గువహతి: ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరతానని సోషల్ మీడియాలో ప్రకటించడంతో పాటు ఈ మెయిల్స్ చేసిన ఐఐటీ గువహతి విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన తర్వాత ఆ విద్యార్థి ఎక్కడికెళ్లాడో ఆజూకీ తెలియలేదు. తర్వాత పోలీసులు గాలించి అస్సాంలోని కమ్రుప్ జిల్లాలో అతడిని పట్టుకున్నారు.
ఐసిస్ ఇండియా చీఫ్ హరిస్ ఫరూకీ అలియాస్ హరీష్ అజ్మల్ ఫరూకీ అతని అనుచరుడు అనురాగ్ సింగ్ అలియాస్ రెహాన్ అస్సాంలోని ధుబ్రిలో అరెస్టయిన నాలుగు రోజుల తర్వాత మిస్సైన విద్యార్థి ఆజూకీని పోలీసులు కనుగొనడం గమనార్హం. ‘ విద్యార్థి పంపిన మెయిల్స్ నిజమైనవేనని ధృవీకరించుకుని దర్యాప్తు ప్రారంభించాం.
ట్రావెలింగ్‌లో ఉండగా ఆ విద్యార్థిని పట్టుకున్నాం. అరెస్టు చేసి ప్రాథమికంగా విచారించాం. చట్ట ప్రకారం అతడిపై చర్యలు తీసుకుంటాం. ఐసిస్ నల్ల జెండాతో పాటు ఐసిస్ మనుస్క్రిప్ట్ విద్యార్థి హాస్టల్ రూమ్‌లో దొరికింది. విద్యార్థి డిల్లీలోని ఓక్లాకు చెందినవాడు’అని అస్సాం పోలీసులు తెలిపారు.
Reference @IITGuwahati student pledging allegiance to ISIS - the said student has been detained while travelling and further lawful follow up would take place. @assampolice @CMOfficeAssam @HMOIndia
— GP Singh (@gpsinghips) March 23, 2024
Comments
Please login to add a commentAdd a comment