
కారుపై కాల్పులు.. నలుగురు మృతి
ధన్‌బాద్: జార్ఖండ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ధన్‌బాద్ మాజీ డిప్యూటీ మేయర్ నీరజ్ సింగ్‌తో పాటు మరో ముగ్గురిని దుండగులు కిరాతకంగా కాల్చిచంపారు. ధన్‌బాద్‌లోని స్టీల్‌గేట్ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
బైక్‌పై వచ్చిన దుండగులు నీరజ్ పాండే(32) ప్రయాణిస్తున్న ఫార్చునర్ కారుని లక్ష్యంగా చేసుకొని విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. తీవ్ర బుల్లెట్ గాయాలైన నీరజ్‌తో పాటు బాడీగార్డ్ లైతు, డ్రైవర్ మున్నా, మిత్రుడు అశోక్ యాదవ్‌లను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందారని వైద్యులు ప్రకటించారు. కాసేపట్లో కారు నీరజ్ ఇంటికి చేరుకుంటుందనగా.. ఓ స్పీడ్ బ్రేకర్ వద్ద దుండగులు కాల్పులు జరిపి పారిపోయారు. కారుపై సుమారు 50 బుల్లెట్లు తగిలిన గుర్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు.