం వదిలి 20 ఆవులతో పాల వ్యాపారం ప్రారంభించి, ఇప్పుడు ఏకంగా ఏడాదికి 44 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించే స్థాయికి చేరుకున్నాడు. అతడి విజయ గాథ వివరాలు.. కర్ణాటకకు చెందిన కిశోర్ ఇందుకూరి అనే వ్యక్తి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో మాస్టర్స్, పీహెచ్డీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇంటెల్ కంపెనీలో ఆరేళ్లు పని చేశాడు. ఉద్యోగంలో ఎన్నో విజయాలు సాధించినప్పటికి అతడికి సంతృప్తి లేదు. దాంతో ఇండియాకు తిరిగి వచ్చాడు. అప్పుడే అతడి జీవితం అనూహ్య మలుపు తిరిగింది. ఓ సారి పని నిమిత్తం కిశోర్ హైదరాబాద్ వచ్చాడు. ఆ సమయంలో అతడు నగరవాసులు స్వచ్ఛమైన పాలు దొరక్క ఇబ్బంది పడుతున్నారని గ్రహించాడు. ఆ సమయంలో కిశోర్‌కి వచ్చిన ఓ ఆలోచన అతడి జీవితాన్ని అనూహ్య మలుపు తిప్పింది. దానిలో భాగంగా కిశోర్ జాబ్ వదిలేసి 20 ఆవులు కొని సొంత డెయిరీ ప్రారంభించాడు. కుటుంబ సభ్యులతో కలిసి స్వచ్ఛమైన పాలను వినియోగదారుల గుమ్మం వద్దకే తీసుకెళ్లసాగాడు. ఇక పాలు ఎక్కువ సమయం నిల్వ ఉండేలా చల్లబర్చి, నిల్వ చేసే విధానాన్ని ఉపయోగించాడు కిశోర్. అంచెలంచెలుగా ఎదుగుతూ, 2018 నాటికి డెయిరీ విస్తరించింది. దానికి తన కుమారుడు సిద్దార్థ్ పేరు మీద “సిద్ ఫార్మ్” అని పేరు పెట్టాడు కిశోర్. ప్రస్తుతం అతడు 6 వేల మందికి పాలు పోస్తున్నాడు. ఇక షాబాద్‌లో విస్తరించిన ఇతడి ఫామ్‌లో ప్రస్తుతం 120 మంది పని చేస్తున్నారు. ఇక కిశోర్ కేవలం పాలు మాత్రమే కాక సేంద్రీయ పాల ఉత్పత్తులైన పెరుగు, నెయ్యిని విక్రయిస్తాడు. సిద్ ఫామ్ ఇప్పుడు రోజుకు దాదాపు 10,000 మంది వినియోగదారులకు తన ఉత్పత్తులను అందిస్తుంది. ఇక ఈ డెయిరీ మీద అతడు సంవత్సరానికి 44 కోట్లు ఆర్జిస్తున్నాడు. చదవండి: 67 ఏళ్ళ వయసులో ‘గేట్’ సాధించాడు! -
వైరల్ వీడియో: ఐఐటీ విద్యార్థులపై ప్రొఫెసర్ చిందులు
-
ఐఐటీ విద్యార్థులపై ప్రొఫెసర్ చిందులు, వైరల్ వీడియో
ఖరగ్‌పూర్: కరోనా సంక్షోభ సమయంలో ఆన్లైన్ క్లాసులు, జూమ్ మీటింగ్‌లో తప్పనిసరిగా మారిపోయాయి. ఈ క్రమంలో విద్యార్థుల కష్టాలు అన్నీ కావు. తాజాగా ఒక ఐఐటీ ప్రొఫెసర్ విద్యార్థులపై విరుచుకు పడింది. ఐఐటీ ఖరగ్‌పూర్ అసోసియేట్ ప్రొఫెసర్ సీమా సింగ్ ఆన్లైన్క్లాస్లో విద్యార్ధులతోపాటు, వారి తల్లిదండ్రులపైనా అనుచిత వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆన్క్లాస్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఇంగ్లీష్ క్లాస్ చెప్తూ విద్యార్థులపై దురుసుగా ప్రవర్తించింది. విద్యార్థులనే కాకుండా వారి తల్లిదండ్రులపై కూడా దూషణలకు దిగింది. ‘మీరు నా పై కంప్లయిట్ ఎక్కడ ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి. వీలైతే సెంట్రల్ మినిష్టర్స్‌కు కూడా కంప్లయిట్ ఇచ్చుకోండి’ అంటూ ఆమె విద్యార్ధులపై చిందులు వేసింది. అంతేకాదు పరీక్షలో ఫెయిల్ చేస్తానని విద్యార్థులను బెదిరించిన వైనంప పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరొక వీడియోలో విద్యార్థి తాతా చనిపోయినందుకు పరీక్ష నుంచి మినహాయింపు కోరగా, ప్రొఫెసర్ ఆ విద్యార్థిని దూషించింది. ‘నేను కూడా హిందువునే నాకు మన సంప్రదాయాలు, కట్టుబాట్లు నాకు తెలుసు. కోవిడ్ సమయంలో ఇలాంటివి ఎక్కువగా ఎవరూ చేయడం లేదంటూ’ ప్రొఫెసర్ సీమాసింగ్ విద్యార్థిపై మండిపడింది. మరో వీడియోలో క్లాస్‌లో ఉన్న కొంతమంది విద్యార్థులు భారత్ మాతా కీ జై అనగా, వారిపై ‘మీరు దేశానికి ఇది తప్ప ఇంకొటి చేయాలేరా’అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా విద్యార్థుల మార్కులు నా చేతిలో ఉన్నాయంటూ వారిని బెదిరించింది. కాగా ఈ తతంగాన్ని ఐఐటీ విద్యార్థులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకివచ్చింది. కాగా ప్రొఫెసర్‌పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని, వెంటనే ఆమెను ఉద్యోగం నుంచి తీసివేయాలని విద్యార్ధులు డిమాండ్ చేశారు. చదవండి: మే 2 తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిషేదం: ఈసీ -
67 ఏళ్ళ వయసులో ‘గేట్’ సాధించాడు!
చెన్నై: ఉద్యోగవిరమణ చేసిన వారు, వయసుపైబడిన వృద్ధులు కృష్ణా..రామా అనుకుంటూ ప్రశాంత జీవనాన్ని గడిపేందుకు మొగ్గుచూపుతారు. కానీ ఈ మధ్యకాలంలో కొందరు... వయసులో ఉన్నప్పుడు చేయలేనివి, కుటుంబ బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిడితో తాము కోల్పోయిన వాటిని సెకండ్ ఇన్నింగ్స్‌లో మొదలు పెట్టి తమ కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళనాడుకు చెందిన ఓ తాతయ్య గేట్ పరీక్ష రాసి ఔరా అనిపించాడు. సాధారణంగా ఇరవై ఏళ్లు లేదా ముఫై ఏళ్లలోపు విద్యార్థులు గేట్ పరీక్షను క్లియర్ చేసేందుకు ఎంతో కష్టపడుతుంటారు. అటువంటిది మనవళ్లు ఉన్న 67 ఏళ్ల శంకరపాండియన్ ఈ ఏడాది గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)–21లో ఉత్తీర్ణత సాధించి సంచలనం సృష్టించారు.తమిళనాడుకు చెందిన పాండియన్ హిందూ కాలేజీలో మ్యాథమేటిక్స్ టీచర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ తరువాత తన చిరకాల కోరికైన గేట్ పరీక్ష కోసం సన్నద్దమయ్యి విజయం సాధించారు. ఈ ఏడాది గేట్లో ఉత్తీర్ణత సాధించిన వారిలో పాండియన్ అతిపెద్ద వయస్కుడు. ఎక్కువమంది విద్యార్థులు తమ స్పెషలైజేషన్ సబ్జెక్టు ఆధారంగా ఒక్క పేపర్‌ను ఎంచుకుంటారు. పాండియన్ రెండు పేపర్లు తీసుకుని మంచి మార్కులు సాధించారు. మ్యాథమేటిక్స్‌లో 338 మార్కులు, కంప్యూటర్ సైన్స్‌లో 482 మార్కులు సాధించి గేట్ పరీక్ష పాసయ్యాడు. రెండు పేపర్లను ఒకేరోజు రెండు షిప్టుల్లో రాసి ఉత్తీర్ణత సాధించడం విశేషం. వర్చువల్ రియాల్టీలో పరిశోధనలు చేయడం కోసమే గేట్ పరీక్ష రాశానని పాండియన్ చెప్పారు. అగ్మెంటెడ్ రియాల్టీ(ఏఆర్)లో పరిశోధనలు చేస్తానని, ముఖ్యంగా ‘స్పెసిఫిక్ ప్రాబ్లం అకల్షన్’పై దష్టి కేంద్రీకరిస్తానని ఆయన చెప్పారు. కాగా రియల్ వరల్డ్ ఆబెకట్ట్స్కు హోలోగ్రామ్స్ తయారు చేయడంలో ఈ టెక్నాలజీ తోడ్పడుతుంది.పాండియన్ మాట్లాడుతూ.. ‘‘ఈ ఏడాది గేట్ పరీక్షలో ఫెయిల్ అయినా మరోసారి కచ్చితంగా గేట్ పరీక్ష రాసేవాడిని. ఫెయిల్ అవుతానన్న భయం నాకులేదు. ఇది చాలా పోటీతోకూడుకున్న పరీక్ష. గేట్పరీక్షకు హాజరయ్యేవారిలో కేవలం 17 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తారు. నేను డిగ్రీ కోసమో, మంచి ప్యాకేజీ ఇచ్చే జాబ్ కోసమో ఈ పరీక్ష రాయలేదు. అగ్మెంటెడ్ రియాల్టీలో కొత్త విషయాలను తెలుసుకునేందుకు పరిశోధనలు చేసి నా జ్ఞానాన్ని మరింత పెంచుకోవాలనుకున్నాను. అందుకే ఎటువంటి టెన్షన్ పడకుండా 30 రోజుల్లో కాన్సెప్ట్స్ నేర్చుకుని... చాలా ఆనందంగా ఈ పరీక్ష ను రాశాను. 35 ఏళ్ల క్రితం ఒకసారి 1987 లో గేట్ పరీక్ష రాసాను. అప్పుడు ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు వచ్చింది. అప్పటి గేట్ పేపర్‌కు ఇప్పటి పేపర్‌కు చాలా తేడా ఉంది. అప్పట్లో పరీక్ష రాస్తే ఫలితాలు రావడానికి నెలలు పట్టేది. ఇప్పుడు ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం వల్ల త్వరగానే ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటి పరీక్షల వ్యవస్థ సౌకర్యంగానే గాక వేగంగా కూడా ఉంది’’ అని ఆయన చెప్పారు. ‘‘పరీక్ష రాయడానికి హాలులోకి వెళ్లినప్పుడు పేరెంట్స్ వెయిటింగ్ హాల్ అటువైపు ఉంది వెళ్లండని సిబ్బంది చెప్పారు. నన్ను చూసినవారంతా పరీక్ష రాయడానికి వచ్చానని అనుకోలేదు’’ అని పాండియన్ నవ్వుతూ చెప్పారు. -
దేశంలో విషతుల్యంగా భూగర్భ జలాలు
న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం భూభాగంలోని 20 శాతం భూగర్భజలాలు ప్రమాదకర స్థాయిలో ఆర్సెనిక్ కలిగి ఉండి, విషతుల్యంగా మారాయని, నీటిలోని ఈ విషతుల్యమైన పదార్థం దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపిస్తుందని ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సర్వే లో వెల్లడయ్యింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఆర్సెనిక్ నమూనాలు ప్రస్తుత సర్వేలో తెలిసిన దానికంటే ఇంకా ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు గతంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు జరిపిన అధ్యయనాలు సైతం వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఆర్సెనిక్ స్థాయిని అంచనా వేసేందుకు మరింత విస్తృతమైన పరిశోధనల అవసరాన్ని సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన నొక్కి చెపుతోంది. రక్షిత నీటినే తాగుతున్నామా? దేశవ్యాప్తంగా ప్రజలు తాగుతోన్న నీటిలో అత్యధికంగా 80 శాతం భూగర్భ జలాలే. అత్యధిక జనాభా తాగునీటి కోసం ఆధారపడిన భూగర్భ జలాలు సురక్షితమైనవేనా? అనే విషయంలో అనేక అధ్యయనాలు గతం నుంచి జరుగుతున్నాయి. దేశంలోని 20 శాతం భూభాగంలోని భూగర్భ జలాలు అత్యంత విషపూరితమైన ఆర్సెనిక్తో నిండి వున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఆర్సెనిక్ అత్యంత విషపూరితమైనది. తాగు నీరు, ఆహారం ద్వారా ఆర్సెనిక్‌ని తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులకు గురికావడం, లేదా తీవ్రమైన చర్మసంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతాయి. నదీపరివాహక ప్రాంతాల్లో ఎక్కువ.. గంగా–సింధు, బ్రహ్మపుత్రా నదీ పరివాహక ప్రాంతాల్లోనూ, భారతదేశంలోని కొన్ని ద్వీపకల్ప ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ఈ అత్యంత విషతుల్యమైన ఆర్సెనిక్ అత్యధిక స్థాయిలో ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ‘‘దేశంలోని 250 మిలియన్ల మంది ప్రజలు భూగర్భ జలాల్లో నిక్షిప్తమైన ఉన్న విషతుల్య పదార్థం ఆర్సెనిక్ ప్రభావానికి గురవుతున్నట్టు అంచనా వేశాం’’అని పశ్చిమబెంగాల్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్‌లోని అసోసియేట్ ప్రొఫెసర్ అభిజిత్ ముఖర్జీ చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పద్ధతిలో.. అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పద్ధతిని ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారు. జియోలాజికల్, హైడ్రోజియోలాజిక్, ఆంతోపోజెనిక్ ప్రమాణాలను బట్టి లీటరు భూగర్భజలంలో పది మైక్రోగ్రాముల ఆర్సెనిక్ ఉండొచ్చు. అయితే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆ స్థాయిని మించి భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చింది. భూగర్భజలాల్లో తీవ్రస్థాయిలో ఉన్న ఆర్సెనిక్ పరిణామాన్ని అంచనా వేయడానికి తీసుకున్న శాంపిల్స్ ఇంకా సరైన స్థాయిలో లేవని సహ రచయిత సౌమ్యాజిత్ సర్కార్, మధుమిత చక్రవర్తి సహా అధ్యయనవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత అధ్యయనం ఆర్సెనిక్ తీవ్రతని చాలా తక్కువగానే అంచనా వేసినట్టు వారు అభిప్రాయపడుతున్నారు. సురక్షిత తాగునీరే లక్ష్యం.. ఈ అధ్యయనంలో రాండమ్ ఫారెస్ట్ అనే అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించామని, ఇది భూగర్భ జలాల్లోని ఆర్సెనిక్ ని అంచనావేయడంలో సమర్థంగా పనిచేస్తుందని గత పరిశోధనల్లో వెల్లడయ్యింది అని ముఖర్జీ తెలిపారు. ప్రభుత్వ జల్‌జీవన్ మిషన్‌లోని, 27 లక్షల క్షేత్రస్థాయి ప్రమాణాల ఆధారంగా ఆర్సెనిక్‌ని అంచనావేశారని, ఈ అధ్యయనం ఫలితాలు సురక్షిత మంచినీటిని ఇంటింటికీ అందిచేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఆర్సెనిక్ ప్రభావం భారత్‌పై అధికం ఆర్సెనిక్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో భారతదేశం ఒకటని అధ్యయనవేత్తలు తేల్చి చెప్పారు. పశ్చిమబెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని భూగర్భ జలాల్లో విష తుల్యమైన ఆర్సెనిక్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. భారత దేశంలో 80 శాతం తాగునీరు భూగర్భజలాలపై ఆధారపడినదే. దేశంలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ తాగునీటి కోసం భూగర్భ జలాలపై ఆధారపడి జీవిస్తోన్న 9 కోట్ల మంది ప్రజల ప్రాణాలు ఆర్సెనిక్ వల్ల ప్రమాదంలో పడినట్టు గతంలో జరిపిన అధ్యయనాల్లో వెల్లడయ్యింది. దేశవ్యాప్తంగా భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు అనేక అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాల్లో ఎక్కువ భాగం స్థానికంగా, క్షేత్రస్థాయి లో జరిగినవే. ఇందులో అత్యధికంగా గంగా పరీవాహక ప్రాంతాల్లో జరిగాయి. అయితే ఇవేవీ దేశంలోని ఇతర ప్రాంతాలకు వర్తించవు. -
ఇక రూ.400 లకే కరోనా పరీక్షలు!
న్యూఢిల్లీ: అతి తక్కువ ఖర్చుతో మహమ్మారి కరోనా వైరస్‌ను నిర్ధారించే పరికరాన్ని తయారు చేశామని ఐఐటీ ఖరగ్‌పూర్ శనివారం వెల్లడించింది. తమ శాస్త్రవేత్తలు తయారు చేసిన పోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరికరంతో ఒక్కో టెస్టు చేయడానికి కేవలం రూ.400 మాత్రమే ఖర్చవుతుందని, గంటలో ఫలితం తేలిపోతుందని పేర్కొంది. భారీ ఖర్చుతో కూడుకున్న ఆర్టీ-పీసీఆర్ పరీక్షలకు ఇది ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని పరికరం తయారు చేసిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లోని కచ్చితత్వం పోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరికరంలో ఉందని తెలిపింది. రూ.2000 ధర కలిగిన తమ పోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరికరంతో ప్రపంచవ్యాప్తంగా పేద ప్రజలు వైరస్ ఉనికి తెలుసుకుని జాగ్రత్త పడొచ్చునని తెలిపారు. ఈ పోర్టబుల్ పరికరంతో ఎంతోమందికి పరీక్షలు చేయొచ్చునని, ప్రతి టెస్టు తర్వాత ఒక పేపర్ కాట్రిడ్జ్ మారిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని పరీక్ష విధానాల ధరల కంటే ఇదే అతి తక్కువ అని శాస్త్రవేత్తలు తెలిపారు. పోర్టబుల్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ పరికరం తయారీ, వ్యాపార పరమైన అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ ధర నిర్ణయించామని తెలిపారు. (చదవండి: కరోనా రోగులపై చార్జీల బాదుడు : షాక్) కరోనా నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన ఇదొక గొప్ప ప్రగతి అని పరికరం తయారీలో కృషి చేసిన ఐఐటీ ఖరగ్‌పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ సుమన్ చక్రవర్తి, స్కూల్ ఆఫ్ బయో సైన్స్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ అరిందమ్ మోండల్ తెలిపారు. ఈ పరికరం స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ సాయంతో జన్యు విశ్లేషణ చేసి ఫలితాలు వెల్లడిస్తుంని తెలిపారు. తమ పరికరానికి సంబంధించిన లేబొరేటరీ నియంత్రణ సంస్థ నుంచి అనుమతులు వచ్చాయని తెలిపారు. (బాబ్రీ మసీదు కూల్చివేత.. తీర్పు ఎలా ఉన్నా పర్లేదు) -
