పారిశుద్ధ్య పనులు చేస్తున్న తండ్రి ప్రసాద్. (ఇన్‌సెట్‌లో) అనిల్
ఆత్మకూర్ (ఎస్): తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూసిన ఓ విద్యార్థి.. వారిని కష్టాల నుంచి గట్టెక్కించాలనుకున్నాడు. అందుకు ఉత్తమ మార్గం చదువుకోవడమే అని భావించి ఉన్నతంగా చదివాడు. ఫలితంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు సాధించాడు. అయితే చదువుకోవడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని తుమ్మలపెన్‌పహాడ్ గ్రామానికి చెందిన పిడమర్తి ప్రసాద్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
ఆయన కుమారుడు అనిల్‌కుమార్‌కు ఖరగ్‌పూర్ ఐఐటీ కాలేజీలో ఉచిత సీటు లభించింది. అయితే, అందులో చదువుకోడానికి ప్రతి సెమిస్టర్‌కు రూ.35 వేల చొప్పున ఏడాదికి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుంది. మొత్తం నాలుగేళ్ల కోర్సులో అంతమొత్తం ఖర్చులు భరించలేమని కాలేజీలో జాయిన్ కావడానికి ఇబ్బంది పడుతున్నాడు. కోవిడ్ కారణంగా ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాస్‌లు జరుగుతున్నందున.. కనీసం ల్యాప్‌టాప్ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాడు.
తండ్రి పారిశుద్ధ్య కార్మికుడిగా చాలీచాలని జీతంతో పనిచేస్తుండడంతో చదువు కొనసాగడానికి అనిల్ దాతల సహాయాన్ని కోరుతున్నాడు. దాతలు సహకరిస్తే తన కుమారుడిని ఉన్నత చదువులు చదివిస్తానని ప్రసాద్ అంటున్నాడు. 9014154250 నంబర్‌కు గూగుల్‌పే ద్వారా గానీ, 40537593456 అకౌంట్‌కు (ఎస్‌బీఐఎన్ 0008810) గానీ ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment