
వయసు 20.. వేతనం రెండు కోట్లు!
జైపూర్: ఈమధ్య కాలంలో విద్యార్థులు తమ వార్షిక వేతనాల్లో మెరుస్తున్నారు. ఐఐటీల్లో ప్రతిభ చాటుతున్నవిద్యార్థులు తమ వార్షిక వేతనాలను కూడా అంతే స్థాయిలో చేజిక్కించుకుంటున్నారు. తాజాగా ముంబై ఐఐటీకి చెందిన విద్యార్థినికి అక్షరాలా రెండు కోట్ల రూపాయిలను ఆఫర్ చేసింది సోషల్ నెట్ వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్. ముంబైలో నాల్గో సంవత్సరం చదువుతున్న ఆస్తా అగర్వాల్(20) ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకుని భళా అనిపించింది.
గత మే, జూన్ లలో థర్డ్ ఇయర్ ఇంటర్నెన్ షిప్ ను కాలిఫోర్నియాలో ఫేస్ బుక్ కంపెనీ ప్రధాన కార్యాలయంలో పూర్తి చేసిన అగర్వాల్.. ఐఐటీ ముంబైలో నాల్గో సంవత్సరాన్ని పూర్తి చేస్తోంది. తన ఎనిమిదో సెమిష్టర్ పూర్తి కాకుండానే అత్యధిక వార్షిక వేతనంతో ఫేస్ బుక్ ఆఫర్ రావడం పట్ల ఆ విద్యార్థిని ఆనందంలో మునిగితేలుతుంది. తన స్వస్థలం జైపూర్ అని.. వచ్చే అక్టోబర్ లో ఉద్యోగంలో జాయిన్ అవుతానని స్పష్టం చేసింది.