నల్లగొండ టీ హబ్‌కు తాళం వేయించిందే కేటీఆర్‌: కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు | Minister Komatireddy Venkatreddy Comments On KTR | Sakshi

కేటీఆర్‌పై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jan 29 2025 11:37 AM | Updated on Jan 29 2025 1:27 PM

Minister Komatireddy Venkatreddy Comments On KTR

సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నల్లగొండ బీఆర్‌ఎస్‌ రైతు ధర్నాలో చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. పదేళ్లుగా నల్లగొండను పట్టించుకోకుండా.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వచ్చారంటూ కేటీఆర్‌ను ప్రశ్నించారాయన. బుధవారం(జనవరి29) కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. 

‘కేటీఆర్ పనికిరానోడు.. పనికి రాని మాటలు మాట్లాడుతున్నాడు. నల్లగొండలో కేటీఆర్ మీటింగ్‌కు మా మీటింగ్ కు వచ్చే పల్లీలు,ఐస్ క్రీం లు అమ్ముకునే వారు వచ్చేంత మంది కూడా రాలేదు. నల్లగొండలో టీ హాబ్‌కు తాళం వేసిందే కేటీఆర్. ఎస్‌ఎల్‌బీసీ ఎందుకు పూర్తి చేయలేకపోయారు? కంపెనీలు ఎందుకు తేలేకపోయారు. హరీష్‌రావు, కేటీఆర్‌ మీరు నా కాలి గోటికి కూడా సరిపోరు. కేటీఆర్ నీలాగా నాపై అవినీతి ఆరోపణలు లేవు. లక్షల కోట్లు సంపాదించుకోలేదు. కేసీఆర్ లాగా నేను ఎలక్షన్, కలెక్షన్ చేయలేదు. నేను మాట్లాడితే బీఆర్‌ఎస్‌ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

ప్రతిపక్ష నేత పదవి కోసం హరీష్ రావు, కేటీఆర్ కత్తులతో పొడుచుకుంటున్నారు. గతంలో ప్రతిపక్ష నేతగా భట్టి పాదయాత్ర చేసి..ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. బడ్జెట్ సెషన్‌కు కేసీఆర్‌ వస్తడో రాడో చెప్పాలి.తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నరా? బండి సంజయ్ ఉన్నరా? గద్దర్‌కు అవార్డ్ ఇస్తే తప్పేంటి? కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్‌ అలా మాట్లాడకుండా ఉండాల్సింది.

.. కేసీఆర్‌ కంటే లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ఎంతో నయం అని కోమటిరెడ్డి అన్నారు. లాలూ జైల్లో​ ఉన్నప్పుడు.. బయట ఉన్న ఆయన కొడుకులు ఎంపీ సీట్లు గెలిపించారు. కానీ,  కేటీఆర్‌ ఒక్క సీటు అయినా గెలిచారా? కేటీఆర్‌ ప్లేస్‌లో నేను ఉంటే.. ఈపాటికి బీఆర్‌ఎస్‌ దుకాణం క్లోజ్‌ చేసేవాడ్ని అని కోమటిరెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement