IIT student
-
దళిత విద్యార్ధికి అండగా సుప్రీంకోర్టు.. సీటు ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ: గడువు తేదీలోగా ఫీజు కట్టలేకపోయిన ఓ పేద విద్యార్థికి అడ్మిషన్ ఇవ్వాలని ఐఐటీ ధన్‌బాద్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రతిభ గల విద్యార్థిని ఫీజు విషయంలో సీటుకు దూరం చేయడాన్ని అనుమతించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్‌మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.అసలేం జరిగిందంటే..ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా టిటోరా గ్రామానికి చెందిన 18 ఏళ్ల అతుల్‌కుమార్ ఐఐటీ ధన్బాద్లో ఎలక్టానిక్ ఇంజనీరింగ్‌లో సీటు సాధించాడు. సీటు ఖరారు చేసేందుకు జూన్ 24 లోపు రూ.17,500 ఫీజు కట్టాల్సి ఉండగా,అతడి తల్లిదండ్రులు గడువులోగా ఫీజు కట్టలేకపోయారు. తండ్రి రోజుకు 450 సంపాదించే కూలీ అవ్వడంతో..వారి నిస్సహాయతను చూసిన టిటోడా గ్రామస్థులు విరాళాలు వేసుకొని ఆ మొత్తం సమకూర్చారు. అయితే అప్పటికే గడువు తేదీ దగ్గర పడటంతో.. చివరిరోజుసాంకేతిక కారణాలతో ధన్‌బాద్ ఐఐటీ ఆన్లైన్ పోర్టల్ పనిచేయక అతుల్ ఆ మొత్తాన్ని సకాలంలో కట్టలేకపోయాడు. సీటు వచ్చినట్టే వచ్చి చేజారింది.దీంతో విద్యార్ధి తనకు న్యాయం చేయాలని కోరుతూ తొలుత జార్ఖండ్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి.ఆ తర్వాత చెన్నై లీగల్ సర్వీసెస్‌కు వెళ్లాడు. అయిన ప్రయోజనం లేకపోవడంతో మద్రాస్ హైకోర్టును అశ్రయించాడు. మద్రాస్ హైకోర్టు దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని కోరింది. తాజాగా నేడు సుప్రీంకోర్టులో విచారణకు రాగా.. ‘ విద్యార్థి చాలా తెలివైన వాడు. కేవలం రూ. 17,000 కట్టలేని కారణంగా అతని చదువును కోల్పోయాడు. ప్రతిభావంతుడైన వ్యక్తి ఫీజు కట్టని విషయంలో వదిలివేలయం. అతుల్ కుమార్‌ను అదే బ్యాచ్‌లో చేర్చుకోవాలి. మరే ఇతర విద్యార్థి అభ్యర్థిత్వానికి భంగం కలగకుండా సూపర్‌న్యూమరీ సీటు సృష్టించాలి. అతనికి సీటు కల్పించాలి’ అని ఐఐటీ ధన్‌బాద్‌ను ఆదేశించింది -
ఐసిస్‌తో లింకులు.. గువాహటి ఐఐటీ విద్యార్థి అరెస్ట్
గువాహటి: అంతర్జాతీయ ఉగ్ర సంస్థ ఐసిస్‌తో సంబంధాలున్నాయనే ఆరోపణలపై గువాహటి–ఐఐటీకి చెందిన తౌసిఫ్ అలీ ఫరూకీ అనే విద్యారి్థని అస్సాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ బయోసైన్స్ నాలుగో సంవత్సరం చదువుకుంటున్న ఇతడిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ)చట్టం ఉపా కింద కేసు నమోదు చేశారు. విచారణ జరిపిన అనంతరం ఐసిస్‌తో సంబంధాలున్నట్లు పక్కా ఆధారాలు దొరకడంతో శనివారం అరెస్ట్ చేసినట్లు అస్సాం పోలీస్ టాస్‌్కఫోర్స్ ఐజీ పార్థసారధి మహంతా చెప్పారు. కోర్టు అతడిని 10 రోజుల పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చిందన్నారు. ఢిల్లీలోని బాట్లా ప్రాంతానికి చెందిన అతడు ఐసిస్‌లో చేరేందుకు వెళ్తుండగా కామ్రూప్ జిల్లా హజో వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. మూడు రోజుల క్రితం బంగ్లాదేశ్ నుంచి వచి్చన ఐసిస్ భారత్ చీఫ్ హారిస్ ఫరూకీ, అతడి అనుచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రేహాన్‌లను ధుబ్రి జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ఐజీ వివరించారు. అయితే, గువాహటి ఐఐటీకి చెందిన ఇద్దరు విద్యార్థులకు ఐసిస్‌తో సంబంధాలున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తనకు సమాచారం ఇచి్చనట్లు హోం శాఖ బాధ్యతలు కూడా చూసుకుంటున్న సీఎం హిమాంత బిశ్వ శర్మ చెప్పారు. ఇద్దరిలో ఒక్కరు మాత్రమే దొరికారని, తప్పించుకుపోయిన మరో విద్యార్థిని కూడా త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఉగ్రవాదం వైపు ప్రేరేపితులైన వీరి గురించి తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు సీఎం చెప్పారు. -
‘‘ఐసిస్‌లో చేరతా’’.. ఐఐటీ విద్యార్థి అరెస్టు
గువహతి: ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరతానని సోషల్ మీడియాలో ప్రకటించడంతో పాటు ఈ మెయిల్స్ చేసిన ఐఐటీ గువహతి విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన తర్వాత ఆ విద్యార్థి ఎక్కడికెళ్లాడో ఆజూకీ తెలియలేదు. తర్వాత పోలీసులు గాలించి అస్సాంలోని కమ్రుప్ జిల్లాలో అతడిని పట్టుకున్నారు. ఐసిస్ ఇండియా చీఫ్ హరిస్ ఫరూకీ అలియాస్ హరీష్ అజ్మల్ ఫరూకీ అతని అనుచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రెహాన్ అస్సాంలోని ధుబ్రిలో అరెస్టయిన నాలుగు రోజుల తర్వాత మిస్సైన విద్యార్థి ఆజూకీని పోలీసులు కనుగొనడం గమనార్హం. ‘ విద్యార్థి పంపిన మెయిల్స్ నిజమైనవేనని ధృవీకరించుకుని దర్యాప్తు ప్రారంభించాం. ట్రావెలింగ్‌లో ఉండగా ఆ విద్యార్థిని పట్టుకున్నాం. అరెస్టు చేసి ప్రాథమికంగా విచారించాం. చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకుంటాం. ఐసిస్ నల్ల జెండాతో పాటు ఐసిస్ మనుస్క్రిప్ట్ విద్యార్థి హాస్టల్ రూమ్‌లో దొరికింది. విద్యార్థి డిల్లీలోని ఓక్లాకు చెందినవాడు’అని అస్సాం పోలీసులు తెలిపారు. Reference @IITGuwahati student pledging allegiance to ISIS - the said student has been detained while travelling and further lawful follow up would take place. @assampolice @CMOfficeAssam @HMOIndia — GP Singh (@gpsinghips) March 23, 2024 ఇదీ చదవండి.. ఎన్నికల వేళ బరితెగిస్తున్న కేటుగాళ్లు -
ఐఐటీ హైదరాబాద్ విద్యార్థిని ఆత్మహత్య.. సూసైడ్ లెటర్ రాసి..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కందిలోని హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ ఫస్టియర్ విద్యార్థిని మమైత (20) ఆత్మహత్యకు పాల్పడింది. హాస్టల్లోని తన గదిలో ఫ్యానుకు ఉరివేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన మమైత జూలై 26న క్యాంపస్‌కు వచ్చినట్లు చెబుతున్నారు. ఒరియా భాషలో రాసిన సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. సంగారెడ్డి డీఎస్పీ పి రమేశ్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మమైత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదువు విషయంలో ఒత్తిడికి గురి కావడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చదవండి: వివాహితకు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు ఇచ్చి నగ్న వీడియోలు తీసి... -
ఐఐటీ విద్యార్థి విషాదాంతం
మిర్యాలగూడ టౌన్: వారం రోజుల క్రితం అదృశ్యమైన ఐఐటీ విద్యార్థి కార్తీక్ సోమవారం రాత్రి విశాఖపట్నంలోని జోడుగుళ్లపాలెం బీచ్‌లో శవమై తేలాడు. సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలోని ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కార్తీక్ పరీక్షలో తప్పడంతో మనస్తాపానికి గురై బంగాళాఖాతంలో మునిగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్‌ట్యాంకు తండాకు చెందిన ధనావత్ ఉమ్లా నాయక్, సైదమ్మ దంపతులకు కుమారుడు ధనావత్ కార్తీక్ (20), కుమార్తె సాతి్వక ఉన్నారు. ఉమ్లా నాయక్ వ్యవసాయ పనులు చేస్తుండగా, సైదమ్మ చింతలపాలెంలోని కస్తూర్భా గాంధీ విద్యాలయంలో కాంట్రాక్ట్ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. కాగా కార్తీక్ ఇటీవల విడుదలైన సెమిస్టర్ ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17న రాత్రి క్యాంపస్ నుంచి బయటకు వెళ్లిన కార్తీక్ అప్పట్నుంచీ కన్పించకుండా పోయాడు. ఈ నెల 18న తల్లిదండ్రులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో వారు కళాశాలకు వెళ్లి ఆరా తీశారు. కార్తీక్ బయటకు వెళ్లి తిరిగి రాలేదని సిబ్బంది చెప్పడంతో ఆందోళనకు గురైన కుటుంబసభ్యులు సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జన్మభూమి ఎక్కి విశాఖలో దిగి.. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించగా..18వ తేదీ ఉదయం కార్తీక్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో విశాఖపట్నం వెళ్లే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కినట్లు కన్పించింది. అతను అదేరోజు రాత్రి విశాఖలో దిగడం, రాత్రి 9.30 సమయంలో ఆర్కే బీచ్‌లోని ఓ బేకరీలో ఏవో కొనడం కూడా సీసీ టీవీ ఫుటేజీల ద్వారా గుర్తించారు. కార్తీక్ విశాఖపట్నంలో కన్పించినట్టు పోలీసులు ఇచ్చి న సమాచారంతో అతని తల్లిదండ్రులు అక్కడి తమ బంధువులకు విషయం చెప్పారు. 19వ తేదీ నుంచి కుటుంబసభ్యులు, బంధువులు గాలించినా ఆచూకీ దొరకలేదు. కాగా ఈ నెల 21న విశాఖ జోడుగుళ్లపాలెం బీచ్‌కు ఓ యువకుడి మృతదేహం కొట్టుకొచ్చింది. ఆరిలోవ పోలీసులు గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసి కేజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. మంగళవారం ఉదయం మృతదేహాన్ని పరిశీలించిన కార్తీక్ తల్లిదండ్రులు అది తమ కుమారుడేనని గుర్తించారు. కార్తీక్ వారం రోజుల క్రితమే బంగాళాఖాతంలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. అతడి మృతదేహం కుళ్లిపోయింది. సెల్‌ఫోన్ ఐఎంఈఐ నంబరు ద్వారా ఆ మృతదేహం కార్తీక్‌దే అని పోలీసులు నిర్ధారించారు. మృతదేహాన్ని జలచరాలు తినడంతో పోస్టుమార్టం చేసేందుకు కూడా వీలు కాలేదు. దీంతో శవాన్ని వెంటనే అంబులెన్సులో మిర్యాలగూడ వాటర్ ట్యాంకు తండాకు తరలించి సాయంత్రం వారి వ్యవసాయ క్షేత్రంలో ఖననం చేశారు. అమ్మకు బంగారం కొనిస్తానంటివయ్యా.. ‘ఉద్యోగం వచ్చి న తర్వాత అమ్మకు బంగారం కొనిస్తానంటివి.. అందరినీ మంచిగా చూసుకుంటా అంటివి.. ఇప్పుడు కనిపించకుండా పోయావా కొడుకా’అంటూ ఉమ్లానాయక్ కుమారుడి మాటలను గుర్తు చేసుకుంటూ రోదించిన తీరు అందరినీ కదిలించింది. -
హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి మిస్సింగ్ కేసు విషాదాంతం
సాక్షి, విశాఖ: ఈనెల 17వ తేదీన ఐఐటీ క్యాంపస్ నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి అదృశ్యం కేసు విషాదాంతంగా ముగిసింది. వారం రోజుల క్రితం బయటకు వెళ్లిన కార్తీక్ అనే ఐఐటీ విద్యార్థి విశాఖలో ఆత్మహత్య చేసుకున్నాడు. కార్తిక్ స్వస్థలం నల్గొండ జిల్లా మిర్యాలగూడా కాగా, ఐఐటీ హైదరాబాద్‌లో రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 17వ తేదీన కార్తీక్ అదృశ్యం కాగా, 19వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు అతడి తల్లిదండ్రులు. అప్పట్నుంచి పలు ప్రాంతాల్లో కార్తీక్ కోసం గాలించగా, ఈ క్రమంలో మంగళవారం ఉదయం అతని మృతదేహం లభించింది. కార్తీక్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆచూకీ విశాఖలో ఉన్నట్లు లభించింది. దాంతో తల్లిదండ్రులను వెంటబెట్టుకుని విశాఖకు తీసుకెళ్లారు. అక్కడ కార్తీక్ శవమై కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
పాతటైర్లకు కొత్త రూపం.. ఐఐటీ విద్యార్థిని ఘనత
రోడ్ల మీద నడిచే ఎలాంటి వాహనాలకైనా టైర్లే ఆధారం. ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ 60.80 లక్షల టైర్లు తయారవుతుంటే, ప్రతిరోజూ వాటిలో 42 లక్షలకు పైగా టైర్లు రిటైరవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా తయారవుతున్న చెత్త పరిమాణం 212 కోట్ల టన్నులైతే, అందులో టైర్ల వాటా 3 కోట్ల టన్నులకు పైమాటే! టైర్లను రీసైకిల్ చేసే కర్మాగారాలు అక్కడక్కడా పనిచేస్తున్నాయి. కొందరు సృజనాత్మకమైన ఆలోచనలతో పాతబడిన టైర్లను పునర్వినియోగంలోకి తీసుకొస్తున్నారు. టైర్ల రీసైక్లింగ్, రీయూజ్ వల్ల కొంతమేరకు కాలుష్యాన్ని నివారించగలుగుతున్నారు. పాతటైర్ల రీయూజ్‌కు పూజా రాయ్‌ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఖరగ్‌పూర్ ఐఐటీలో ఆర్కిటెక్చర్ విద్యార్థినిగా ఉన్నప్పుడు ఒకరోజు ఒక మురికివాడ మీదుగా వెళుతుంటే కనిపించిన దృశ్యం ఆమెలోని సృజనను తట్టిలేపింది. మురికివాడలోని పిల్లలు పాత సైకిల్ టైర్లు, డ్రైనేజీ పైపులతో ఆడుకోవడం చూసిందామె. సమీపంలోని పార్కుల్లో ఖరీదైన క్రీడాసామగ్రి ఉన్నా, మురికివాడల పిల్లలకు అక్కడ ప్రవేశం లేకపోవడం గమనించి, వారికోసం తక్కువ ఖర్చుతో క్రీడాసామగ్రి తయారు చేయాలనుకుంది. అందుకోసం వాడిపడేసిన టైర్లను సేకరించి, వాటిని శుభ్రంచేసి, ఆకర్షణీయమైన రంగులతో అలంకరించి తమ కళాశాల ఆవరణలోనే క్రీడామైదానాన్ని సిద్ధం చేసింది. ఐఐటీ అధ్యాపకులు ఆమె ఆలోచనను ప్రశంసించారు. ఆ ఉత్సాహంతోనే పూజా 2017లో ‘యాంట్‌హిల్ క్రియేషన్స్’ పేరిట స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో దేశంలోని పలునగరాల్లో ఇప్పటివరకు 350 క్రీడా మైదానాలు తయారయ్యాయి. వీటిలోని ఆటవస్తువులన్నీ వాడేసిన టైర్లు, పైపులు, ఇనుపకడ్డీలతో తయారైనవే! పూజా రాయ్ కృషి ఫలితంగా వెలసిన ఈ క్రీడామైదానాలు పేదపిల్లలకు ఆటవిడుపు కేంద్రాలుగా ఉంటున్నాయి. -
క్వాలిఫై కావడమే కష్టం.. అలాంటిది ఏకంగా విన్నర్‌గా! 7 లక్షల ప్రైజ్‌మనీ!
అది ఆషామాషీ పోటీ కాదు. ‘వరల్డ్స్ లార్జెస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కాంపిటీషన్’గా గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిన పోటీ. ఈసారి 87 దేశాల నుంచి లక్షమందికి పైగా విద్యార్థులు ఈ పోటీలో పాల్గొన్నారు. అందులో మన కుర్రాడు కలష్ గుప్తా ‘వరల్డ్స్ టాప్ కోడర్’ టైటిల్ గెలుచుకున్నాడు... టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసిఎస్) నిర్వహించే ప్రతిష్ఠాత్మకమైన ‘కోడ్ విట’లో కలష్‌గుప్తా విజేతగా నిలిచాడు. 7.76 లక్షల గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకున్నాడు. ఐఐటీ–దిల్లీలో కలష్‌గుప్తా థర్డ్ ఇయర్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్. ‘కోడ్ విట’ గురించి తెలిసినప్పుడు ఆ పోటీలో ఎలాగైనా పాల్గొనాలనే ఉత్సాహం కలష్‌కు కలిగింది, ‘అందులో క్వాలిఫై కావడం కష్టం’ అన్నారు చాలామంది. ‘టఫ్’ అనే ప్రతికూల మాట వింటే చాలు కలష్‌లో పాజిటివ్ వైబ్రేషన్స్ బయలుదేరుతాయి. పట్టుదల వచ్చి అదేపనిగా షేక్‌హ్యాండ్ ఇస్తుంది. ‘కోడ్ వీట’ పోటీలో పాల్గొనడం వల్ల రకరకాల ప్రయోజనాలు ఉన్నాయి. అందులో కొన్ని... ►టాప్కోడర్గా గ్లోబల్ ర్యాంకింగ్ ఇస్తారు ►ఆకర్షణీయమైన ప్రైజ్‌మనీ దక్కుతుంది ►ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన టాటా బ్రాండ్ లో ఎగ్జాయిటింగ్ కెరీర్‌ను ఎంచుకునే అవకాశం ఏర్పడుతుంది. ►ప్రపంచవ్యాప్తంగా చేయితిరిగిన కోడర్స్తో పోటీపడే అవకాశం దొరుకుతుంది అస్సలు ఊహించలేదు.. కానీ బరిలోకి దిగిన తరువాత ‘ఏదో ఒక ర్యాంకు వస్తుంది’ అనుకున్నాడుగానీ ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అనుకోలేదు కలష్. అందుకే ఇది తనను ఆశ్చర్యానందాలకు గురి చేసిన విజయం. సాకెత్(దిల్లీ)లోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్న కలష్‌కు కంప్యూటర్ సైన్స్ అంటే చాలా ఇష్టం. ‘ఇష్టం లేని కష్టమైన సబ్జెక్ట్ చదువుతున్నప్పుడే కాదు, మనకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్‌ను చదువుతున్నప్పుడు కూడా రకరకాల ఆలోచనలు, జ్ఞాపకాలు మన ముందుకు వచ్చి నిలుచుంటాయి. కొన్ని సందర్భాలలోనైతే చదువును వదిలేసి వాటితోనే ప్రయాణిస్తాం. దీనివల్ల బయటికి మనం బాగా కష్టపడుతున్నట్లు కనిపించినప్పటికీ, ఆ కష్టం వృథా పోతుంది. అందుకే పుస్తకం పట్టుకున్న తరువాత సబ్జెక్ట్‌కు సంబంధం లేని ఆలోచనలు మన దగ్గరకు రాకుండా చూసుకోవాలి’ అంటున్న కలష్ జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్(జేఇఇ)లో జాతీయస్థాయిలో మూడో ర్యాంకు దక్కించుకున్నాడు. తాజాగా ‘వరల్డ్స్ టాప్ కోడర్’ టైటిల్ గెలుచుకోవడం ద్వారా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు కలష్. ప్రైజ్‌మనీతో పాటు టీసిఎస్ రిసెర్చ్ అండ్ ఇనోవేషన్ సంస్థలో ఇంటర్న్‌షిప్‌కు అవకాశం లభిస్తుంది. ‘బహుమతి, ర్యాంకింగ్ విషయం ఎలా ఉన్నప్పటికీ ఇలాంటి పోటీలలో పాల్గొనడం వల్ల మన బలాలు, బలహీనతలు మనమే తెలుసుకునే అవకాశం దొరుకుతుంది’ అంటున్నాడు కలష్. ‘ఫైనల్స్‌కు చేరుకున్న నలుగురు అభ్యర్థులు మొత్తం పది ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేశారు. ఇలా గతంలో ఎన్నడూ జరగలేదు’ అంటున్నారు టీసిఎస్ ప్రతినిధి. ప్రోగ్రామింగ్, చెస్ అంటే ఇష్టపడే కలష్ ఒత్తిడికి గురైనప్పుడు ఫుట్‌బాల్ ఆడతాడు. ఇది ‘రియల్ స్ట్రెస్‌బస్టర్’గా చెబుతాడు. ప్రోగ్రామింగ్, చెస్ అంటే ఇష్టపడే కలష్ ఒత్తిడికి గురైనప్పుడు ఫుట్‌బాల్ ఆడతాడు. ఇది ‘రియల్ స్ట్రెస్‌బస్టర్‌గా చెబుతాడు. చదవండి: Radhika Gupta: అవమానాల నుంచి అందనంత ఎత్తుకు! -
లైంగిక వేధింపులు.. మూడుసార్లు ఆత్మహత్యాయత్నం.. చివరికి పశ్చిమ బెంగాల్లో..
తిరువొత్తియూరు(చెన్నై): చెన్నై ఐఐటీలో చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో ఇన్నాళ్లూ పరారీలో ఉన్న ఓ పూర్వ విద్యార్థిని ప్రత్యేక బృందం పోలీసులు పశ్చిమ బెంగాల్లో అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నై ఐఐటీలో చదువుతున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ విద్యార్థినిని అదే కళాశాలలో చదువుతున్న సింగ్ షేక్ దేవ్‌శర్మ ప్రేమించి వివాహం చేసుకుంటానంటూ నమ్మించాడు. 2017లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన స్నేహితులు శుభ దీప్ బెనర్జీ, మలాయి క్రిస్టియన్ మహాకు కూడా ఇందులో పాత్ర ఉన్నట్లు తెలిసింది. అప్పట్లో బాధిత విద్యార్థిని అధ్యాపకుడు ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో సింగ్ షేక్ దేవ్‌శర్మ కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థినిని వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు 2020 జూలై 17న కేసు నమోదు చేశారు. దర్యాప్తులో విద్యార్థిని మనోవేదనతో మూడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఈక్రమంలో సహా విద్యార్థులు ఆమెను రక్షించారు. కాగా అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఐఐటీ పూర్వ విద్యార్థి సింగ్ షేక్ దేవ్‌శర్మ (30)ని పశ్చిమబెంగాల్లో ప్రత్యేక బృందం పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరిచి సోమవారం ఉదయం చెన్నైకి తీసుకువచ్చారు. అలాగే మరో ఇద్దరి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది. చదవండి: బాలికకు మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని.. -
సిద్ధాంత్‌కు సీటివ్వండి!
న్యూఢిల్లీ: జేఈఈ పరీక్షలో మంచి ర్యాంకు సంపాదించినా ఒక్క రాంగ్ క్లిక్‌తో ఐఐటీ సీటు కోల్పోయిన సిద్ధాంత్ బత్రాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బత్రాకు మధ్యంతర ప్రవేశం కల్పించాలని కోర్టు ఐఐటీ బాంబేని ఆదేశించింది. జస్టిస్ ఎస్కే కౌల్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ కేసును విచారించింది. ముందుగా బత్రాకు అడ్మిషన్ ఇవ్వాల్సిందిగా ఐఐటీని ఆదేశించి తదుపరి విచారణను శీతాకాలం సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. ప్రస్తుతం బత్రాకు ఇచ్చే అడ్మిషన్ తుది తీర్పునకు లోబడి ఉంటుందని తెలిపింది. ఆగ్రాకు చెందిన సిద్ధాంత్ బత్రాకు జేఈఈలో 270వ ర్యాంకు సాధించి ఐఐటీ బాంబేలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సీటు సంపాదించాడు. అయితే అక్టోబర్ 31న తన రోల్ నంబర్‌పై అప్డేట్ల కోసం నెట్లో బ్రౌజ్ చేస్తుండగా ఒక లింక్‌ను అనుకోకుండా క్లిక్ చేశాడు. ‘‘విత్ డ్రా ఫ్రం సీట్ అలకేషన్ అండ్ ఫర్దర్ రౌండ్స్’ అని ఉన్న లింక్‌ను తను క్లిక్ చేశాడు. ఇప్పటికే తనకు సీటు దొరికినందున ఇకపై ఎలాంటి అడ్మిషన్ రౌండ్లు ఉండవన్న నమ్మకంతో ఈ లింక్‌ను క్లిక్ చేసినట్లు బత్రా చెప్పారు. అయితే నవంబర్ 10న విడుదలైన 93మంది విద్యార్దుల తుది జాబితాలో బత్రా పేరు లేదు. దీంతో ఆయన బొంబాయి హైకోర్టులో పిటీషన్ వేశారు. 19న పిటిషన్ విచారించిన కోర్టు రెండురోజుల్లో బత్రా పిటిషన్‌ను ఆయన విజ్ఞాపనగా పరిగణించమని ఐఐటీని ఆదేశించింది. అయితే విత్‌డ్రా లెటర్‌ను రద్దు చేసే అధికారం తమకు లేదంటూ ఐఐటీ గత నెల 23న బత్రా అప్పీలును తిరస్కరించింది. నిబంధనలు అతిక్రమించి ఏమీ చేయలేమని తెలిపింది. అడ్మిçషన్లన్నీ జేఒఎస్‌ఎస్‌ఏ చూసుకుంటుందని ఐఐటీ రిజిస్ట్రార్ చెప్పారు. ప్రస్తుతం తమ వద్ద ఖాళీ సీటు లేదన్నారు. వచ్చేఏడాది జేఈఈకి బత్రా అప్లై చేసుకోవచ్చన్నారు. ఐఐటీ వాదనతో ఏకీభవించిన బాంబే హైకోర్టు తన అభ్యర్థనను కొట్టివేయడంతో బత్రా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తన అభ్యర్థనను మానవతా ధృక్పథంతో పరిశీలించాలని, తనకోసం అదనపు సీటు సృష్టించాలని విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు విద్యార్ధికి అడ్మిషన్ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. -
అంజలికి మంత్రి కేటీఆర్ చేయూత
సాక్షి, వరంగల్: జిల్లాలోని హసన్పర్తికి చెందిన మేకల అంజలికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం ఆర్థిక సాయం అందించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఐఐటీలో చదువుతున్న అంజలి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి ప్రవేశించింది. దీంతో ఆమెకు ఫీజులు, లాప్టాప్ ఖరీదు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.1,50,000 రూపాయలను అందించారు. కాగా అంజలి గతేడాది హసన్‌పర్తిలోని గురుకులంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకొని ఐఐటీలో మంచి ర్యాంకు సాధించింది. అయితే తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమేనని, పై చదువుల నిమిత్తం తనకు సహాయం అందించాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. (మాకు సాయం అందించండి) అప్పుడు దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్ గత సంవత్సరం సైతం ఫీజుల నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయం అందించారు. అంజలి తండ్రి రమేష్ ఆటో డ్రైవర్ కావడంతో ఐఐటీ విద్య పూర్తయ్యే వరకు అవసరమైన నిధులను వ్యక్తిగతంగా అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు అంజలి రెండో సంవత్సరానికి సంబంధించిన ఖర్చులను నేడు ప్రగతి భవన్లో అంజలికి అందజేశారు. కేటీఆర్ చేసిన సాయానికి అంజలి కుటుంబం ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. (‘ఆస్క్ కేటీఆర్’పేరిట ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో కేటీఆర్ సంభాషణ) -
ఫాతిమా కేసులో మలుపు
సాక్షి, చెన్నై: ఐఐటీ విద్యార్థిని ఫాతిమా మృతి కేసులో ప్రొఫెసర్ల మెడకు ఉచ్చు బిగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తండ్రి లతీఫ్‌కు ఫాతిమా పంపిన సమాచారాన్ని పరిశోధకులు ధ్రువీకరించారు. అలాగే తన కుమార్తె మరణంలో సహచర విద్యార్థుల ప్రమేయం కూడా ఉన్నట్టు లతీఫ్ ఆరోపణలు చేశారు. దీనిపై ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు ఆయన ఢిల్లీ బయలుదేరారు.మద్రాసు ఐఐటీలో చదువుకుంటున్న కేరళకు చెందిన ఫాతిమా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె మరణం వెనుక వేధింపులు ఉన్నట్టుగా ఆరోపణలు వచ్చాయి. ముగ్గురు ప్రొఫెసర్ల వేధింపులు తాళలేక ఫాతిమా బలవన్మరణానికి పాల్పడినట్టుగా సంకేతాలు రావడంతో విద్యార్థుల్లో ఆగ్రహంతో ఉన్నారు. అలాగే వేధింపుల సమాచారం మెయిల్‌ను చెన్నై పోలీసుల దృష్టికి ఫాతిమా తండ్రి లతీఫ్ తీసుకురావడంతో ప్రొఫెసర్ల చుట్టూ విచారణ సాగింది. న్యాయం కోసం సీఎం పళనిస్వామిని సైతం ఫాతిమా కుటుంబం కలిసి విజ్ఞప్తి చేసుకుంది. అయితే కేసును పక్కదారి పట్టించే రీతిలో విచారణ సాగుతున్నట్టు, ప్రొఫెసర్లను రక్షించే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నట్టుగా ఆరోపణలు రావడంతో ఇక ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమకు న్యాయం చేయాలని అభ్యర్థించే పనిలో లతీఫ్ నిమగ్నమయ్యారు. సహచర విద్యార్థులపై ఆరోపణలు.. తన కుమార్తె మరణానికి న్యాయం కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు లతీఫ్ ఢిల్లీ వెళ్లారు. వెళ్తూ తిరువనంతపురం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. తన కుమార్తె వేధింపుల్లో ప్రొఫెసర్లతో పాటుగా సహచర విద్యార్థులు కూడా కొందరు ఉన్నట్టుగా తెలుస్తోందని, అందుకు తగ్గ ఆధారాలను సేకరించి ఉన్నట్టు వివరించారు. వీటిని ప్రధాని దృష్టికి తీసుకెళ్లి న్యాయం కోరుతామన్నారు. అప్పటికీ తమకు న్యాయం లభించకుంటే న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా లతీఫ్ సమర్పించిన సమాచారం, మెయిల్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లలోని వివరాలను పరిశోధకులు పరిశీలించి నిర్ధారించి ఉన్నారు. అవన్నీ ఫాతిమా పంపినట్టుగా పరిశోధనలో తేలి ఉన్నట్టు, ఇందుకు తగ్గ నివేదిక కోర్టుకు చేరి ఉన్నట్టుగా సంకేతాలు వెలువడ్డాయి. అయితే సెంట్రల్ క్రైం బ్రాంచ్ అస్టిసెంట్ కమిషనర్ మూర్తి, సహాయ కమిషనర్ మెక్లినా నేతృత్వంలోని బృందం ఈ సంకేతాల్ని ధ్రువీకరించడం లేదు. ఇదిలా ఉండా ఐఐటీలో వరసుగా విద్యార్థుల ఆత్మహత్యల ఘటనల్ని సీబై చేత విచారించాలని, కోర్టులో దాఖలైన పిటిషన్ వాదనలు ముగిశాయి. అయితే, తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. -
హైదరాబాద్ ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య
-
పబ్జీ ఉన్మాదం.. తండ్రిని ముక్కలుగా..
బెంగళూరు: స్మార్ట్ ఫోన్లో పబ్జీ గేమ్‌కు బానిసైన యువకుడు ఆ ఉన్మాదంతో కన్నతండ్రినే కత్తిపీటతో ముక్కలుగా నరికి చంపాడు. ఈ ఘోరం కర్ణాటకలో బెళగావి తాలుకాలోని కాకతీ కాలనీలో సోమవారం జరిగింది. హతుడు శంకరప్ప కమ్మార(60) కాగా, నిందితుడు అతని కుమారుడు రఘువీర్ కమ్మార (25). ఐటీఐ మెకానికల్ రెండో ఏడాది చదువుతున్న రఘువీర్ మొబైల్లో గేమ్స్‌కి అలవాటు పడ్డాడు. శనివారం అర్థరాత్రి నుంచే రఘువీర్ ఇంట్లో, తమ వీధిలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడని, అర్థరాత్రి బయటకు వచ్చి ఇతరుల ఇంటికి వెళ్ళి తలుపులు, కిటికీలు కొడుతూ తనకు రక్తం కావాలని గట్టిగా అరుస్తూ గొడవలు చేస్తున్నాడని స్థానికులు పోలీసులకి తెలిపారు. వారి ఫిర్యాదుతో ఆదివారం తల్లిదండ్రులతో పాటు అతన్ని పోలీసులు పిలిపించి హెచ్చరించారు. ఘోరం జరిగింది ఇలా.. ఆదివారం అర్థరాత్రి దాటుతున్నా కుమారుడు మొబైల్ఫోన్లో పబ్జీ గేమ్ ఆడుతుండడం, అతని చేతికి రక్తం వస్తుండడం చూసి తల్లి చేతికి కట్టు కట్టబోయింది. దీంతో రఘువీర్ గొడవకు దిగాడు. వెంటనే తండ్రి వెళ్లి గట్టిగా పట్టుకుని కట్టుకట్టబోగా ఒక్కసారిగా ఉన్మాదిగా మారాడు. తల్లిని మరో గదిలోకి నెట్టి గడియపెట్టి తన చేతికి ఉన్న బ్యాండేజ్ మొత్తం విప్పి తండ్రి గొంతుకు చుట్టి హత్య చేయబోయాడు. రఘువీర్ కత్తిపీటను తీసుకొని తండ్రి పైన దాడి చేయడంతో అతడు ప్రాణాలు విడిచాడు. రఘువీర్ అంతటితో ఆగకుండా తండ్రి మొండాన్ని, తలను వేర్వేరుగా నరికేశాడు. చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి లోనికి వచ్చే ప్రయత్నం చేయగా వారిపై కూడా కత్తిపీటతో దాడికి యత్నించాడు. సుమారు అరగంట పాటు అలా ముప్పతిప్పలు పెట్టాడు. పోలీసులు ఒక బెడ్‌షీటు తీసి అతని పైన వేసి గట్టిగా పట్టుకొని బంధించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
విబూది
పెద్ద వయసులో ఎవరెస్టును ఎక్కడం, చిన్న వయసులో ఐఐటీ ధన్‌బాద్ సీటు కొట్టడం, యాషెస్ సిరీస్‌లో రన్ల రికార్డ్‌ను బ్రేక్ చెయ్యడం ఎవ్రీడే అచీవ్‌మెంట్స్‌గా అనిపించవచ్చు. కానీ వాటి వెనుక ఉన్న ‘హఠంపట్టు’ (పర్‌సెవీరెన్స్) ఎవరికి వాళ్లకే ప్రత్యేకం. వన్ అండ్ ఓన్లీ. ఆ పట్టు పిడికిలిలోంచి రాలిపడే విబూదిని నుదుటికి రాసుకోవలసిందే.- మాధవ్ శింగరాజు బెస్ట్ ఫిమేల్ ప్లేయర్ :అని అనడంలో ‘స్త్రీ సాధించింది’ అని కాక, ‘స్త్రీ అయివుండీ సాధించింది!’ అనే ఎగ్జయిట్మెంట్ ఉండే మాట వాస్తవమే. అయితే స్త్రీని ఉమన్ అచీవర్‌గా కాక, ఒక హ్యూమన్ అచీవర్‌గా మాత్రమే చూడడం అంటే ఆమె పర్సెవీరెన్స్ని తక్కువ చేయడమే. తక్కువ అంటే పురుషుడికి ఈక్వల్ చెయ్యడం. ఎవరికైనా గిన్నిస్ ఒక గుర్తింపు. అయితే ఇప్పుడెవ్వరూ గిన్నిస్‌ను గుర్తిస్తున్నట్లు లేదు. గిన్నిస్ బుక్కే చిన్నబోయేంతగా ఉంటున్నాయి మరి ఘనతలు! విజయాలు, వీర స్వర్గాలూ రొటీన్ అయిపోయి అభినందనగా చెయ్యి చాచడానికి ఎవరికీ మనసు రావడం లేదు. ఎక్కినందుకు, దిగినందుకు, ఎగిరినందుకు.. ఇలా గిన్నిస్వాళ్లు రికార్డులు ఇస్తూనే ఉన్నా.. ఎక్కడమేం గొప్ప, ఎగరడమేం గొప్ప అన్న చప్పరింపే వినిపిస్తోంది. బహుశా.. గిన్నిస్‌లోకి ఎక్కడమన్నది ఏ విలువా లేని గుర్తింపు అనే కాలంలోకి మనుషులు వచ్చి పడుండొచ్చు. శిఖరాన్ని చేరుకోవడం గొప్ప పనేం కాదనే అనుకుందాం. చేరుకునేవరకు మనసు నిలువలేకపోవడం.. అది గొప్పే కదా. కొండలెక్కొస్తే ఎవరికి ఉపయోగం? ఎవరికీ లేదు. కొండకి లేదు. కొండను ఎక్కిన మనిషికీ లేదు. కానీ ఒరిపిడి! పాదాల ఒరిపిడి రాళ్లకు, రాళ్ల ఒరిపిడి పాదాలకు. ఆ రాపిడి పొడి విబూదిలా నుదుటిపై పెట్టుకోవలసిందే. ఎక్కి దిగొచ్చేలోపు ఎన్ని జన్మలు, ఎన్ని జన్మరాహిత్యాలు.. ఆ మనిషికి! మహిళలు సాధించే విజయాలు కూడా గిన్నిస్ రికార్డుల్లా చాలా ఈజీ అయిపోయాయి. మహిళలకు కాదు ఈజీ అయిపోవడం, ఆపోజిట్ జెండర్‌కి. మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లూ నెగ్గడం సర్వసాధారణం అయిపోవడం వల్ల ఆ నెగ్గడానికి ఏ విలువా ఉన్నట్లు కనిపించకపోయినా, నెగ్గుకు రావడం అనేది ఒకటి ఉంటుంది.. దానికి ఉంటుంది వాల్యూ. ఒకళ్లిస్తే పెరిగే వాల్యూ, ఇవ్వకపోతే తగ్గిపోయే వాల్యూ కాదది. ‘ఎందుక్కాదో తేల్చుకుందాం’ అని అనువుకాని దాని వెంటపడి సాధించడంలోని ‘వాల్యూ ఆఫ్ పర్‌సెవీరెన్స్’! ఈ పర్‌సెవీరెన్స్ (పట్టువదలకపోవడం) స్త్రీ, పురుషులిద్దరికీ ఉంటుంది కానీ, స్త్రీ ‘మోర్ పర్సెవీరింగ్’గా ఉండాలి. చేతులు ఊపుకుంటూ నడిచే నడకకు, తలపైన బరువులు మోసుకుంటూ నడిచే నడకకు మధ్య ఉండే వ్యత్యాసం వల్ల తప్పనిసరి అయ్యే ‘మోర్’ అది. ఎక్కువ కష్టపడాలి స్త్రీ తను అనుకున్నది సాధించడం కోసం. టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్‌కి ఈ మాట నచ్చదు. ‘లెబ్రాన్ జేమ్స్‌ని బెస్ట్ మేల్ ప్లేయర్ అంటున్నారా? ఫెదరర్నీ, టైగర్ ఉడ్స్నీ బెస్ట్ మేల్ ప్లేయర్స్ అంటున్నారా? మరెందుకు నేను గానీ, ఇంకో ఉమన్ అథ్లెట్ గానీ బెస్ట్ ఫిమేల్ ప్లేయర్ అవ్వాలి?’అని రెండేళ్ల క్రితం కావచ్చు ఆవిడ చికాకు పడ్డారు. బెస్ట్ ఫిమేల్ ప్లేయర్ అని అనడంలో ‘స్త్రీ సాధించింది’ అని కాక, ‘స్త్రీ అయివుండీ సాధించింది!’ అనే ఎగ్జయిట్మెంట్ ఉండే మాట వాస్తవమే. అయితే స్త్రీని ఉమన్ అచీవర్‌గా కాక, ఒక హ్యూమన్ అచీవర్‌గా మాత్రమే చూడటమంటే ఆమె పర్సెవీరెన్స్ని తక్కువ చేయడమే. తక్కువ అంటే పురుషుడికి ఈక్వల్ చెయ్యడం. ఉమెన్స్ యాషెస్ సిరీస్‌లో ఇటీవల ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్ జట్టును ఓడించింది. ఇంగ్లండ్‌లోని ఛెమ్స్ఫోర్డ్లో జరిగిన ట్వంటీ ట్వంటీ మహిళల ఇంటర్నేషనల్ మ్యాచ్ అది. ఆస్ట్రేలియా కెప్టెన్ మెగ్ లానింగ్. 63 బంతుల్లో 133 పరుగులు తీశారు. వాటిల్లో 6 సిక్సర్లు, 17 ఫోర్లు. నాటౌట్. టీ–ట్వంటీ మహిళా క్రికెట్లో ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరు. వరల్డ్ రికార్డు. మన దగ్గర ఒక్క పేపర్ కూడా మెగ్ లానింగ్ సాధించిన ఈ ఘన విజయం గురించి చిన్న వార్తయినా రాయలేదు! కనీసం రెండు కారణాల వల్లనైనా లానింగ్‌ని సీరియస్‌గా తీసుకోకపోవడం అన్నది జరగకుండా ఉండాల్సింది. ఒక కారణం: రికార్డును సాధించడమే కాదు, రికార్డును బ్రేక్ చేశారు కూడా లానింగ్. ఆ బ్రేక్ చేసిన రికార్డు కూడా తనదే! ఐదేళ్ల క్రితం బంగ్లాదేశ్‌లో జరిగిన మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు మీద 126 పరుగులు స్కోర్ చేసి వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు లానింగ్. దాన్నే మళ్లీ బ్రేక్ చేశారు. రెండో కారణం : లానింగ్ ఆడింది ‘యాషెస్’ సిరీస్! నూటా ముప్ఫై ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన సిరీస్. మగవాళ్లది మెన్స్ యాషెస్. మహిళలది ఉమెన్స్ యాషెస్. మగవాళ్లయినా, మహిళలైనా యాషెస్ సిరీస్‌లో రికార్డు సాధించడం గొప్ప సంగతి. కానీ క్రికెట్లో ఒక్క రన్నే అయినా మగవాళ్లు కొట్టినదే, ఒక్క వికెట్టే అయినా మగవాళ్లు తీసిందే గొప్పగా రిఫ్లెక్ట్ అవుతుంటుంది. చదువుల్లో కూడా అమ్మాయిల ఘనతలు కామన్ అయిపోయాయి! ఆ ఘనతల వెనుక ఆ కష్టం, ఆ స్ట్రెస్ కామన్ విషయాలా? వంద మంది అమ్మాయిలు ఒకే విధమైన వంద విజయాలను ఏటా సాధిస్తూనే ఉన్నా ప్రతి అమ్మాయి విజయమూ ప్రతి ఏడాదీ తొలి మహిళా విజయమే. ఈ ఏడాది జ్యోతి ప్రియదర్శిని అనే 15 ఏళ్ల రాయ్‌బరేలి అమ్మాయి జార్ఖండ్‌లోని ధన్‌బాద్ ఐఐటీలో (ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్) సీటు సంపాదించింది! కాకపోతే చిన్న వయసులో పెద్ద చదువులు చదవడం అన్నది పాత బడిపోయి జ్యోతి కూడా ఒక రొటీన్ జీ–ర్యాంకర్ అయిపోయింది లోకానికి. జ్యోతి తండ్రి సురేశ్‌కుమార్ మ్యాథ్స్, సైన్స్ టీచర్. పదకొండు మంది ఉండే ఉమ్మడి కుటుంబానికి (అందులో ఒకరు స్ట్రోక్ సర్వైవర్) ఆయన జీతమే ఆధారం. జ్యోతిని మెడిసిన్ చదివించాలని ఆయన. ఇంజనీరింగ్ చదవాలని జ్యోతి. తండ్రిని ఒప్పించేందుకు ఒక పెయిన్. తండ్రిని నొప్పిస్తున్నానేమోనని ఇంకో పెయిన్.జ్యోతి అనే కాదు, చదువు అనే కాదు. లానింగ్ అనే కాదు, ఆట అనే కాదు. ఏ రంగంలో ఏ స్త్రీ సాధించిన ఘనత వెనుకైనా ఘనత వహించిన పెయిన్ ఒకటి ఉంటుంది. దానిక్కొట్టాలి సెల్యూట్.. చెయ్యి పైకెత్తి, కాలును నేలకు తాటించి. -
ఐఐటీ విద్యార్థి నిర్వాకం.. స్నానాలు చేస్తుండగా ఫోటోలు
ముంబై : ఓ మహిళ స్నానం చేస్తుండగా ఫోటోలు తీయడానికి ప్రయత్నించిన ఓ ఐఐటీ స్టూడెంట్‌ని థానే పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. బాంబే ఐఐటీలో చదువుతున్న అవినాష్ కుమార్ యాదవ్ థానేలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నాడు. అయితే అతని బుర్రలో ఏ పురుగు దూరిందో తెలీదు కానీ.. పక్క ప్లాట్ బాత్రూమ్లో మొబైల్ ఫోన్‌ను అమర్చాడు. ఈ క్రమంలో సదరు ప్లాట్‌లో నివాసం ఉంటున్న మహిళ స్నానం చేయడానికి వెళ్లినప్పుడు బాత్రూమ్ కిటికిలో సెల్‌ఫోన్ ఉండటాన్ని గమనించింది. వెంటనే ఆమె ఈ విషయాన్ని భర్తకు తెలిపింది. ఆ సమయంలో అవినాష్ అక్కడే తచ్చాడుతుండటంతో అనుమానం వచ్చి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా పరారయ్యాడు. మొబైల్‌ను స్వాధీనం చేసుకుని చూడగా ... అపార్ట్‌మెంట్‌కు చెందిన మహిళలతో పాటు స్నానం చేస్తున్న పురుషుల ఫోటోలు కూడా ఉన్నాయి. దాంతో వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అవినాష్ మీద ఫిర్యాదు చేయగా, సెక్షన్ 354 కింద పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. -
భవనం పైనుంచి పడి ఐఐటీ హైదరాబాద్ విద్యార్థి మృతి
సాక్షి, సంగారెడ్డి : జిల్లాలోని కంది పట్టణంలో గురువారం అర్ధరాత్రి కలకలం రేగింది. కందిలోని ఐఐటీ-హైదరాబాద్ భవనం పైనుంచి పడి ఓ ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందాడు. మృతుడు అనిరుధ్యగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్నామని, ఘటనపై విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. ఐఐటీహెచ్‌లో అనిరుధ్య మెకానికల్ అండ్ ఏరోస్పేస్ కోర్సు చేస్తున్నాడు. -
ఐఐటీ విద్యార్థికి మోదీ స్పెషల్ గిఫ్ట్
ధన్‌బాద్ : ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు దగ్గరగా ఉంటారు. తనకు కానుక ఇవాలని ఐఐటీ విద్యార్థి ఓ సోషల్ మీడియా ద్వారా అభ్యర్థించగా అతడి కోరికను మోదీ తీర్చారు. ఆ విద్యార్థి కోరిన కానుకతో పాటు, ఒక లేఖను కూడా పంపించారు. ఇప్పుడు ఆ విద్యార్థి ఆనందంలో మునిగి తేలుతున్నాడు. ఇంతకీ విషయమేమిటంటే.. పంచాయితీరాజ్ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌కు వెళ్లారు. ఆ పర్యటనలో మోదీ బంగారు వర్ణంలో ఉన్న మాల ధరించారు. మోదీ ఉపన్యాసాన్ని వినడానికి వచ్చిన రబేశ్ కుమార్ సింగ్ అనే విద్యార్థి ఆ మాలను చూసి ముచ్చటపడ్డాడు. అనుకున్నదే తడవుగా ఆ మాల తనకు కావాలంటూ ట్విటర్ వేదికగా మోదీకి తన మనసులోని మాట చెప్పాడు. ఇందుకు స్పందించిన మోదీ.. ప్రధాని కార్యాలయం (పీఎంవో) ద్వారా మాలతో పాటు, ఒక లేఖను కూడా పంపించారు. ‘ట్విటర్లో నీ మెసేజ్ చదివాను. పంచాయితీరాజ్ దినోత్సవం రోజు నేను ఆ మాల ధరించాను. ఇప్పుడు ఆ మాలతో పాటు ఈ లేఖను కూడా నీకు పంపిస్తున్నాను. నీవు మంచి భవిష్యత్తు పొందాలని ఆశిస్తున్నానంటూ’ రబేశ్కు మోదీ లేఖ రాశారు. కానుకను అందుకున్న రబేశ్.. ‘మీ నుంచి కానుకతో పాటు, లేఖ కూడా అందుకోవడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఇంత మంచి బహుమతి, సందేశాన్నిచ్చిన మీకు కృతఙ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశాడు. प्रधानमंत्री @narendramodi जी नमस्ते आप को पंचायती राज दिवस पर सुन रहा था, बहुत ही सुन्दर उद्बोधन आप के गले में सोने के रंग जैसा माला देखा बहुत ही अच्छा लगा, क्या ये माला मुझे सकता है | #PanchayatiRajDay pic.twitter.com/rbcrs8hwaXpic.twitter.com/5M5KttA6dL — Rabesh Kumar Singh (@RabeshKumar) April 24, 2018 आप का उपहार और स्नेह भरा पत्र पाकर मन प्रफुल्लित हो गया | इस माला रूपी उपहार और शुभकामना संदेश के लिए, आप का कोटि कोटि धन्यवाद #प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी 🙏@narendramodi @PMOIndia हम सब आम लोगों तक आप का ये स्नेह अएसे ही पहुँचता रहे 🙏#जय_हिन्द #जय_भारत #भारत_माता_की_जय pic.twitter.com/1F1i0UEwYi — Rabesh Kumar Singh (@RabeshKumar) May 2, 2018 -
సెల్ఫీ చంపేసింది
సుల్తాన్‌బజార్: సెల్ఫీ సరదా ఓ ఐఐటీ విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. స్నేహితులతో విహారయాత్రకు వెళ్లిన ఎంజే మార్కెట్‌కు చెందిన నరేన్(20) ఉత్తరాఖండ్‌లోని చల్లా వాటర్‌డ్యామ్ వద్ద సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు అందులోపడి మృతి చెందాడు. ఈ నెల 18న డ్యామ్‌లోపడి గల్లంతు కాగా సోమవారం మృతదేహం దొరికింది. వివరాలు.. మాధవి, రాజేంద్రమోహన్ దంపతులు మోజంజాహి మార్కెట్లో నివాసముంటున్నారు. రాజేంద్రమోహన్ జూబ్లీహిల్స్‌లోని శౌర్యభవన్‌లో స్పెషల్ పోలీస్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి నరేన్ ఒక్కగానొక్క సంతానం. ఢిల్లీలో ఐఐటీ ప్రథమ సంవత్సరం చదువుతున్న నరేన్ తన 8 మంది స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం బయలు దేరారు. ఈ నెల 18న ఉత్తరాఖండ్‌లోని చెల్లా డ్యామ్ వద్ద సరదాగా సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు డ్యామ్‌లో పడి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఉత్తరాఖండ్‌కు బయలుదేరారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలను విస్తృతం చేశారు. మూడు రోజుల తరువాత పోలీసులు నరేన్ మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నరేన్ మృతితో ఎంజేమార్కెట్‌లో విషాదఛాయలు నెలకొన్నాయి. -
వాటర్ ట్యాంక్‌లో ఐఐటీ విద్యార్థి శవం
-
కటకటాలపాలైన ఐఐటీ విద్యార్థి
ధన్‌బాద్: ఈవ్ టీజింగ్ చేసినందుకు ఒక ఐఐటీ రీసెర్చ్ ఫెలో కటకటాల పాలయ్యాడు. ఈఘటన జార్ఖండ్ లోని ధన్‌బాద్ జిల్లా ఐఐటీ స్కూల్ ఆఫ్ మైన్స్ లో చోటుచేసుకుంది. పెట్రోలియం ఇంజినీరింగ్ డిపార్ట్ మెంటులోని పరిశోధక విద్యార్థి ప్రకాశ్ కుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించాడని తోటి విద్యార్థినులు కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశ్ పై ఎఫ్ఐఆర్ ను నమోదు చేసిన పోలీసులు అతన్ని న్యాయమూర్తి ఎదుటు హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ ను విధించారు. ప్రకాశ్ పోలీసులను కూడా బెదిరించడం గమనార్హం. -
ఐఐటీ విద్యార్థిని అదృశ్యం
హిమాలయాలకు వెళ్తున్నట్టు ఉత్తరం చెన్నై, సాక్షి ప్రతినిధి: అత్యున్నత ఉద్యోగాలకు బాటవేసే ఐఐటీ చదువును ఆపివేసి ఆధ్యాత్మిక జీవనం వైపు పయనమైందో విద్యార్థిని. ‘ఆధ్యాత్మిక జీవనం తన మనస్సును లాగుతోంది, హిమాలయాలకు వెళ్తున్నా’ అంటూ ఉత్తరం రాసిపెట్టి మరీ అదృశ్యమైంది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన ప్రత్యూష (20) మద్రాసు అడయారులోని ఐఐటీలో కళాశాలలో ఎంఎస్ రెండో సంవత్సరం చదువుతోంది. ఐఐటీ ప్రాంగణంలోనే ఉన్న సబర్మతి హాస్టల్లో ఉంటోంది. ప్రత్యూష రెండ్రోజులుగా కనిపించడం లేదు. ఆందోళనకు గురైన రూమ్మేట్స్ హాస్టల్ వార్డన్‌కు మంగళవారం సమాచారమిచ్చారు. వార్డన్ వెంటనే కొట్టూరుపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ ప్రారంభించిన పోలీసులు ప్రత్యూష ఉంటున్న హాస్టల్ గదిలో తనిఖీలు నిర్వహించగా తెలుగు, ఇంగ్లిషులో రాసిన ఉత్తరం దొరికింది. ‘ఆధ్యాత్మిక జీవనంపై రోజురోజుకూ నాకు ఆసక్తి పెరుగుతోంది, ఈ కారణంగా ఆధ్యాత్మిక జీవనాన్ని అన్వేషిస్తూ హిమాలయాలకు వెళుతున్నా. నాకోసం వెతకవద్దు, తల్లిదండ్రులకు ఈ సమాచారాన్ని ఇవ్వండి’ అంటూ ఉత్తరంలో రాసింది. ఈ నెల 17వ తేదీ తెల్లవారుజామున ప్రత్యూష హాస్టల్‌ను ఖాళీ చేసి వెళ్లిందని, అయితే ఆమె స్వస్థలానికి చేరుకోలేదని తెలియడంతో తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని మంగళవారం రాత్రి మద్రాసు ఐఐటీ ఒక ప్రకటన విడుదల చేసింది. -
సంక్రాంతికి వస్తాడని...
⇒ కుమారుడి రాక కోసం ఎదురుచూస్తుండగా మృతి వార్త ⇒ కుప్పకూలిన తల్లిదండ్రులు ⇒ మృతుడు గౌహతి ఐఐటీ విద్యార్థి.. ⇒ ఉరివేసుకొని హాస్టల్లో ఆత్మహత్య ⇒ చిన్నతనం నుంచి చదువులో రాణింపు కె.కోటపాడు: ‘అమ్మా.. నాన్నా.. సంక్రాంతి పండగకు వస్తా..’ అని సంతోషంగా చెప్పిన కొన్ని గంటలకే కొడుకు చావు వార్త వినాల్సి వస్తుందని ఆ తల్లిదండ్రులు కలలో కూడా ఊహించి ఉండరు. త్వరలో చదువు పూర్తవుతుందని, విదేశాల్లో ఉన్నత ఉద్యోగంలో స్థిరపడతారని వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో ఆత్మహత్య చేసుకున్నట్లు గురువారం ఫోన్ రావడంతో కుప్పకూలిపోయారు. కె.కోటపాడు గ్రామానికి చెందిన కాకి పరమేశ్వరరావు (22) అస్సాం రాష్ట్రం, గౌహతి ఐఐటీలో బి.టెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అక్కడ ఏ కష్టమొచ్చిందో ఏమో గురువారం కళాశాల హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరమేశ్వరరావు ఉదయం నుండి హాస్టల్ గదిలో నుండి బయటకు రాకపోవడంతో అనుమానించిన స్నేహితులు తలుపుకొట్టినా తెరవలేదు. దీంతో వారు వెంటిలేటర్ నుండి చూడగా ఫ్యాన్‌కు వేళాడుతూ కనిపించాడు. కుటుంబ సభ్యులకు సమాచారాన్ని అక్కడ నుండి ఫోన్లో హిందీలో తెలపడంతో తల్లి పార్వతికి అర్ధం కాలేదు. కాసేపటికి ఇంటికి వచ్చిన భర్త వెంకటరావుకు హిందీలో ఎవరో ఫోన్ చేశారని చెప్పింది. ఆయన కళాశాలకు తిరిగి ఫోన్ చేయగా కుమారుడు మృతి చెందాడని తెలియడంతో కుప్పకూలారు. చదువుల్లో ఎప్పుడూ ప్రథమమే పరమేశ్వరరావు చిన్నప్పటినుండి చదువులో ఎప్పుడూ ఫస్టే. కె.కోటపాడు వేణు విద్యానికేతన్‌లో 5 వరకు చదివి కొమ్మాది నవోదయలో సీటు సాధించి అక్కడ చేరాడు. అక్కడ 10వ తరగతి పరిక్షల్లో 94.6శాతం మార్కులతో పాఠశాల టాపర్‌గా నిలిచాడు. తరువాత విశాఖపట్నం శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ ఎంపీసీ చదివి 950 మార్కులతో ఉత్తీర్ణత సాధించి గౌహతి ఐఐటీలో సీటు పొందాడు. అక్కడ బి.టెక్ (మెకానికల్) పైనల్ ఇయర్ చదువుతున్నాడు. అక్క పెళ్లికి వచ్చాడు పరమేశ్వరరావు ఈ ఏడాది మార్చిలో జరిగిన అక్క లక్ష్మి వివాహానికి వచ్చి తిరిగి కళాశాలకు వెళ్లిపోయాడు. సంక్రాంతి పండగకు జనవరి 9న వస్తానంటూ తల్లి దండ్రులకు బుధవారమే ఫోన్ చేసి చెప్పాడు. అంతలోనే తమ ఒక్కగానొక కొడుకు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లి దండ్రులను ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. వీరికి మొత్తం ముగ్గురు సంతానం. పెద్దమ్మాయికి వివాహం కాగా, చిన్నమ్మాయి యమున రాజమండ్రిలో ఇంటర్ చదువుతోంది. -
విగతజీవిగా మారిన ఐఐటీ విద్యార్థి
మధ్యప్రదేశ్: ఐఐటీ చదువుతున్న18ఏళ్ల విద్యార్థి అనుమానస్పద స్థితిలో విగతజీవిగా మారిన ఘటన మధ్యప్రదేశ్‌లోని మహావీరనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. మృతుడు శివపూరి ప్రాంతానికి చెందిన సుభాన్షు ఖారే అనే ఐఐటీ విద్యార్థిగా పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. స్నేహితుడి రూంలో రాత్రి నిద్రపోయిన అతడు ఉదయాన్నే అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. అతని మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థి మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పోస్టుమార్టం నిర్వహించిన తరువాతే ఏ విషయమైనది కనిపెడతామని పోలీసులు చెప్పారు. కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు నివ్వేరపోయారు. విగతజీవిగా పడివున్న తమ కుమారుడిని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ వంటి ఏ ఆధారాలు దొరకలేదని పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
వయసు 20.. వేతనం రెండు కోట్లు!
జైపూర్: ఈమధ్య కాలంలో విద్యార్థులు తమ వార్షిక వేతనాల్లో మెరుస్తున్నారు. ఐఐటీల్లో ప్రతిభ చాటుతున్నవిద్యార్థులు తమ వార్షిక వేతనాలను కూడా అంతే స్థాయిలో చేజిక్కించుకుంటున్నారు. తాజాగా ముంబై ఐఐటీకి చెందిన విద్యార్థినికి అక్షరాలా రెండు కోట్ల రూపాయిలను ఆఫర్ చేసింది సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్. ముంబైలో నాల్గో సంవత్సరం చదువుతున్న ఆస్తా అగర్వాల్(20) ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకుని భళా అనిపించింది. గత మే, జూన్ లలో థర్డ్ ఇయర్ ఇంటర్నెన్ షిప్ ను కాలిఫోర్నియాలో ఫేస్ బుక్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో పూర్తి చేసిన అగర్వాల్.. ఐఐటీ ముంబైలో నాల్గో సంవత్సరాన్ని పూర్తి చేస్తోంది. తన ఎనిమిదో సెమిష్టర్ పూర్తి కాకుండానే అత్యధిక వార్షిక వేతనంతో ఫేస్ బుక్ ఆఫర్ రావడం పట్ల ఆ విద్యార్థిని ఆనందంలో మునిగితేలుతుంది. తన స్వస్థలం జైపూర్ అని.. వచ్చే అక్టోబర్ లో ఉద్యోగంలో జాయిన్ అవుతానని స్పష్టం చేసింది. -
టీచర్ నగ్నచిత్రాలు నెట్లో పెట్టిన ఐఐటీ విద్యార్థి
బిలాస్పూర్ జిల్లాకు చెందిన సుర్జీత్ కుమార్ జైన్ (18) కష్టపడి చదివి ఐఐటీలో సీటు సంపాదించాడు. అయితే బుద్ధి మాత్రం వక్రమార్గం పట్టింది. అదే జిల్లాకు చెందిన మహిళ ఉపాధ్యాయురాలి నగ్న పోటోలను ఇంటర్నెట్లో పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. ఆ విషయం తెలిసిన సదరు ఉపాధ్యాయురాలు పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఆధారంగా పోటోలు ఖరగ్‌పూర్ ఐఐటీ ప్రాంగణంలో సుర్జీత్ కుమార్ జైన్ అప్లోడ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఖరగ్‌పూర్ ఐఐటీ చేరుకున్నారు. సుర్జీత్ కుమార్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ రెండవ సంవత్సరం చదువుతున్నాడని, అయితే గత రెండు నెలలుగా అతడు తరగతులకు హాజరుకావడం లేదని సదరు ఐఐటీ డైరెక్టర్ తపన్ గోషాల్ పోలీసులకు వెల్లడించారు. దాంతో నిందితుని ఆచూకీ కోసం పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు. -
విశాఖలో ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
బాంబే ఐఐటీలో పీహెచ్డీ చేస్తున్న హైదరాబాద్ వాసి శివతేజ శాస్త్రవేత్త కావాలనుకుని అంతలోనే అనంత వాయువుల్లోకి పాలిథిన్ కవరు తలకు చుట్టుకుని, టేప్ అతికించుకుని బలవన్మరణం! చదివేది ముంబైలో.. నివాసం హైదరాబాద్‌లో.. కానీ, విశాఖలో ఆత్మహత్య చేసుకోవడంపై సందేహం అనుమానాస్పద మృతిగా కేసు నమోదు సాక్షి, హైదరాబాద్, విశాఖపట్నం, ముంబై: అతను చదువుల్లో టాప్.. ఎందరో కలలుగనే ముంబై ఐఐటీలో సులువుగా సీటు తెచ్చుకున్నాడు.. బాగా చదివి సైంటిస్ట్‌గా కావాలనుకున్నాడు.. ఆ దిశగా వేగంగా ముందుకు సాగాడు.. తన ఆశయాలకు కుటుంబం నుంచి కావలసినంత తోడ్పాటూ ఉంది.. ఉన్నట్లుండి ఏమైందోగానీ, బతుకుపై విరక్తి పెంచుకున్నాడు. బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు.. హైదరాబాద్‌కు చెందిన మొలకల శివతేజ (26) అనే ఐఐటీ విద్యార్థి వ్యథ ఇది.. అయితే, ఏ సమస్యలూ లేని శివతేజ ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. శివతేజ చదువుకునేది ముంబైలో.. స్వస్థలం హైదరాబాద్.. కానీ, విశాఖపట్నంలోని ఒక లాడ్జిలో ఆయన మృతి చెందడంపై సందేహాలు వస్తున్నాయి. కడప జిల్లా తొండూరు మండలం కొరుగుంట్లపల్లికి చెందిన మొలకల రాజశేఖర్‌రెడ్డి, ఉషారాణి దంపతులు కొన్నేళ్ల కింద హైదరాబాద్‌కు వలస వచ్చారు. రాజశేఖర్‌రెడ్డి ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సంస్థలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి కాప్రా ప్రాంతంలోని శ్రీరాంనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు శివతేజ. చిన్నప్పటి నుంచీ చదువులో చురుకుగా ఉన్న శివతేజ.. పదోతరగతి తరువాత రామయ్య ఇన్స్టిట్యూట్లో ఇంటర్‌తో పాటు ఐఐటీ శిక్షణ పొందాడు. ఐఐటీ ఎంట్రెన్స్‌లో 120వ ర్యాంక్ సాధించి, ముంబై ఐఐటీలో చేరాడు. అక్కడే ఎంటెక్ కూడా పూర్తి చేసిన శివతేజ ప్రస్తుతం పీహెచ్డీ చేస్తున్నాడు. చదువులోనూ ఎప్పుడూ చురుకుగా ఉంటాడు. కానీ, అకస్మాత్తుగా విశాఖపట్నంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంక్రాంతి శుభాకాంక్షలు చెబుదామని... సంక్రాంతి సందర్భంగా శివతేజకు శుభాకాంక్షలు చెప్పేందుకు 13వ తేదీన తల్లిదండ్రులు ప్రయత్నించారు. కానీ, రెండు రోజుల పాటు ప్రయత్నించినా.. ఫోన్ కలవలేదు. ముంబైలోని హాస్టల్‌కు ఫోన్‌చేస్తే.. అక్కడ లేడని సమాధానం వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ముంబై ఐఐటీకి వెళ్లి.. హాస్టల్లో, స్నేహితులను అందరినీ అడిగారు. ఆచూకీ తెలియకపోవడంతో.. ఈ నెల 16న ముంబైలో మిస్సింగ్ కేసు పెట్టారు. ఇదంతా జరుగుతుండగానే శనివారం ఉదయం విశాఖ పోలీసుల నుంచి వారికి తేజ మరణవార్త అందింది. ఆత్మహత్య చేసుకున్న స్థలంలో లభ్యమైన పాన్ కార్డు, ఐఐటీ బాంబే గుర్తింపు కార్డు, పర్సు సహాయంతో.. పోలీసులు మృతుడిని గుర్తించి సమాచారం ఇచ్చారు. ఏం జరిగింది? శివతేజ ఈ నెల 16వ తేదీన విశాఖపట్నంలో అశ్విని లాడ్జిలోని ఒక గదిలో దిగాడు. మరుసటి రోజు 17న మధ్యాహ్నం రిసెప్షన్లో వాటర్ బాటిల్ తీసుకున్నాడు. అయితే, అదే రోజు రాత్రి లాడ్జి సిబ్బంది భోజనం కోసం తలుపుకొట్టినా, తెరవలేదు. దాంతో నిద్రపోయి ఉంటాడని భావించి సిబ్బంది పట్టించుకోలేదు. 18వ తేదీ ఉదయం కూడా ఎంతసేపు తలుపుకొట్టినా.. తెరవకపోవడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా... బాత్రూమ్లో శివతేజ మృతదేహం కనిపించింది. మృతదేహం తలపై నుంచి మెడవరకు పాలిథిన్ కవరు చుట్టి, గట్టిగా టేపుతో అతికించి ఉంది. చేతి వేళ్లకూ టేపు అతికించి ఉంది. ఘటనా స్థలంలో రెండు కత్తులు, టేప్, పాలిథిన్ కవర్ లభించాయి. అనుమానాస్పద మృతిగా... శివతేజ ముంబైలో చదువుతున్నా.. అక్కడ పెద్దగా స్నేహితులు లేరని పోలీసులు చెబుతున్నారు. చదువులోనూ చురుకు.. ఆర్థిక సమస్యలు కూడా లేవని అంటున్నారు. ఎలాంటి దుర్వ్యసనాలూ లేవని తేల్చారు. తేజ విశాఖకు వచ్చే ముందు బ్యాంకులోంచి కేవలం రూ. ఏడు వేలు మాత్రమే విత్‌డ్రా చేసుకుని వచ్చాడు. అయితే, ఒకవేళ ఏదైనా ప్రేమ వ్యవహారంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. శివతేజ మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, మెయిల్స్‌తో పాటు ఫేస్బుక్ అకౌంట్‌నూ పోలీసులు పరిశీలించారు. కానీ, అనుమానించదగ్గ అంశాలేవీ కనిపించలేదని తెలుస్తోంది. కానీ, ఘటనా స్థలంలో మాత్రం రెండు కత్తులు, టేప్, పాలిథిన్ కవర్ లభించాయి. దాంతో పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. శత్రువులెవరూ లేరు: శివతేజ తండ్రి రాజశేఖర్ ‘‘తేజ అసలు విశాఖ ఎందుకు వచ్చాడో అంతుపట్టడం లేదు. నా కుమారుడికి ఎవరితోనూ శత్రుత్వం, వివాదాలు లేవు. చక్కగా చదువుకుంటాడు. ఎప్పుడూ మాతో మాట్లాడేవాడు ఫోన్ ఎందుకు ఎత్తలేదో తెలియక ముంబై వెళ్లాం. అక్కడ లేడు. కొద్దిరోజుల కింద తన పీహెచ్డీ రిపోర్ట్ చాలా బాగుందని ప్రొఫెసర్ ప్రశంసించారని కూడా చెప్పాడు. కానీ, ఇలా జరగడమేమిటో అర్థం కావడంలేదు.’’ కారణాలేమిటో బయటకు తేవాలి: రామయ్య ‘‘బాగా చదువుకొనే పిల్లలు ఇలా ఆత్మహత్యలకు పాల్పడడం బాధ కలిగిస్తోంది. శివతేజ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడవలసి వచ్చిందో తెలియాలి. ఇందుకోసం ఒక కమిటీ వేసి సమగ్ర దర్యాఫ్తు చేపట్టాలి. ఒక్క శివతేజ అంశమే కాదు.. ఐఐటీల్లో చదివే విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలను తెలుసుకోవాలి. ఐఐటీల్లో చదివేవారు ఎలాంటి పరిస్థితులనైనా ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి.’’ ఇంటర్నెట్ వీడియోలు చూసి.. చదువులో ఎంతో చురుకుగా ఉండే శివతేజ ఇంటర్నెట్లో ఆత్మహత్యల వీడియోలు చూసి, ఆ తరహాలో బలవన్మరణానికి పాల్పడ్డట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటివరకూ విదేశాల్లో మాత్రమే అలాంటి ఆత్మహత్యలు జరిగాయి. శివతేజ తలపై నుంచి మెడవరకు చుట్టూ గట్టి పాలిథిన్ కవర్‌ను నాలుగైదు చుట్లు గట్టిగా బిగించుకున్నాడు. గాలి చొరబడకుండా దాన్ని టేపుతో అతికించుకున్నాడు. తర్వాత చేతివేళ్లన్నింటిని కలిపి టేపు చుట్టుకున్నాడు. పాలిథిన్ కవరును గట్టిగా బిగించుకోవడం వల్ల ఊపిరాడక మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే, మృతిపై అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.