సాక్షి,హైదరాబాద్: సొంత పార్టీ (కాంగ్రెస్) ఎమ్మెల్సీ తీన్మార్‌మల్లన్నకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గెలుపు ఓటములను ప్రజలు నిర్ణయిస్తారని, వ్యక్తుల కాదన్నారు.మంగళవారం(ఫిబ్రవరి4) కోమటిరెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో ఈ విషయమై మాట్లాడారు.
‘తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ బీ ఫాం నాకే ఇచ్చారు. అప్పుడుపెద్ద ర్యాలీ చేశాం. మంత్రిగా ఉండి జిల్లాలో ఎమ్మెల్సీ ఓడిపోవాలని ఎవరైనా కోరుకుంటారా. బీసీ మీటింగ్ పెట్టి మల్లన్న ఇతర కులాలను తిట్టడం ఏంటి.బీసీల కోసం కాంగ్రెస్ గొప్ప నిర్ణయం తీసుకుంది.కాంగ్రెస్ బీ ఫాం మీద గెలిచిన తీన్మార్ మల్లన్న మాపై లేని పోని ఆరోపణలు చేస్తున్నారు.
మల్లన్న నన్ను తిడితే స్వాగతిస్తా. కానీ ఎవరైనా సరే ఓక కులాన్ని తిట్టడం కరక్ట్ కాదు. ఇక కేసీఆర్,కేటీఆర్,హరీష్‌రావు ఆస్తులు రాయాలంటే ఒక పుస్తకం కావాలి.అందుకే కులగణన సర్వేలో కవిత మినహా కేసీఆర్ ఫ్యామిలీ పాల్గొనలేదు.
అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం.కేంద్రం ఓకే అంటే ఓకే..లేదంటే మా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తాం.ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు.ఎస్సీ వర్గీకరణ కోసం ఈనెలలోనే మరో రోజు సభ పెడుతాం’అని కోమటిరెడ్డి తెలిపారు.
తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు..?
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే యోచనలో టీపీసీసీ ఉంది. త్వరలో తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు ఇచ్చేందుకు క్రమశిక్షణ కమిటీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తీన్మార్ మల్లన్నపై పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‌కు నాయకులు, కార్యకర్తల నుంచి వస్తున్న ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల మల్లన్న ఓ బహిరంగ సభలో బీసీ కులగణన సహా పలు అంశాలపై పార్టీ విధానాలకు విరుద్ధంగా మాట్లాడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment