dhanbad
-
Supreme Court: ఆ విద్యార్థికి ఐఐటీ సీటివ్వండి
న్యూఢిల్లీ: నిరుపేద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివినా సమయానికి ప్రవేశరుసుం కట్టలేక ప్రతిష్టాత్మక ఐఐటీ ధన్బాద్లో సీటు కోల్పోయిన దళిత విద్యార్థికి సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. వెంటనే ఆ విద్యార్థి అతుల్ కుమార్‌కు సీటు ఇవ్వాలని ఐఐటీ ధన్‌బాద్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సోమవారం ఆదేశించింది. జూన్ 24వ తేదీ సాయంత్రం ఐదింటిలోపు అడ్మిషన్ ఫీజు రూ.17,500 కట్టలేకపోవడంతో బీటెక్ సీటు కోల్పోయిన తనకు న్యాయం చేయాలంటూ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెల్సిందే. ‘‘ విద్యార్థి ఆరోజు ఆన్లైన్లో ఫీజు చెల్లింపు కోసం మధ్యాహ్నం మూడు గంటలకే లాగిన్ అయ్యాడు. తర్వాత పదేపదే ఎస్ఎంఎస్లు, వాట్సాప్‌లో రిమైండ్లతో గడువును గుర్తుచేశాం’’ అని ఐఐటీ సీట్ల కేటాయింపు విభాగం వాదించింది. దీంతో సీజేఐ కలగజేసుకుని ‘‘మీరెందుకంతగా వ్యతిరేకిస్తున్నారు?. ఈ పిల్లాడికి ఏమైనా చేయగలవేమో చూడండి. ఆ డబ్బులే ఉంటే కట్టకుండా ఎందుకుంటాడు? అణగారిన వర్గాలకు చెందిన రోజువారీ కూలీ కుమారుడు. పైగా అతనిదిదారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబం. ఐఐటీలో సీటు కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. ప్రతిభగల ఇలాంటి విద్యార్థిని మనం ఊరకనే వదిలేయలేం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా సుప్రీంకోర్టుకు సంక్రమించిన అసాధారణ అధికారంతో మిమ్మల్ని ఆదేశిస్తున్నాం. ఇదే ఏడాది అదే బ్యాచ్ ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్ కోర్సులో విద్యార్థికి సీటివ్వండి. హాస్టల్ వసతి సహా అర్హతగల అన్ని ప్రయోజనాలు అతనికి అందేలా చూడండి’’ అని ఐఐటీ కాలేజీ విభాగాన్ని కోర్టు ఆదేశించింది. కిక్కిరిసిన కోర్టు హాలులో అంతసేపూ చేతులు కట్టుకుని నిలబడిన విద్యార్థితో ‘‘ ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో’’ అని సీజేఐ అన్నారు. బాగా చదువుతూ ఇంజనీరింగ్ చేస్తున్న అతని ఇద్దరు అన్నల బాగోగులు తదితరాల గురించి కూడా ఆయన ఆరాతీశారు.ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌జిల్లా టిటోరా గ్రామానికి చెందిన అతుల్ ఐఐటీ ధన్బాద్లో సీటు వచ్చినా పేదరికం కారణంగా డబ్బులు కట్టలేక నిస్సహాయుడయ్యాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు తలో చేయి వేసి నగదు సర్దినా చివరి నిమిషంలో ఆన్లైన్ చెల్లింపు విఫలమై ఫీజు కట్టలేకపోయాడు. జార్ఖండ్ హైకోర్టు లీగ్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించగా పరీక్షను ఐఐటీ మద్రాస్ నిర్వహించినందున మద్రాస్ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో మద్రాస్ హైకోర్టుకు వెళ్లారు. అక్కడ విచారణ నెమ్మదించడంతో ఈసారి నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. -
రైలులో వదంతులు.. కిందకు దూకి ప్రాణాలు కోల్పోయిన నలుగురు
వదంతులు.. ఎంతటివారినైనా ఒకింత ఆలోచింపజేస్తాయి. అదే ప్రమాదానికి సంబంధించిన వదంతులైతే దాని పరిణాలమాలు ఊహించని విధంగా ఉంటాయి. జార్ఖండ్‌లో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకోగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారుజార్ఖండ్లోని లాతేహార్‌లో రాంచీ-ససారం ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నదంటూ వదంతులు వ్యాపించడంతో ఆ రైలులోని పలువురు ప్రయాణికులు రైలు నుంచి దూకేశారు. ఈ సమయంలో ప్రయాణికులు అటుగా వస్తున్న గూడ్స్ రైలు ఢీకొన్నారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.ఈ ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వైద్య సిబ్బంది అంబులెన్‌లో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ససారం-రాంచీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ కుమాండిహ్ స్టేషన్ సమీపానికి వచ్చిన సమయంలో ఒక ప్రయాణీకుడు రైలుకు నిప్పుంటుకున్నదంటూ నానా హంగామా చేశాడు. దీంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వెంటనే కొందరు ప్రయాణికులు రైలు నుంచి కిందుకు దూకేశారు. ఈ సమయంలో ఎదురుగా ఒక గూడ్స్ రైలు వస్తోంది. దానిని ఢీకొన్న వారిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడినట్లు సమాచారం.విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం నేపధ్యంలో స్టేషన్లో ఉన్న ప్రయాణికుల్లోనూ ఆందోళన నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
జార్ఖండ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి!
జార్ఖండ్‌లోని ధన్బాద్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక దుకాణంలో మంటలు చెలరేగడంతో ముగ్గురు మృతి చెందారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఇద్దరు మహిళలతో పాటు నాలుగేళ్ల బాలిక కూడా ఉంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. ఈ ఘటన ధన్‌బాద్‌లోని కెందువాడీహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జెవార్ పట్టిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జేవర్ పట్టిలోని ఓ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ దుకాణంపైన ఒక ఇల్లు ఉంది. కొద్దిసేపటికే మంటలు ఆ ఇల్లంతా వ్యాపించాయి. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో ఆరుగురు ఉన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు నిచ్చెన సాయంతో ఆ ఇంట్లోకి చేరుకుని, ముగ్గురిని బయటకు తీసుకువచ్చారు. కాగా దుకాణంపైనున్న ఇంటిలో షాపు యజమాని సుభాష్ గుప్తా, అతని తల్లి తల్లి ఉమా దేవి, భార్య సుమన్ గుప్తా, నాలుగేళ్ల కుమార్తె మౌళి, ఏడాదిన్నర కుమారుడు శివాన్స్, సోదరి ప్రియాంక గుప్తా, సోదరుడు సుమిత్ ఉంటున్నారు. తీవ్రంగా గాయపడిన స్థితిలో ఆసుపత్రిలో చేరిన సుభాష్ తల్లి, కూతురు, సోదరి చికిత్స పొందుతూ మృతి చెందారు. సుమన్, సుమిత్, శివాన్స్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో సుభాష్, అతని తండ్రి అశోక్ ఇంట్లో లేరు. ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్ ఎన్నికల బరిలో వృద్ధనేతలు.. మాట తప్పిన పార్టీలు? -
Jharkhand: అక్రమ బొగ్గు గని కూలి ఘోరం
రాంచీ: జార్ఖండ్‌లోని ధన్బాద్లో ఇవాళ ఘోరం జరిగింది. అక్రమంగా నిర్వహిస్తున్న బొగ్గుగని ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం ముగ్గురు మృతిచెందగా.. అనేక మంది బొగ్గు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం పదిన్నర గంటల ప్రాంతంలో భారత్ కోకింగ్‌కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) భౌరా కాలరీ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. భౌరా పోలీసుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై సింద్రీ డీఎస్సీ అభిశేక్ కుమా మాట్లాడుతూ.. సహాయక చర్యలు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అంటున్నారు. గనిలోకి అక్రమంగా మైనింగ్ చేపడుతున్నప్పుడు స్థానిక గ్రామస్థులు అనేకమంది పనుల్లో ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికులు సత్వరమే స్పందించి ముగ్గురిని శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చామని, ఆ తర్వాత వారిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే వారు మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించినట్టు తెలిపారు. -
షాకింగ్ ఘటన.. ఇంట్లోకి దూసుకెళ్లిన విమానం
జార్ఖండ్: ధన్బాద్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గ్లైడర్ విమానం ఇంట్లోకి దూసుకెళ్లింది. బార్వాడా ఎయిర్‌స్ట్రిప్ నుంచి టేకాప్ అయిన కాసేపటికే ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పైలట్ సహా పద్నాలుగేళ్ల బాలుడు గాయపడ్డారు. ధన్‌బాద్‌లోని బర్వాడ్డ ఏర్స్ట్రిప్ నుంచి చిన్న విమానం బయలుదేరింది. టేక్ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ఎయిర్‌పోర్టుకు ఐదు వందల మీటర్ల దూరంలో ఉన్న ఓ ఇంటిని ఢీకొట్టగా, అందులో ఉన్న పైలట్, బాలుడు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో ఉన్నవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని ఇంటి యజమాని తెలిపారు. చదవండి: అమృత్‌పాల్ కేసులో ఊహించని ట్విస్ట్.. ఆమె అరెస్ట్ -
జార్ఖండ్‌లో ఘోరం.. 14 మంది సజీవ దహనం
ధన్‌బాద్: జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లాలోని ఓ బహుళ అంతస్థుల భవంతిలో జరిగిన అగ్నిప్రమాదంలో చిన్నారులు, మహిళలుసహా 14 మంది అగ్నికి ఆహుతయ్యారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. జోరాఫాటక్ ప్రాంతంలోని ఆశీర్వాద్ టవర్ రెండో అంతస్తులో అంటుకున్న అగ్నికీలలు వేగంగా విస్తరించడంతో వీరంతా సజీవదహనమయ్యారు. మరణించిన వారిలో ముగ్గురు చిన్నారులు, పది మంది మహిళలు ఉన్నారు. గాయపడిన 11 మందికి ఆస్పత్రిలో చికిత్సచేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సుఖ్‌దేవ్ సింగ్ చెప్పారు. మంటలు ఆర్పేందుకు 40 అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగాయి. అపార్ట్మెంట్లో ఇంకా కనీసం 50 మంది చిక్కుకుని ఉంటారని మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ ట్వీట్‌చేశారు. పరిస్థితిని జిల్లా డెప్యూటీ కమిషనర్ స్వయంగా ఘటనాస్థలికొచ్చి పర్యవేక్షిస్తున్నారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ చెప్పారు. Deeply anguished by the loss of lives due to a fire in Dhanbad. My thoughts are with those who lost their loved ones. May the injured recover soon: PM @narendramodi — PMO India (@PMOIndia) January 31, 2023 -
ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. డాక్టర్ దంపతులు సహా ఐదుగురు మృతి
రాంచీ: జార్ఖండ్ ధన్‌బాద్‌లోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం 2 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నర్సింగ్ హోం యజమాని డా.వికాస్ హజ్రా, అతని భార్య డా.ప్రేమ హజ్రా ఈ ప్రమాదంలో మరణించారు. వీరి బంధువు సోహన్ కుమారితో పాటు పనిమనిషి తారా దేవి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఐదో వ్యక్తిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ డాక్టర్ దంపతులు ఇంట్లోనే నర్సింగ్ హోం నడుపుతున్నారు. అయితే స్టోర్ రూంలో మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో దట్టమైన పొగలు కమ్ముకుని ఊపిరాడక ఐదుగురూ చనిపోయినట్లు తెలుస్తోంది. మరొకరికి గాయాలయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. చదవండి: బొగ్గు గనిలో దొంగతనానికి వెళ్లిన నలుగురు.. ఊపిరాడక.. -
ప్రేమించుకున్న అమ్మాయిలు.. పెళ్లి చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు, ట్విస్ట్ ఏంటంటే?
పెళ్లి అంటే సాధారణంగా ఓ అమ్మాయి.. ఓ అబ్బాయి కలిసి చేసుకునే వేడుక. ఇదే మనకు ఎక్కువగా తెలిసిన పెళ్లి. కానీ ఇద్దరు అమ్మాయిలు.. లేదా ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో స్వలింగ వివాహాలను ప్రభుత్వాలు ఆమోదించాయి. వీటిలో అర్జెంటీనా, ఆస్ట్రేలియయా, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, బెల్జియం, కెనడా, కొలంబియా, స్పెయిన్, జర్మనీ, దక్షిణాఫ్రికా, నార్వే, స్వీడన్, పోర్చుగల్, ఐర్లాండ్, మెక్సికో, డెన్మార్క్, ఉరుగ్వే ఉన్నాయి. స్వలింగ వివాహాలు విదేశాల్లో సహజమే అయినా.. భారత్‌లో మాత్రం విచిత్రంగానే పరిగణిస్తారు. అంతేగాక సమాజం, తల్లిదండ్రులు కూడా ఇలాంటి పెళ్లిళ్లను వ్యతిరేకిస్తారు. అయితే తాజాగా ఇద్దరు అమ్మాయిలు ఒకరినొకరు ప్రేమించుకొని ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని ధన్బాద్లో చోటుచేసుకుంది. జోరఖ్పుల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జామాడోబాలో ఉంటున్న రాఖిమిర్ధా (24), కరిష్మా రావత్ (23) ఇద్దరు స్నేహితులు. వీరి పరిచయం ప్రేమగా మారింది. దీంతో ఇంట్లో నుంచి పారిపోయి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాము ప్రేమించుకుంటున్నామని, జీవితాంతం కలుసుండాలనుకుంటున్నామని పోలీసులకు చెప్పారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు వారి కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి స్టేషన్‌కు పిలించారు. స్టేషన్‌కు వెళ్లిన ఇరు కుటుంబసభ్యులు వారి నిర్ణయానికి ఆశ్చర్యపోయారు. ఇద్దరికి నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు. ఎన్నో గంటల పాటు సర్దిచెప్పడంతో తమ తమ ఇళ్లకు వెళ్లడానికి ఆ అమ్మాయిలు ఒప్పుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని ఇంటికి తీసుకెళ్లిపోయారు. -
17 మంది అరెస్టు..243 మంది నిర్బంధం
ధన్‌బాద్/రాంచీ: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్ జిల్లా జడ్జి ఉత్తమ్ ఆనంద్ మృతి కేసుకు సంబంధించి పోలీసులు 243 అనుమానితులను అదుపులోకి తీసుకోవడంతోపాటు, 17 మందిని అరెస్టు చేశాయి. మరో 250 ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ ఎస్పీ సంజీవ్ కుమార్ సోమవారం వెల్లడించారు. జడ్జి మృతి ఘటన దృశ్యాలున్న సీసీటీవీ ఫుటేజీని బహిర్గతం చేయడం తదితర కారణాలతో ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఘటనపై ఏర్పాటైన సిట్ బృందం..వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆదివారం దాడులు నిర్వహించి 243 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని, విచారణ జరుపుతోందన్నారు. జిల్లాలోని 53 హోటళ్లలో సోదాలు జరిపి, జడ్జి మృతికి సంబంధమున్న 17 మందిని అరెస్టు చేసి, కేసులు పెట్టామన్నారు. మార్నింగ్ వాక్కు వెళ్లిన సమయంలో జడ్జిని ఢీకొట్టిన ఆటోను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామంటూ ఆయన..ప్రత్యేకంగా చేపట్టిన డ్రైవ్‌లో ఎటువంటి పత్రాలు లేని 250 ఆటోలను పట్టుకున్నట్లు వివరించారు. మృతి ఘటన సీసీ టీవీ ఫుటేజీని బహిర్గత పరిచినందుకు పోలీస్ సబ్ ఎన్స్పెక్టర్ ఆదర్శ్ కుమార్‌ను, ఆటో చోరీ ఫిర్యాదుపై రెండు రోజుల తర్వాత కేసు నమోదు చేసినందుకు గాను పథర్ది పోలీస్ స్టేషన్ ఇన్చార్జి ఉమేశ్ మాంఝిని సస్పెండ్ చేశామన్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు గురువారం ఆటో డ్రైవర్ లఖన్ వర్మ, అతని సహాయకుడు రాహుల్ వర్మను అరెస్ట్ చేశారు. కాగా, జడ్జి మృతిపై దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్లు సీఎం హేమంత్ సోరెన్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
జడ్జి హత్య కేసు సీబీఐకి
రాంచీ: ధన్‌బాద్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జి ఉత్తమ్ ఆనంద్‌ను దుండగులు సెవెన్ సీటర్ ఆటోతో ఢీకొట్టి చంపిన కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని జార్ఖండ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈ కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టాలని శనివారం సిఫారసు చేశారు. జూలై 28న మార్నింగ్ వాక్కు వెళ్లిన 50 ఏళ్ల ఉత్తమ్ ఆనంద్‌ను ఉద్దేశపూర్వకంగా వెనకనుంచి ఆటోతో ఢీకొట్టిన వీడియో వైరల్‌గా మారి దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. -
జాగింగ్ చేస్తున్న జడ్జిపైకి దూసుకెళ్లిన ఆటో
-
ప్రేమపెళ్లి: బాలికను వివాహమాడిన మరో బాలిక
ధన్‌బాద్: చిన్నప్పటి స్నేహం కాస్త ప్రేమ అయ్యింది. చివరకు ఒకరంటే ఒకరికి ప్రాణమయ్యారు. చివరకు పెళ్లి చేసుకున్నారు. అయితే ఇందులో ఏమీ వింత ఉంది అనుకుంటున్నారా. పెళ్లి చేసుకుంది యువతి యువకుడు కాదు. ఇద్దరు అమ్మాయిలే. పైగా వారిద్దరికి 18 ఏళ్లు కూడా నిండలేదు. ప్రస్తుతం వీరి ప్రేమపెళ్లి పోలీస్ స్టేషన్‌కు చేరింది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ ప్రాంతంలో సుగాయ్‌దిహ్ గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. వారి స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. ఈ క్రమంలోనే వారు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయాన్ని వారి ఇళ్లల్లో చెప్పగా షాక్‌కు గురయ్యారు. వారి పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించి అది తప్పని, వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దీంతో అందులో ఒకమ్మాయి అబ్బాయిగా వేషం మార్చింది. షర్ట్, ప్యాంట్ వేసుకుని పురుషుడిలా కనిపించింది. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని స్నేహితులను సంప్రదించారు. వారికి సహకరించేందుకు ఎవరూ ముందుకు రాకపోగా తిరస్కరించారు. దీంతో వారిద్దరూ ఓ గుడిలో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయం ఇంట్లో చెప్పకుండా ఇద్దరు వారి ఇళకు వెళ్లిపోయారు. అయితే తాళి కట్టించుకున్న అమ్మాయి మెడలో సోమవారం మంగళసూత్రం చూసిన ఆమె తల్లి ప్రశ్నించింది. తాళి ఎవరు కట్టారని గద్దించి అడగడంతో జరిగిన విషయం చెప్పింది. వారు వెంటనే సరాయిధేలా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు వివరించారు. 18 ఏళ్లు నిండకపోవడంతో వారిని తల్లిదండ్రుల వద్ద ఉండమని చెప్పగా ఆ అమ్మాయిలు నిరాకరించారు. తామిద్దరం కలిసి ఉంటామని చెప్పారు. అయితే వివాహ వయసు దాటాక మీ ఇష్టమని తాత్కాలికంగా చెప్పి పంపారు. వారి మనసుల మాదిరి వారిద్దరి పేర్లు కూడా ఒకటే. వారి ఇద్దరి పేర్లు పూజ కావడం గమనార్హం. -
అధికార పార్టీ దంపతులు దారుణ హత్య
రాంచీ : జార్ఖండ్‌లో అధికార పార్టీకి చెందిన సీనియర్ నేత, అతని భార్య హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. ధన్‌బాద్‌కు చెందిన జార్ఖండ్ ముక్తీమోర్చా (జేఎంఎం) నేత శంకర్ రావాణీ, అతని భార్య బాలికదేవీని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆదివారం తెల్లవారుజామున వారి ఇంటి పెద్ద శబ్ధాలు రావడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమీప వ్యక్తులు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న స్థానిక ఎస్పీ ఎస్క సిన్హా.. పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఓ తుఫాకితో పాటు పదునైనా కత్తిని స్వాధీనం చేసుకున్నారు. రాజకీయ, లేదా వ్యాపార ప్రత్యర్థులే ఈ హత్యలకు పాల్పడ్డట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేత హత్యపై స్థానిక కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసకోకుండా శంకర్ నివాసం వద్ద పెద్ద ఎత్తున బంధోబస్తును ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న ధన్‌బాద్ పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
అంత్యక్రియలకు డబ్బులు లేక ఓ తల్లి!...
రాంచీ : చనిపోయిన శిశువు అంత్యక్రియలు నిర్వహించటానికి డబ్బులు లేవన్న కారణంతో ఓ తల్లి మృత శిశువును జాతీయ రహదారిపై పడవేసింది. ఈ సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారో జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ధన్‌బాద్‌కు చెందిన డాలీ అనే మహిళ గత నెల 30వతేదీన పురిటి నొప్పులతో బొకారో జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరింది. ఆమెకు ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. కాగా అక్టోబర్ 1వతేదీన శిశువుకు గుండె సంబంధిత వ్యాధి ఉన్నట్లు వైద్యులు గుర్తించి చికిత్స చేయించాల్సిందిగా ఆమెకు సూచించారు. అయితే ఆమె పక్కనే ఉన్న మరో ప్రైవేటు ఆసుపత్రిలో శిశువును చేర్పించింది. ఆసుపత్రి వారు చికిత్స చేయటానికి రోజుకు 8వేల రూపాయలు వసూలు చేస్తుండటంతో ఆ ఖర్చు ఆమెకు పెను భారంగా మారింది. దీంతో అనారోగ్యంగా ఉన్న శిశువును వెంటబెట్టుకుని సొంత ఊరికి ప్రయాణమైంది. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత మార్గం మధ్యలో ఆ శిశువు కన్నుమూసింది. చనిపోయిన శిశువును ఇంటికి తీసుకువెళితే అంత్యక్రియల నిమిత్తం డబ్బులు ఖర్చు చేయవలసివస్తుందని భావించిన ఆమె శిశువును ప్లాస్టిక్ కవర్లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేసింది. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. శిశువు మృతదేహం ఉన్న చోటుకు చేరుకున్న పోలీసులు కవర్‌పై ఉన్న ఆసుపత్రి లోగో ఆధారంగా వివరాలు సేకరించి డాలీని అదుపులోకి తీసుకున్నారు. అంత్యక్రియలకు డబ్బులేని కారణంగానే మరణించిన బిడ్డను అలా రోడ్డు పక్కన పడేశానని డాలీ తెలిపింది. ఇప్పటికే కాన్పు ఖర్చుల నిమిత్తం అప్పులు చేయాల్సివచ్చిందని పేర్కొంది. -
కారుపై కాల్పులు.. నలుగురు మృతి
ధన్‌బాద్: జార్ఖండ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ధన్‌బాద్ మాజీ డిప్యూటీ మేయర్ నీరజ్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని దుండగులు కిరాతకంగా కాల్చిచంపారు. ధన్‌బాద్‌లోని స్టీల్‌గేట్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వచ్చిన దుండగులు నీరజ్ పాండే(32) ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారుని లక్ష్యంగా చేసుకొని విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. తీవ్ర బుల్లెట్ గాయాలైన నీరజ్‌తో పాటు బాడీగార్డ్ లైతు, డ్రైవర్ మున్నా, మిత్రుడు అశోక్ యాదవ్‌లను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. కాసేపట్లో కారు నీరజ్ ఇంటికి చేరుకుంటుందనగా.. ఓ స్పీడ్ బ్రేకర్ వద్ద దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. కారుపై సుమారు 50 బుల్లెట్లు తగిలిన గుర్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు. -
కటకటాలపాలైన ఐఐటీ విద్యార్థి
ధన్‌బాద్: ఈవ్ టీజింగ్ చేసినందుకు ఒక ఐఐటీ రీసెర్చ్ ఫెలో కటకటాల పాలయ్యాడు. ఈఘటన జార్ఖండ్ లోని ధన్‌బాద్ జిల్లా ఐఐటీ స్కూల్ ఆఫ్ మైన్స్ లో చోటుచేసుకుంది. పెట్రోలియం ఇంజినీరింగ్ డిపార్ట్ మెంటులోని పరిశోధక విద్యార్థి ప్రకాశ్ కుమార్ తమను అసభ్య పదజాలంతో దూషించాడని తోటి విద్యార్థినులు కళాశాల యాజమాన్యాన్ని సంప్రదించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశ్ పై ఎఫ్ఐఆర్ ను నమోదు చేసిన పోలీసులు అతన్ని న్యాయమూర్తి ఎదుటు హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రోజుల రిమాండ్ ను విధించారు. ప్రకాశ్ పోలీసులను కూడా బెదిరించడం గమనార్హం. -
గేట్లో మెరిసిన తెలుగుతేజం
సక్సెస్ స్పీక్స్ అందరూ నడిచే దారిలో నడకసాగించటం సాధారణం. కొత్త మార్గానికి బాటలు వేయాలనుకోవడం సాహసం. అదే తన విజయరహస్యం అంటున్నాడు మన తెలుగు తేజం గేట్ టాపర్ గోపు భరత్‌రెడ్డి. ఇటీవల ప్రకటించిన గ్రాడ్యూయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)-2014లో మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటిర్యాంకు సాధించాడు. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌లో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ప్రతిష్టాత్మక పోటీ పరీక్ష గేట్లోటాప్ ర్యాంకు సాధించటంపై స్పందిస్తూ.. తన విజయ రహస్యాలను సాక్షితో పంచుకున్నారు. ఊహించని ర్యాంకు మంచిర్యాంకు వస్తుందనుకున్నా. టాప్ ర్యాంక్ రావటం చాలా సంతోషంగా ఉంది. ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్, సబ్జెక్టులపై పూర్తిస్థాయి పట్టుతో దీన్ని సాధించగలిగా. ఈ ర్యాంకు కెరీర్లో మరింత దూసుకెళ్లేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం ఇస్తుందని భావిస్తున్నా. చదువులో నేను మొదట్నుంచీ బెస్ట్స్టూడెంట్నే. పేరెంట్స్.. బెస్ట్ ఫ్రెండ్స్ మాది కరీంనగర్ పట్టణంలోని రాంనగర్. నాన్న ఇంద్రసేనారెడ్డి బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్. అమ్మ లక్ష్మి గృహిణి. తమ్ముడు భార్గవ ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్నాడు. నేను పదో తరగతి వరకూ కరీంనగర్‌లోనే చదివా. ఇంటర్‌కు హైదరాబాద్ వచ్చా. ప్రస్తుతం ఇంజనీరింగ్ ఫైనలియర్ జార్ఖండ్‌లో చేస్తున్నా. ఫెయిల్యూర్.. సక్సెస్‌లలో అమ్మానాన్న ఇచ్చే మద్దతు చాలా ముఖ్యం. మా ఇంట్లో అమ్మానాన్న ఇచ్చిన ప్రోత్సాహమే మమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. మాది మధ్య తరగతి కుటుంబం. అందుకే సంపదకన్నా చదువే విలువైనదనే భావన పెంచారు. పదోతరగతిలో 552/600, ఇంటర్ 946/1000 మార్కులు వచ్చాయి. జేఈఈలో 5,900 ర్యాంకుతో జార్ఖండ్ ఐఐటీలో సీటొచ్చింది. మొదట్నుంచి ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన ఉండేది. అందుకే మైనింగ్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో చేరా. కోచింగ్ తీసుకోలేదు మొదటి సంవత్సరం నుంచే సబ్జెక్టులపై పట్టుసాధించేందుకు కృషి చేశా. ఏ రోజు సిలబస్‌ను ఆ రోజే పూర్తిచేసేవాణ్ని. వాయిదా వేయటం మరింత బద్దకాన్ని పెంచుతుందనేది నా నమ్మకం. అదే గేట్లో మంచిస్కోరు చేసేందుకు ఉపకరించింది. గేట్ కోసం ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. గతేడాది జాతీయస్థాయిలో 6వ ర్యాంకు సాధించిన నా సీనియర్ లీలాకృష్ణ సూచనలు ఉపకరించాయి.పరీక్షలో అధికశాతం ప్రశ్నలు మైనింగ్ సబ్జెక్టు నుంచే ఇచ్చారు. ఎక్స్‌ప్లోజివ్స్, కోల్డ్మైనింగ్, సేఫ్టీ, రాక్మెకానిజం వంటి అంశాల నుంచి ఇచ్చారు. జెమిన్, రతన్ తాటియా రాసిన బుక్స్ చదివా. ప్రాక్టీసు చేయాలి పోటీ పరీక్షల ప్రిపరేషన్ ఎప్పుడూ ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. సబ్జెక్టుపై కమాండింగ్తోనే మార్కులు సాధించాలనుకోవద్దు. థియరీపై అవగాహన పెంచుకుంటూ ప్రాబ్లమ్స్‌ను ఎక్కువ ప్రాక్టీసు చేయాలి. వీటన్నింటినీ మించి పాజిటివ్ థింకింగ్ ఎప్పుడూ కొత్త ఎనర్జీని అందిస్తుంది. ఫెయిల్యూర్స్ ఎదురైనపుడు ఆత్మవిశ్వాసాన్ని చెక్కుచెదరనీయకుండా చూసుకోవాలి. మైనింగ్‌తో కెరీర్ అద్భుతం దేశ, విదేశాల్లో పుష్కలమైన అవకాశాలున్న కోర్సు.. మైనింగ్ ఇంజనీరింగ్. మా సీనియర్లు చాలామంది ఉన్నత సంస్థల్లో మంచి హోదాలో పనిచేస్తున్నారు. పారిశ్రామిక రంగంలో కూడా కెరీర్‌ను ఉన్నతంగా మలచుకునే వీలున్న కోర్సు ఇది. గేట్ ర్యాంకుతో పీజీ, ఖరగ్‌పూర్ ఐఐటీలో చేరాలనుంది. ఎన్ ఎంబీసీ, జిందాల్, బిర్లా, కోల్ ఇండియా వంటి సంస్థలు మైనింగ్ కోర్సు పూర్తికాగానే జాబ్ ఆఫర్స్ ఇస్తున్నాయి. పోటీ పరీక్షలకు చదువుతూ వాటిల్లో విజయం సాధించి కెరీర్లో ఉన్నతంగా స్ధిరపడాలన్నదే నా లక్ష్యం! -
ధన్ బాద్ లో గనిలో కూలిన పైకప్పు, 4 గురు మృతి