టీచర్ నగ్నచిత్రాలు నెట్లో పెట్టిన ఐఐటీ విద్యార్థి | IIT student uploads nude photographs of woman on internet | Sakshi
Sakshi News home page

టీచర్ నగ్నచిత్రాలు నెట్లో పెట్టిన ఐఐటీ విద్యార్థి

Published Fri, Feb 14 2014 2:45 PM | Last Updated on Sat, Sep 2 2017 3:42 AM

టీచర్ నగ్నచిత్రాలు నెట్లో పెట్టిన ఐఐటీ విద్యార్థి

టీచర్ నగ్నచిత్రాలు నెట్లో పెట్టిన ఐఐటీ విద్యార్థి

బిలాస్పూర్ జిల్లాకు చెందిన సుర్జీత్ కుమార్ జైన్ (18) కష్టపడి చదివి ఐఐటీలో సీటు సంపాదించాడు. అయితే బుద్ధి మాత్రం వక్రమార్గం పట్టింది. అదే జిల్లాకు చెందిన మహిళ ఉపాధ్యాయురాలి నగ్న పోటోలను ఇంటర్నెట్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. ఆ విషయం తెలిసిన సదరు ఉపాధ్యాయురాలు పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆధారంగా పోటోలు ఖరగ్పూర్ ఐఐటీ ప్రాంగణంలో సుర్జీత్ కుమార్ జైన్ అప్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

 

అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఖరగ్పూర్ ఐఐటీ చేరుకున్నారు. సుర్జీత్ కుమార్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ రెండవ సంవత్సరం చదువుతున్నాడని, అయితే గత రెండు నెలలుగా అతడు తరగతులకు హాజరుకావడం లేదని సదరు ఐఐటీ డైరెక్టర్ తపన్ గోషాల్ పోలీసులకు వెల్లడించారు. దాంతో నిందితుని ఆచూకీ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement