సాక్షి,రాజన్నసిరిసిల్లజిల్లా:నేను రాజకీయాల్లోకి రాకముందు ఐటీ సౌత్ ఇండియా హెడ్‌గా పనిచేసింది నిజమేనని, మరి అప్పుడు సీఎం రేవంత్ ఏం చేసేవాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. సిరిసిల్లలో కేటీఆర్ శుక్రవారం(జనవరి24) మీడియాతో మాట్లాడారు.
‘ సీఎం రేవంత్‌రెడ్డివి అహంకారపూరిత మాటలు. నేను ఐటీలో ఉన్నపుడు రేవంత్ ఏం చేసిండు..? బ్రోకరిజమా, సూట్ కేసులు మోసుడా..ఇవన్నీ నేనంటే మళ్ళీ నాపై ఏడుపొకటి.ఎవరైనా బీఆర్‌ఎస్‌ను వీడితే కేసీఆర్ అన్నట్టు వారి గ్రహచారం బాగా లేకపోవడమే. నేను మళ్ళీ చెబుతున్నా.నాపై పెట్టినవి లొట్టపీసు కేసులు.
లై డిటెక్టర్ పెట్టి విచారణ చేసుకోమని నేనే సవాల్ విసురుతున్నా. ప్రజాపాలన సభల్లో జనం ఎందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.స్పష్టత లేకుండా గ్రామసభలు నిర్వహిస్తే జనం తిరగబడ్డారు.పథకాల అమలు చేతగాక కాంగ్రెస్ మంత్రులు ఇతర పార్టీలపై బురద జల్లుతున్నారు’అని కేటీఆర్ విమర్శించారు.
కాగా, దావోస్ పర్యటనలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కేటీఆర్‌ది కేవలం ఐటీ ఉద్యోగి మెంటాలిటీ అని తాను పాలసీ మేకర్‌నని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ఐటీ రంగంలోని ఉద్యోగ వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై ఎక్స్(ట్విటర్)లో స్పందించిన కేటీఆర్ తాజాగా నేరుగా రేవంత్‌కు కౌంటర్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment