సాక్షి, వరంగల్: జిల్లాలోని హసన్‌పర్తికి చెందిన మేకల అంజలికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు సోమవారం ఆర్థిక సాయం అందించారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఐఐటీలో చదువుతున్న అంజలి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలోకి ప్రవేశించింది. దీంతో ఆమెకు ఫీజులు, లాప్‌టాప్ ఖరీదు, ఇతర ఖర్చుల నిమిత్తం రూ.1,50,000 రూపాయలను అందించారు. కాగా అంజలి గతేడాది హసన్‌పర్తిలోని గురుకులంలో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకొని ఐఐటీలో మంచి ర్యాంకు సాధించింది. అయితే తన కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమేనని, పై చదువుల నిమిత్తం తనకు సహాయం అందించాల్సిందిగా మంత్రి కేటీఆర్‌కు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. (మాకు సాయం అందించండి)
అప్పుడు దీనిపై వెంటనే స్పందించిన కేటీఆర్ గత సంవత్సరం సైతం ఫీజుల నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయం అందించారు. అంజలి తండ్రి రమేష్ ఆటో డ్రైవర్ కావడంతో ఐఐటీ విద్య పూర్తయ్యే వరకు అవసరమైన నిధులను వ్యక్తిగతంగా అందజేస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు అంజలి రెండో సంవత్సరానికి సంబంధించిన ఖర్చులను నేడు ప్రగతి భవన్‌లో అంజలికి అందజేశారు. కేటీఆర్ చేసిన సాయానికి అంజలి కుటుంబం ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. (‘ఆస్క్ కేటీఆర్’పేరిట ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో కేటీఆర్ సంభాషణ)
Comments
Please login to add a commentAdd a comment