సాక్షి,వరంగల్: మహిళల మెడలో తాళిబొట్టు కొట్టేసే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని కేటీఆర్ విమర్శించారు. వరంగల్‌లో బుధవారం(మే22) జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులు ఉప ఎన్నిక ప్రచార సభలో కేటీఆర్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలైనవి.
మంగళవారం ఎంజీఎం ఆసుపత్రిలో 5గంటల విద్యుత్ నిలిపోయింది. రూ.2లక్షల రుణమాఫీ కాలేదు. రైతులకు రైతుబంధు రాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. వరికి రూ. 500 బోనస్ దక్కలేదు. రాష్ట్రంలో మోసాల పరంపర సాగుతోంది. కాంగ్రెస్ నాయకులు పచ్చి మోసగాళ్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలంటే... పట్టభద్రుల ఎమ్మెల్సీగా రాకేష్‌రెడ్డిని గెలిపించాలి.
420 హామీలతో అధికారంలోకి వచ్చారు. కొత్త పరిశ్రమలను తీసుకువచ్చే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు. ఉన్న కంపెనీలను కాపాడుకునే సత్తా లేని నాయకులు కాంగ్రెస్ నాయకులు. తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు గెలిస్తే చట్టసభలు బూతు మాటలకు వేదిక అవుతుంది’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment