
ముంబై : ఓ మహిళ స్నానం చేస్తుండగా ఫోటోలు తీయడానికి ప్రయత్నించిన ఓ ఐఐటీ స్టూడెంట్‌ని థానే పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. బాంబే ఐఐటీలో చదువుతున్న అవినాష్ కుమార్ యాదవ్ థానేలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే అతని బుర్రలో ఏ పురుగు దూరిందో తెలీదు కానీ.. పక్క ప్లాట్ బాత్‌రూమ్‌లో మొబైల్ ఫోన్‌ను అమర్చాడు. ఈ క్రమంలో సదరు ప్లాట్‌లో నివాసం ఉంటున్న మహిళ స్నానం చేయడానికి వెళ్లినప్పుడు బాత్‌రూమ్ కిటికిలో సెల్‌ఫోన్ ఉండటాన్ని గమనించింది. వెంటనే ఆమె ఈ విషయాన్ని భర్తకు తెలిపింది. ఆ సమయంలో అవినాష్ అక్కడే తచ్చాడుతుండటంతో అనుమానం వచ్చి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా పరారయ్యాడు. మొబైల్‌ను స్వాధీనం చేసుకుని చూడగా ... అపార్ట్‌మెంట్‌కు చెందిన మహిళలతో పాటు స్నానం చేస్తున్న పురుషుల ఫోటోలు కూడా ఉన్నాయి. దాంతో వారు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అవినాష్ మీద ఫిర్యాదు చేయగా, సెక్షన్ 354 కింద పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.