
ప్రతీకాత్మక చిత్రం
తిరువొత్తియూరు(చెన్నై): చెన్నై ఐఐటీలో చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపుల కేసులో ఇన్నాళ్లూ పరారీలో ఉన్న ఓ పూర్వ విద్యార్థిని ప్రత్యేక బృందం పోలీసులు పశ్చిమ బెంగాల్‌లో అరెస్టు చేశారు. వివరాలు.. చెన్నై ఐఐటీలో చదువుతున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ విద్యార్థినిని అదే కళాశాలలో చదువుతున్న సింగ్ షేక్ దేవ్‌శర్మ ప్రేమించి వివాహం చేసుకుంటానంటూ నమ్మించాడు. 2017లో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన స్నేహితులు శుభ దీప్ బెనర్జీ, మలాయి క్రిస్టియన్ మహాకు కూడా ఇందులో పాత్ర ఉన్నట్లు తెలిసింది. అప్పట్లో బాధిత విద్యార్థిని అధ్యాపకుడు ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.
అయితే దీనిపై ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో సింగ్ షేక్ దేవ్‌శర్మ కళాశాల ప్రాంగణంలోనే విద్యార్థినిని వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు 2020 జూలై 17న కేసు నమోదు చేశారు. దర్యాప్తులో విద్యార్థిని మనోవేదనతో మూడుసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఈక్రమంలో సహా విద్యార్థులు ఆమెను రక్షించారు. కాగా అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఐఐటీ పూర్వ విద్యార్థి సింగ్ షేక్ దేవ్‌శర్మ (30)ని పశ్చిమబెంగాల్లో ప్రత్యేక బృందం పోలీసులు ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపరిచి సోమవారం ఉదయం చెన్నైకి తీసుకువచ్చారు. అలాగే మరో ఇద్దరి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment