ఈవ్ టీజింగ్ చేసినందుకు ఒక ఐఐటీ రీసెర్చ్ ఫెలో కటకటాల పాలయ్యాడు.
ధన్బాద్: ఈవ్ టీజింగ్ చేసినందుకు ఒక ఐఐటీ రీసెర్చ్ ఫెలో కటకటాల పాలయ్యాడు. ఈఘటన జార్ఖండ్ లోని ధన్బాద్ జిల్లా ఐఐటీ స్కూల్ ఆఫ్ మైన్స్ లో చోటుచేసుకుంది. పెట్రోలియం ఇంజినీరింగ్ డిపార్ట్ మెంటులోని పరిశోధక విద్యార్థి ప్రకాశ్ కుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించాడని తోటి విద్యార్థినులు కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశ్ పై ఎఫ్ఐఆర్ ను నమోదు చేసిన పోలీసులు అతన్ని న్యాయమూర్తి ఎదుటు హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ ను విధించారు. ప్రకాశ్ పోలీసులను కూడా బెదిరించడం గమనార్హం.