ఇక రూ. 10కే సీబీసీ పరీక్ష
కోల్‌కతా: కంప్లీట్ బ్లడ్ కౌంట్ పరీక్షను కేవలం రూ.10లోనే, 95% కచ్చితత్వంతో చేయగలిగే కొత్త పరికరాన్ని ఐఐటీ–ఖరగ్‌పూర్‌కు చెందిన పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఈ మేరకు మోటార్ ద్వారా నడిచే డిస్క్ ఆధారిత పోర్టబుల్ పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు ఐఐటీ–ఖరగ్‌పూర్ తెలిపింది. ఈ పరికరం బయో–డీగ్రేడబుల్ అని, కొన్ని పరీక్షల అనంతరం దీన్ని డిస్పోజ్ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ ఆవిష్కరణ గ్రామీణ ప్రజలకు సేవలను అందించడంలో ఓ కొత్త మార్పు తీసుకువస్తుందని, త్వరలో రానున్న ఐఐటీ–ఖరగ్‌పూర్‌కు చెందిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఇలాంటి మరెన్నో పరికరాలను వాడుతూ సమాజంలోని ప్రతీ ఒక్కరికి టెలీ మెడిసిన్, మొబైల్ హెల్త్‌కేర్ అందేలా దోహదపడుతుందని ఐఐటీ–ఖరగ్‌పూర్ డైరెక్టర్ వీకే తివారీ తెలిపారు. -
దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, నల్లగొండ: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో నిర్వహించనున్న క్షితిజ్ వార్షిక టెక్నో మేనేజ్మెంట్ ఫెస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న తెలంగాణ ప్రాంత విద్యార్థులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2020 జనవరి 17 నుంచి జరిగే ఈ ఫెస్ట్‌కు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో చదివే విద్యార్థులు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొనాల్సి ఉందన్నారు. సాంకేతిక రంగంలో ప్రముఖ దిగ్గజ కంపెనీలైన ఐబీఎం, మైక్రోసాఫ్ట్, గూగుల్ డెవలపర్స్ ఫర్గో, సెబీ లాంటి సంస్థలు వర్క్‌షాప్‌లో పాల్గొంటాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 70వేల మంది విద్యార్థులు పాల్గొంటారని, ఉత్తమ ప్రతిభ చూపిన సాంకేతిక అంశాలను ప్రదర్శించిన వారికి రూ. 50లక్షల బహుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఫెస్ట్ రిజిస్ట్రేషన్ కోసం www.ktj.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. -
250 కోట్ల ఏళ్ల క్రితమే భారత్‌లో జీవం!
దేశంలో సుమారు 250 కోట్ల ఏళ్ల క్రితమే సూక్ష్మ జీవజాలం (బ్యాక్టీరియా) ఉన్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ బ్యాక్టీరియాను దక్కన్ పీఠభూమిలోని రాతిపొరల్లో భూమికి దాదాపు 3 కిలోమీటర్ల లోతులో వారు కనుగొన్నారు. ఇది గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్ కాలానికి చెందినది అని శాస్త్రవేత్తలు అంటున్నారు. నాలుగేళ్ల క్రితం మహారాష్ట్రలోని కొయినా ప్రాంతంలో ఐఐటీ బయోటెక్నాలజిస్టులు, భూగర్భ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేపట్టారు. 1964 ప్రాంతంలో కరార్ అనే గ్రామం భూకంపం వచ్చి నాశనమైపోయింది. దీనికి కారణాలు ఏంటని భూగర్భశాస్త్రవేత్తలు పరిశోధన ప్రారంభించారు. అతిపురాతనమైన జీవం ఆనవాళ్ల కోసం అక్కడే వెతకడం మొదలుపెట్టారు. నీళ్లు, ఖనిజ లవణాలు ఏవీ లేని ప్రాంతంలో 3 బోరింగ్ యంత్రాలతో రంధ్రాలు చేసి రాతిమట్టిని వెలికితీశారు. ఇలా తీసిన మట్టిలో 5 రకాల సూక్ష్మజీవులు ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లో కొన్ని బ్యాక్టీరియాలు హైడ్రోజన్, కార్బన్ డయాక్సైడ్లను ఇంధనంగా వాడుకుని బతికేశాయని.. ఇప్పుడు అవి జీవంతో ఉన్నాయా? లేదా? అన్నది చెప్పలేమని శాస్త్రవేత్త అవిశేక్ దత్తా తెలిపారు. అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లోనూ జీవనం కొనసాగించడమెలా అన్న విషయంలో ఈ బ్యాక్టీరియా నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. ఈ పరిశోధన వివరాలు ‘సైంటిఫిక్ రిపోర్ట్స్, నేచర్’లో ప్రచురితమవడంతో మొత్తం వ్యవహారం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దీనిపై కేంద్ర ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. ఈ అంశంపై విస్తృత పరిశోధనలు చేయాల్సిందిగా ఐఐటీ శాస్త్రవేత్తలను కోరింది. ఏంటీ ఆక్సిడేషన్ ఈవెంట్..: ‘భూమి పుట్టి 450 కోట్ల ఏళ్లు అవుతోందని అంచనా. విశాల విశ్వం నుంచి దూసుకొచ్చిన అనేక ఉల్కా శకలాలు అప్పట్లో భూమిని ఎడాపెడా ఢీకొడుతుండేవి. కొన్ని కోట్ల ఏళ్ల వరకూ ఈ పరిస్థితి ఇలానే కొనసాగింది. అప్పట్లో భూమ్మీద పెద్దగా జీవజాతులేవీ లేవు. భూమి లోపలి పొరలు అస్థిరంగా ఉండటంతో భూకంపాలు తరచూ వచ్చేవి. అగ్నిపర్వతాలు లావా ఎగజిమ్ముతుండేవి. అయితే 250 నుంచి 6.5 కోట్ల ఏళ్ల మధ్యకాలంలో భూమి లోపలి పొర అప్పుడప్పుడూ చల్లబడుతూ.. లావా చేరినప్పుడు మళ్లీ వేడెక్కేది. వేడి.. చల్లదనం మధ్యలోనే భూమ్మీద తొలి జీవం ఏర్పడిందని అంచనా. ఆ క్రమంలో భూమి వాతావరణంలోకి ఆక్సిజన్ వాయువు ప్రవేశించింది. ఆక్సిజన్ ప్రవేశించిన కాలాన్నే ‘గ్రేట్ ఆక్సిడేషన్ ఈవెంట్’అని అంటారని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త పినాకీ సార్ తెలిపారు. -
ఓజోన్ గాయం మానుతోంది
కోల్‌కతా: ఓజోన్‌పొర గాయం మానుతోంది. ఓవైపు వాతావరణ మార్పులతో కలుగుతున్న దుష్ప్రవాలపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుండగా.. తాజా పరిశోధనలో సంతోషం కలిగించే ఫలితాలు వెల్లడయ్యాయి. దక్షిణ ధ్రువంలో ఓజోన్‌కు పడిన రంధ్రం నెమ్మదిగా పూడుతున్నట్లు శుక్రవారం భారత పరిశోధకులు ప్రకటించారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన సెంటర్ ఆఫ్ ఓషియన్, రివర్స్, అట్మాస్పియర్ అండ్ లా సైన్స్ (కొరల్) పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. తొలుత వారు 1979 నుంచి 2017 మధ్య దక్షిణ ధ్రువంలోని ఓజోన్‌కు సంబంధించిన డేటాను తీసుకుని అధ్యయనం చేశారు. ఓజోన్ రంధ్రం 2001 నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోందని తేల్చి చెప్పారు. కొన్నేళ్లుగా రిడెక్షన్ ఆఫ్ ఓజోన్ లాస్ సాచురేషన్ 20 నుంచి 60కి చేరినట్లు వివరించారు. ‘4 దశాబ్దాలుగా ఓజోన్‌లో వచ్చిన మార్పులను అధ్యయనం చేశాం. ఇందుకు అంటార్కిటికాలోని భారత్‌కు చెందిన మైత్రి స్టేషన్‌తో పాటు, వివిధ దేశాలకు చెందిన స్టేషన్ల నుంచి డేటా సేకరించి విశ్లేషించగా..1998, 2002ల్లో మినహాయించి, ప్రతి ఏడాది శీతలకాలంలో ఓజోన్‌కు అధికంగా తూట్లు పడుతున్నట్లు తేలింది. కాగా, 2001–17 మధ్య ఓజోన్ రంధ్రం కొంతమేరకు పూడుతూ వస్తున్నట్లు స్పష్టంగా తెలిసింది’అని శాస్త్రవేత్త ప్రొఫెసర్ జయనారాయణ కుట్టిప్పురత్ పేర్కొన్నారు. ఈ ఫలితాలు ఓజోన్‌కు రంధ్రాన్ని చేసే ఉత్పత్తులను నిషేధించే మాంట్రియల్ ప్రొటోకాల్‌పై ప్రభావం చూపుతాయా? అని పరిశోధకుడు ప్రొఫెసర్ పీసీ పాండేను ప్రశ్నించగా.. ఓజోన్ మునుపటిలా సహజస్థితికి రావడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. కాబట్టి ఓజోన్ ఒప్పందాలు రద్దు చేయడం క్షేమం కాదని హెచ్చరించారు. -
ఒత్తిడిని చిత్తు చేసే యాప్
సాక్షి, కోల్‌కతా : నిత్యం జీవితంలో ఒత్తిడి అన్ని వయసుల వారినీ వేధిస్తోంది. ఆధునిక జీవితంలో ప్రధాన సవాల్‌గా పరిణమించిన ఒత్తిడిని అధిగమించేందుకు ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన నిపుణుల బృందం ఓ మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసింది. ఈ యాప్‌ను యూజర్లు తమ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని విశ్లేషించడం, దాన్ని సమర్ధంగా ఎదుర్కొనేలా నిపుణులు డిజైన్ చేశారు. ధ్యాన్యాండ్రాయిడ్ పేరిట ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు. జూన్ 10న ఈ యాప్‌ను ప్రారంభించనున్నారు. రెండు వెర్షన్లలో లభ్యమయ్యే ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాప్ స్టోర్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూజర్ భావోద్వేగాలను సమస్థితిలో ఉంచుతూ కుంగుబాటును నియంత్రంచేలా ఈ యాప్ పనిచేస్తుంది. యూజర్ల ఒత్తిడి స్థాయిలను అంచనా వేస్తూ ధ్యానం ద్వారా వారికి స్వాంతన చేకూర్చేలా డిజైన్ చేశారు. పలు ప్రశ్నల ద్వారా యూజర్ల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో ఈ యాప్ పరిశీలిస్తుంది. రియల్ టైమ్‌లో యూజర్లు ఎంత ఒత్తిడికి గురువుతున్నారన్నది ఈ యాప్ పసిగట్టి అప్రమత్తం చేస్తుంది. ఇక మెడిటేషన్ పరంగా సులభమైన శ్వాస, యోగ ఎక్సర్‌సైజ్‌లను యాప్ సూచిస్తుంది. థర్మల్ ఇమేజింగ్, సంగీతం, వైబ్రేషన్ల ద్వారా థ్యాన మందిరంలో ఉన్నామన్న భావనను యూజర్లకు కల్పిస్తూ వారిని ఒత్తిడి రహిత స్థితికి చేర్చడంలో తోడ్పడుతుంది. -
900 ఏళ్ల నాడు అలా జరిగినందువల్లే..
ఖరగ్‌పూర్ : ప్రపంచంలోనే గొప్ప నాగరికతగా భాసిల్లిన సింధునాగరికత అంతరించడానికి గల కారణాన్ని ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 900 ఏళ్లపాటు కొనసాగిన కరువు కారణంగానే 4,350 ఏళ్లక్రితం సింధు నాగరికత తుడిచిపెట్టుకు పోయిందని తెలిపారు. రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల కరువు వచ్చిందని.. కొన్నేళ్ల తర్వాత తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు అక్కడి నుంచి మైదానాలకు వలస వెళ్లారని భౌగోళిక శాస్త్ర ప్రొఫెసర్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. వీరంతా గంగా యమునా లోయ గుండా ప్రయాణిస్తూ ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు బెంగాల్, దక్షిణ వింధ్యాచల్, దక్షిణ గుజరాత్‌కు చేరుకున్నారన్నారు. ఇందుకు గల ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. జియోలజీ, జియోఫిజిక్స్ డిపార్ట్మెంట్కు చెందిన పరిశోధకులు.. రుతుపవనాలు సకాలంలో రాకపోవడం వల్ల 5 వేల ఏళ్ల క్రితం వాయువ్య హియాలయాల్లో వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దీని వల్ల నదులు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని క్రమంగా అది కరువుకు దారితీసిందని తెలిపారు. ఈ పరిస్థితి 9 వందల ఏళ్ల పాటు కొనసాగడం వల్ల అప్పటివరకు సిరిసంపదలతో వర్థిల్లిన సింధు నాగరికత వైభవం కోల్పోయిందని నివేదికలో పేర్కొన్నారు. వారి పరిశోధనకు ఆధారాలుగా లడఖ్‌లోని మోరిరి సరస్సుకు సంబంధించిన 5 వేల సంవత్సరాల రుతుపవన, శీతోష్ణస్థితి మార్పుల పట్టికను ఐఐటీ బృందం జతచేసింది. -
ఉల్లి గడ్డ పొట్టుతో విద్యుత్
కోల్‌కతా : ‘ఉల్లిగడ్డ పొట్టును ఏం చేస్తారు అందరూ.? ఏముంది చెత్త డబ్బాలో వేస్తారు. కానీ వినూత్నంగా ఆలోచించిన ఐఐటీ ఖరగ్‌పూర్ శాస్త్రవేత్తలు అద్భుతం సృష్టించారు. ఉల్లిగడ్డ పొట్టుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఓ పరికరాన్ని రూపొందించారు. దీంతో ఒక ఉల్లిగడ్డ పొట్టుతోనే 12 గ్రీన్ ఎల్ఈడీ బల్బులు వెలుగుతాయంటా. అంతే కాకుండా 6 ఉల్లి గడ్డల పొట్టుతో ఏంచక్కా మోబైల్ ఫోన్, ల్యాప్‌టాప్‌లకు చార్జింగ్ పెట్టుకోవచ్చంటున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్ ఫ్రోఫెసర్ భానుభూషణ్, పీహెచ్డీ స్కాలర్ సుమంతా కుమన్ కరణ్‌లు ఈ పరికారాన్ని రూపోందించారు. ఇటీవలె దక్షిణా కొరియాలోని పోహాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (పోస్ట్చెక్) శాస్త్రవేత్త జిన్ కోన్ కిమ్ ఆధ్వర్యంలో విజయవంతంగా ఈ పరికరాన్ని పరీక్షించినట్లు నానో ఎనర్జీ జర్నల్ ప్రచురించింది. రెస్టారెంట్లలో పెద్ద ఎత్తున ఉల్లి పొట్టు వృథా అవుతుందని గుర్తించి ఈ ప్రయోగం ప్రారంభించామని ఫ్రోఫెసర్ భానుభూషణ్ తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకునే రెస్టారెంట్లకు ఈ పరికరం ఉపయోగపడుతుందన్నారు. హాఫ్ ఇంచ్ ఉల్లిపొరతో 20 వోల్టుల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చన్నారు. ఆరు ఉల్లిగడ్డల పొట్టుతో 80 ఎల్ఈడీ బల్బులను వెలిగించవచ్చని, లాప్టాప్, మొబైల్ ఫోన్లను కూడా చార్జ్ చేసుకోవచ్చన్నారు. ఇక ఈ ప్రయోగం ప్రాథమిక దశలో ఉందని, దీన్ని అందరూ వినియోగించేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. దీనికి నానోజెనరేటర్గా నామకరణం చేసినట్లు ఫ్రోఫెసర్ పేర్కొన్నారు. ఉల్లిగడ్డ పొట్టులోని పియోజ్ ఎలక్ట్రిక్ గుణాలతో ఇది పని చేస్తోందని, పియోజ్ ఎలక్ట్రిక్ పదార్థాలకు యాంత్రిక శక్తిని విద్యుత్ శక్తి మార్చే శక్తి ఉందన్నారు. -
ఐఐటీ విద్యార్థి అనుమానస్పద మృతి..
సాక్షి, కోల్‌కతా: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో శనివారం ఓ విద్యార్థి అనుమానస్పందంగా మృతి చెందారు. నిఖీల్ భాటియా(23) అనే మైనింగ్ ఇంజనీరింగ్ ఫైనలియర్ విద్యార్థి క్యాంపస్‌లోని లాల్‌బహదూర్ హాల్ ముందు రక్తపుమడుగులో పడి ఉండడాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే క్యాంపస్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతను మరణించనట్లు డాక్టర్లు తెలిపారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యనా.. ఎవరైనా బిల్డింగ్‌పై నుంచి తోసేశారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. నిఖీల్ బ్రిలియంట్ విద్యార్థి అని, ముంబైలోని వారి తల్లి తండ్రులకు సమాచారం ఇచ్చినట్లు క్యాంపస్ అధికారులు పేర్కొన్నారు. -
నెట్టింట్లోకి పుస్తకం!
► కోటి పుస్తకాలను అందరికీ అందుబాటులోకి తెచ్చిన కేంద్రం ► ఖరగ్‌పూర్ ఐఐటీ సాయంతో హెచ్ఆర్డీ మినిస్ట్రీ భారీ కసరత్తు ► ఒకటో తరగతి నుంచి పీహెచ్డీ వరకు అన్నిరకాల పుస్తకాలు ► కేవలం ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు.. ఓ గ్రంథాలయం ఉన్నట్టే ► దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి వచ్చిన నేషనల్ డిజిటల్ లైబ్రరీ సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులైనా.. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులైనా.. ఫలానా పుస్తకం దొరకడం లేదన్న బెంగ అక్కర్లేదు. కాలేజీ లైబ్రరీలో ఒకే పుస్తకం ఉందే.. దానిని వేరొకరికి ఇచ్చేశారు... ఇక తానెలా చదువుకునేది? అన్న ఆందోళన కాలేజీ విద్యార్థులకు అవసరం లేదు. యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్, రాష్ట్ర సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్స్, ఎన్సీఈఆర్టీ సిలబస్‌కు సంబంధించిన రిఫరెన్సు పుస్తకాలను ఎలా కొనాలనే ఆలోచనా వద్దు. ఇప్పుడివన్నీ ఒకేచోటే అందుబాటులోకి వచ్చాయి! ఇవే కాదు.. ఒకటో తరగతి నుంచి పీహెచ్డీ వరకు అవసరమైన రిఫరెన్సు పుస్తకాల దాకా అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో చదువుకోవచ్చు. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే వాటికి సంబంధించిన వీడియోలు చూడవచ్చు. ఆడియోలను వినవచ్చు. పీడీఎఫ్ కాపీలను కూడా పొందొచ్చు. ఇందుకు కావాల్సిందల్లా ఇంటర్నెట్ సదుపాయం. అదొక్కటి ఉంటే ఏ పుస్తకం అయినా చదువుకోవచ్చు. ఒకటి కాదు.. రెండు కాదు.. కోటికిపైగా పుస్తకాలను, ఆర్టికల్స్, రచనలను, విమర్శనా వ్యాసాలు.. నెట్ ఉంటేచాలు నట్టింట్లో ఉన్నట్లే. ఐఐటీ ఖరగ్‌పూర్ సాయంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఈ భారీ కసరత్తును చేసింది. https:// ndl. iitkgp. ac. in/ పై క్లిక్ చేసి అవసరమైన పుస్తకాన్ని చదువుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదనంగా నయా పైసా ఖర్చులేదు.. ఇంటర్నెట్ కనెక్షన్ ఒక్కటుంటే చాలు... అదనంగా నయాపైసా ఖర్చు లేకుండా డిజిటల్ పుస్తకాలు, ఆర్టికల్స్, వీడియోలు, ఆడియోలు చూడొచ్చు. సాధారణ గ్రంథాలయాల తరహాలో డిపాజిట్లు అక్కర్లేదు. అవసరమైన పుస్తకాన్ని వెతుక్కునేందుకు ఎక్కువ సమయం కూడా అవసరం లేదు. ఒక్క క్లిక్‌తో కావాల్సిన పుస్తకాన్ని చదువుకోవచ్చు. అన్ని రంగాల పుస్తకాలూ.. దేశంలోని పలు యూనివర్సిటీలు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు చెందిన పుస్తకాలను డిజిటలైజ్ చేసి ఈ డిజిటల్ గ్రంథాలయంలో ఉంచారు. సాధారణ విద్య నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు.. చరిత్ర నుంచి సాహిత్యం వరకు.. అన్ని రంగాలకు చెందిన పుస్తకాలు డిజిటల్ లైబ్రరీలో అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులే కాదు పరిశోధకులు, పఠనాసక్తి ఉన్నవారు తమకు కావాల్సిన భాషలో డిజిటల్ పుస్తకాలను చదువుకోవచ్చు. ఇంగ్లిషే కాదు.. అనేక విదేశీ భాషలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) పుస్తకాలన్నింటినీ కూడా కంప్యూటరీకరించి ఇందులో ఉంచారు. అంతేకాదు త్వరలో మెుబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిజిటల్ లైబ్రరీ ప్రత్యేకతలు ఎన్నెన్నో... ► 70కి పైగా భాషల్లో... కోటికి పైగా ఈ–పుస్తకాలు ► 2 లక్షల మంది ప్రముఖుల 3 లక్షల ఆర్టికల్స్ ► లక్ష మంది భారతీయ విద్యార్థుల థీసిస్‌లు ► రాతప్రతులు, వివిధ భాషల్లో ఆడియో లెక్చర్లు ► 18 వేలకు పైగా వీడియో ఉపన్యాసాలు ► 33 వేలకు పైగా గత ప్రశ్నాపత్రాలు ► యూనివర్సిటీలు, పాఠశాల బోర్డుల ప్రశ్నాపత్రాలు, జవాబులు ► వ్యవసాయం, సైన్స్, టెక్నాలజీ రంగాల వెబ్ కోర్సులు ► సమాచార నిధి, వార్షిక నివేదికలు, 12వేలకుపైగా వివిధ నివేదికలు ► సాంకేతిక కోర్సుల నివేదికలు, న్యాయ తీర్పులు పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే వారికి ప్రయోజనం ఎంతో... పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్థులకు ఈ డిజిటల్ లైబ్రరీతో ఎంతో ప్రయోజనం చేకూరనుంది. గత పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు అడిగారు? వాటిని ఎలా పరిష్కరించారో తెలుసుకోÐèవచ్చు. అయితే వాటికి సంబంధించి మార్కెట్లో ఉన్న పుస్తకాలను కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఒక్క క్లిక్‌తో వాటిని పొందవచ్చు. రిజిస్ట్రేషన్ సులభం డిజిటల్ లైబ్రరీలో పుస్తకాలు తీసుకోవడం చాలా సులభం. ఈ–మెయిల్ ఐడీ, తాము చదువుతున్న కోర్సు, యూనివర్సిటీ పేరు నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేస్తే చాలు. ఈ వివరాలను నమోదు చేసిన తరువాత తాము పేర్కొన్న ఈ–మెయిల్ ఐడీకి లింకు వస్తుంది. ఈ లింకుపై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఆ తరువాత ఈ–మెయిల్ ఐడీ, పాస్వర్డ్ నమోదు చేసి లైబ్రరీలో లాగిన్ కావచ్చు. విద్యార్థులు, అభ్యర్థులు తమకు అవసరమైన విభాగాల వారీగా పుస్తకాలు, వీడియో, ఆడియో పాఠాలు, లెక్చర్లు, ఉపన్యాసాలు వెతికి డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
సంతోషాన్ని కొలిచేందుకు రెడీ..
కోల్‌కతా: జనాభా లెక్కల సేకరణ చూశాం. బడ్జేట్ అంచనా వేయడం తెలుసు. కానీ మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ప్రజల సంతోషాన్ని, ఆరోగ్యాని కొలిచేందుకు సిద్ధమైంది. ఇందుకు ఖరగ్‌పూర్ రేఖీ సెంటర్‌తో ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమ రాష్ట్ర ప్రజలు ఎంత సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారో కొలిచి, నివేదిక రూపంలో అందజేయడం కోసమే ఈ ఒప్పందం. దేశంలోనే తొలిసారిగా హ్యాపినెస్ డిపార్ట్మెంట్ను సర్కార్ ఇటీవల ప్రారంభించింది. ‘అయితే సంతోషాన్ని కొలవడం ఆషామాసీ వ్యవహారం కాదు. దీనికోసం ఎంతో కసరత్తు, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఈ బాధ్యతను ఐఐటీ ఖరగ్‌పూర్‌కు అప్పగించామని’ మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విభాగమైన రాజ్య ఆనందం సంస్థాన్ ఓ ప్రకటనతో పేర్కొంది. ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ పీపీ చక్రవర్తి మధ్య ఇందుకు సంబంధించిన ఒప్పందం కుదిరిందని వెల్లడించింది. గణాంకాలను అందజేయడం మాత్రమే కాకుండా హ్యాపీనెస్ ఇండెక్స్‌ను మరింతగా పెంచేందుకు ఐఐటీ బృందం సూచనలు, సలహాలు కూడా ఇస్తుంది. -
నన్ను నిద్రపోనివ్వండి అంటూ శాశ్వతంగా..
అతడు ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుతున్నాడు. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరంలో ఉన్నాడు. మరికొన్ని నెలలు ఆగితే బ్రహ్మాండమైన బంగారు భవిష్యత్తు అతడి ముందు ఉంది. కానీ.. 'నన్ను పడుకోనివ్వండి' అంటూ ఒక లేఖ రాసి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. నెహ్రూహాల్ బి బ్లాకులోని తన గదిలో సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళకు చెందిన ఎన్ నిధిన్ (22) మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టంకు పంపారు. ఈ సంవత్సరంలో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఇది మూడోసారి. ఒక నెలలోనే ఇది రెండో ఆత్మహత్య. నిధిన్ ప్రతిరోజూ అర్ధరాత్రి 2 గంటలకు అలారం పెట్టుకుని లేచి అప్పటినుంచి చదువుకునేవాడని పోలీసులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి అలారం ఎంతకూ ఆగకపోయేసరికి హాస్టల్లో ఉన్న ఇతర విద్యార్థులు ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానించారు. వాళ్లు అతడి గదికి వెళ్లి తలుపు కొట్టినా ఎంతకీ తలుపు తీయలేదు. శుక్రవారం కూడా కనిపించకపోయేసరికి హాస్టల్ అధికారులకు చెప్పారు. కిటికీ అద్దాలు పగలగొట్టి చూస్తే.. అతడు సీలింగ్‌కు వేలాడుతూ కనిపించాడు. వెంటనే దగ్గర్లో ఉన్న హిజ్లీ ఔట్‌పోస్టులో పోలీసులకు సమాచారం తెలిపారు. ఖరగ్‌పూర్ అదనపు ఎస్పీ అక్కడకు వచ్చి, తలుపులు పగలగొట్టి నిధిన్ మృతదేహాన్ని కిందకు దించారు. -
ఐఐటీ సిలబస్‌లో వాస్తు!
కోల్‌కతా: ఆర్కిటెక్చర్ సిలబస్‌లో వాస్తు శాస్త్రాన్ని త్వరలో ప్రారంభించాలని ఐఐటీ ఖరగ్‌పూర్ యోచిస్తోంది. ప్రపంచమంతా వాస్తును బలంగా విశ్వసిస్తున్న సమయంలో తమ విద్యార్థులకు ఇందులోని మెలకువలు తెలవాలనుకుంటున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్ ఆర్కిటెక్చర్ విభాగం హెడ్.. ప్రొఫెసర్ జాయ్ సేన్ తెలిపారు. ‘ప్రకృతి, నాగరికతల మధ్య అనుసంధానాన్ని వాస్తు శాస్త్రం చెబుతుంది. ప్రపంచమంతా భారతీయ వాస్తు శాస్త్రాన్ని ఆసక్తిగా గమనిస్తోంది. మన యువతరానికి దీని గురించి తెలవాలనేదే మా ప్రయత్నం. అందుకే వీలైనంత త్వరలోనే సిలబస్‌లో దీన్ని చేర్చనున్నాం’ అని సేన్ వెల్లడించారు. -
13 రోజుల్లోనే వేయి ఉద్యోగాలు
కోల్‌కతా: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో జరుగుతున్న తొలిదశ ప్రాంగణ నియామకాల్లో కేవలం 13 రోజుల్లోనే వేయి మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు సొంతం చేసుకున్నారు. 44 ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లు సహా దేశవిదేశాల నుంచి సుమారు 175 కంపెనీలు ఈసారి క్యాంపస్ రిక్రూట్మెంట్లో పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు ఏడు పీఎస్‌యూలు 44 మందిని నియమించుకున్నాయి. కోల్ఇండియా అత్యధికంగా 26 మందిని ఎంపికచేసుకుంది. మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, స్ప్రింక్లర్, డెల్టాలాంటి అంతర్జాతీయ కంపెనీలు 24 మందికి ఉద్యోగాలిచ్చాయి. ఈ ఏడాది కోర్ ఇంజినీరింగ్ విభాగంలో ఎక్కువ మంది ఎంపికయ్యారని ఐఐటీ కెరీర్ డెవలప్మెంట్ కేంద్రం చైర్మన్ ప్రొ.దేవశిశ్ దేవ్ చెప్పారు. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఈ రంగంలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య 20 శాతం పెరిగిందని, మొత్తంగా శాంసంగ్ అత్యధికంగా 47 మందిని తీసుకుందని తెలిపారు. -
బ్లాక్‌లిస్టులో మరో ఎనిమిది స్టార్టప్‌లు!
కోల్కత్తా : అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో కంపెనీల బ్లాక్లిస్టుల జాబితా పెరుగుతోంది. తాజాగా ఐఐటీ ఖరగ్‌పూర్, తమ క్యాంపస్‌లో రిక్రూట్మెంట్ జరుపకుండా ఎనిమిది స్టార్టప్‌లపై నిషేధం విధించింది. ఉద్యోగ ఆఫర్లు ఇచ్చి అనంతరం వెనక్కి తగ్గేసిన నేపథ్యంలో ఈ స్టార్టప్‌లను ఖరగ్‌పూర్ బ్లాక్ లిస్టులో పెడుతున్నట్టు ప్రకటించింది. గతేడాది తమ విద్యార్థులకు ఈ స్టార్టప్‌లు ఆఫర్ లెటర్లు ఇచ్చారని, అనంతరం ఆ లెటర్లను ఉపసంహరించుకున్నారని ఇన్స్టిట్యూట్ ప్లేస్మెంట్ చైర్మన్ దేవాసిస్ దేవ్ తెలిపారు. దీంతో ఆ స్టార్టప్‌లను క్యాంపస్‌లోకి ఈ ఏడాది అడుగుపెట్టే వీలులేకుండా నిషేధం విధించినట్టు పేర్కొన్నారు. ఈ ఏడాది 10 నుంచి 12 స్టార్టప్‌లకు క్యాంపస్‌లో ప్లేస్మెంట్లకు అనుమతిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు మొత్తం 31 స్టార్టప్‌లపై నిషేధం విధించాయి. ఆఫర్ లెటర్లు ఇచ్చి, అనంతరం ఉద్యోగంలో జాయిన్ చేసుకోకుండా జాప్యం చేయడం, లేదా ఆ ఆఫర్లను వెనక్కి తీసుకోవడం వంటి కారణాలతో ఆ కంపెనీలపై ఐఐటీలు వేటు వేస్తున్నాయి. -
ముందు చదవండి.. తర్వాత చెల్లించండి
ఖరగ్‌పూర్: ఐఐటీలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కోత విధించడంతో ఐఐటీ-ఖరగ్‌పూర్ నిధుల కోసం కొత్తదారి వెతుక్కుంది. విద్యార్థులు ఫీజు కోసం ఇబ్బందులు పడకుండా, సంస్థ ఆర్థిక భారంతో సతమతమవకుండా, ‘నేర్చుకోండి-సంపాదించండి-చెల్లించండి’ పథకానికి శ్రీకారం చుట్టింది. ఉద్యోగం వచ్చాక డబ్బులు విరాళంగాఇచ్చేందుకు విద్యార్థులు సుముఖంగా ఉంటే పథకంలో చేరొచ్చు. ఫీజు మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమల్లోకి తెచ్చారు. ‘ఉద్యోగమొచ్చాక ఏడాదికి కనీసం రూ.10 వేలు చెల్లించాలి. ఒక్కో మాజీ విద్యార్థి కనీసం రూ.30 వేలిచ్చినా ఏడాదికి రూ.30 కోట్లు అవుతుంది’ అని ఐఐటీ-కేజీపీ డెరైక్టర్ పార్థ ప్రతీమ్ చక్రవర్తి చెప్పారు.