న్యూఢిల్లీ: గడువు తేదీలోగా ఫీజు కట్టలేకపోయిన ఓ పేద విద్యార్థికి అడ్మిషన్ ఇవ్వాలని ఐఐటీ ధన్‌బాద్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతిభ గల విద్యార్థిని ఫీజు విషయంలో సీటుకు దూరం చేయడాన్ని అనుమతించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
అసలేం జరిగిందంటే..ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా టిటోరా గ్రామానికి చెందిన 18 ఏళ్ల అతుల్‌కుమార్ ఐఐటీ ధన్‌బాద్‌లో ఎలక్టానిక్ ఇంజనీరింగ్‌లో సీటు సాధించాడు. సీటు ఖరారు చేసేందుకు జూన్ 24 లోపు రూ.17,500 ఫీజు కట్టాల్సి ఉండగా,అతడి తల్లిదండ్రులు గడువులోగా ఫీజు కట్టలేకపోయారు.
తండ్రి రోజుకు 450 సంపాదించే కూలీ అవ్వడంతో..వారి నిస్సహాయతను చూసిన టిటోడా గ్రామస్థులు విరాళాలు వేసుకొని ఆ మొత్తం సమకూర్చారు. అయితే అప్పటికే గడువు తేదీ దగ్గర పడటంతో.. చివరిరోజుసాంకేతిక కారణాలతో ధన్‌బాద్ ఐఐటీ ఆన్‌లైన్ పోర్టల్ పనిచేయక అతుల్ ఆ మొత్తాన్ని సకాలంలో కట్టలేకపోయాడు. సీటు వచ్చినట్టే వచ్చి చేజారింది.
దీంతో విద్యార్ధి తనకు న్యాయం చేయాలని కోరుతూ తొలుత జార్ఖండ్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి.ఆ తర్వాత చెన్నై లీగల్ సర్వీసెస్‌కు వెళ్లాడు. అయిన ప్రయోజనం లేకపోవడంతో మద్రాస్ హైకోర్టును అశ్రయించాడు. మద్రాస్ హైకోర్టు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కోరింది.
తాజాగా నేడు సుప్రీంకోర్టులో విచారణకు రాగా.. ‘ విద్యార్థి చాలా తెలివైన వాడు. కేవలం రూ. 17,000 కట్టలేని కారణంగా అతని చదువును కోల్పోయాడు. ప్రతిభావంతుడైన వ్యక్తి ఫీజు కట్టని విషయంలో వదిలివేలయం. అతుల్ కుమార్‌ను అదే బ్యాచ్‌లో చేర్చుకోవాలి. మరే ఇతర విద్యార్థి అభ్యర్థిత్వానికి భంగం కలగకుండా సూపర్‌న్యూమరీ సీటు సృష్టించాలి. అతనికి సీటు కల్పించాలి’ అని ఐఐటీ ధన్‌బాద్‌ను ఆదేశించింది
Comments
Please login to add a commentAdd a comment